ఒలింపిక్స్‌ నుంచి రష్యా ఔట్‌ | Russia Banned For Next 2 Olympics And World Championship Due To Doping | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌లో రష్యాపై వేటు 

Published Fri, Dec 18 2020 8:13 AM | Last Updated on Fri, Dec 18 2020 9:23 AM

Russia Banned For Next 2 Olympics And World Championship Due To Doping - Sakshi

జెనీవా : కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (కాస్‌) గురువారం రష్యాపై రెండేళ్ల నిషేధం విధించింది. దీని ప్రకారం రానున్న రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో లేదా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఈవెంట్‌లలో రష్యా దేశానికి ప్రాతినిధ్యం ఉండదు. ఆ దేశం తరఫున ఎవరూ పాల్గొనడానికి వీల్లేదు. అంతేకాకుండా రెండేళ్ల పాటు ఎలాంటి క్రీడల ఆతిథ్య హక్కుల కోసం రష్యా బిడ్డింగ్‌లో పాల్గొనకూడదు. అయితే డోపింగ్‌తో సంబంధం లేనట్లు నిరూపించుకునే రష్యా ఆటగాళ్లు వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్, 2022 బీజింగ్‌ వింటర్‌ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ టోర్నీల్లో తమ దేశం తరఫున కాకుండా ‘న్యూట్రల్‌’ అథ్లెట్లుగా పాల్గొనేందుకు అనుమతిచి్చంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement