
భారత బాక్సర్లకు ‘ఐబా’ అండగా నిలవాలి: బింద్రా
భారత బాక్సింగ్ సమాఖ్యలో వివాదాన్ని పరిష్కరించి బాక్సర్లకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం అండగా నిలవాలని అభినవ్ బింద్రా కోరాడు.
భారత బాక్సింగ్ సమాఖ్యలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించి బాక్సర్లకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) అండగా నిలవాలని ఒలింపిక్ స్వర్ణపతక విజేత అభినవ్ బింద్రా కోరాడు. దీనిని త్వరలో చక్కదిద్ది భారత ఆటగాళ్లు దేశం తరఫున ‘రియో’లో పాల్గొనే అవకాశం కల్పించాలని అతను విజ్ఞప్తి చేశాడు.
రియో ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా వ్యవహరించనున్న బింద్రా బాకులో ప్రపంచ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొంటున్న బాక్సర్లను కలిశాడు. ప్రస్తుతం భారత సమాఖ్యపై నిషేధం కారణంగా భారత ఆటగాళ్లు ప్రధాన టోర్నీల్లో ‘ఐబా’ తరఫునే పాల్గొనాల్సి వస్తోంది.