రాష్ట్రస్థాయి స్టూడెంట్ ఒలింపిక్స్‌కు క్రీడాకారుల ఎంపిక
రాష్ట్రస్థాయి స్టూడెంట్ ఒలింపిక్స్‌కు క్రీడాకారుల ఎంపిక
Published Mon, Aug 22 2016 10:34 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(బందావనం): రాష్ట్రస్థాయి స్టూడెంట్స్ ఒలింపిక్స్‌కు జిల్లా క్రీడాకారుల ఎంపికను ఆది,సోమవారాల్లో నిర్వహించారు. జిల్లా స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయభరద్వాజ్‌రెడ్డి ఎంపికల వివరాలను వెల్లడించారు. బాలాజీనగర్, సరస్వతినగర్, కలివెలపాళెంలోని స్వామిదాస్, మోడరన్ స్కూల్, రెయిన్‌బో స్కూళ్ల మైదానాల్లో అండర్ 10 నుంచి అండర్–22 వరకు అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. అథ్లెటిక్స్‌లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన, టీం ఈవెంట్‌లలో మొదటి రెండుస్థానాల్లో నిలిచిన జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేసినట్లు వివరించారు. సెప్టెంబరు 10,11 తేదీల్లో నెల్లూరులో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. జిల్లా స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ సందీప్, సభ్యులు హరికష్ణ, మల్లికార్జున, ఆదినారాయణ తదితరులు ఎంపికలను పర్యవేక్షించారన్నారు.
Advertisement
Advertisement