రాష్ట్రంలో తొలి మహిళా ఒలంపిక్ క్రీడా సంఘం | first olympic women association | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో తొలి మహిళా ఒలంపిక్ క్రీడా సంఘం

Aug 10 2016 12:38 AM | Updated on Sep 4 2017 8:34 AM

క్రీడల్లో పురుషులతో పాటు మహిళలు రాణించాలని ఏపీ మహిళా ఒలంపిక్‌ సంఘం అధ్యక్షురాలు (ఫెన్సింగ్‌) కండె వాణి పిలుపునిచ్చారు.

నూనెపల్లె: క్రీడల్లో పురుషులతో పాటు మహిళలు రాణించాలని ఏపీ మహిళా ఒలంపిక్‌ సంఘం అధ్యక్షురాలు (ఫెన్సింగ్‌) కండె వాణి పిలుపునిచ్చారు. తైక్వాండో  సంఘం రాష్ట్ర కార్యదర్శి నంద్యాల మహేశ్వరరావు అధ్యక్షతన మహిళా సంఘాన్ని మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ మహిళలు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రంలో తొలి మహిళా ఒలంపిక క్రీడా సంఘం ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు. సంఘం అధ్యక్షురాలిగా కండె వాణి (ఫెన్సింగ్‌ కర్నూలు), ప్రధాన కార్యదర్శిగా మహేశ్వరరావు (తైక్వాండో), కోశాధికారిగా ఎల్‌. శాంతి (యోగా, కృష్ణాజిల్లా),ఉపాధ్యక్షులుగా సి.హెచ్‌.వి.విజయలక్ష్మి (ఫుట్‌బాల్, తూర్పుగోదావరి), నాగమాధవి (బాల్‌ బ్యాడ్మింటన్‌ చిత్తూరు)తో పాటు ముగ్గురిని సహాయ కార్యదర్శులుగా, ఆరు మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement