ముంబై: స్టార్ రెజ్లర్లు, ఒలింపిక్ పతక విజేతలైన సుశీల్ కుమార్, సాక్షి మలిక్‌ల కాంట్రాక్టు గ్రేడ్‌ను ‘బి’ నుంచి ‘ఎ’కు మారుస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టగా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, పూజా ధండాలకు ‘ఎ’ గ్రేడ్ దక్కింది. దీనిపై విమర్శలు రావడంతో డబ్ల్యూఎఫ్‌ఐ పొరపాటును సరిదిద్దుకుంది. ‘ఇది మా తప్పే. వారిద్దరూ ‘బి’ గ్రేడ్‌లో ఉండాల్సిన వారు కాదు. అందుకని ‘ఎ’లోకి మార్చుతున్నాం’ అని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ప్రకటించారు.
సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గాడు. సాక్షి 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుపొందింది. మరోవైపు డబ్ల్యూఎఫ్‌ఐ రెజ్లర్లను ‘ఎ’ నుంచి ‘ఎఫ్’ వరకు వర్గీకరించింది. సుశీల్, సాక్షి గ్రేడ్ ‘ఎ’లోకి వెళ్లడంతో ‘బి’లో ఎవరూ లేనట్లైంది. ‘సి’లో ఏడుగురు, ‘డి’లో 9 మంది, ‘ఇ’లో నలుగురున్నారు. అండర్–23 జాతీయ స్వర్ణ పతక విజేతలకు ‘ఎఫ్’లో చోటు దక్కుతుంది. డ్ ‘ఎ’లోకి సుశీల్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment