బోల్ట్‌కు గాయం
ఒలింపిక్స్‌కు ముందే కోలుకునే అవకాశం
కింగ్‌స్టన్: జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌కు ముందు గాయపడ్డాడు. జమైకా నేషనల్ ఒలింపిక్ ట్రయల్స్‌లో శుక్రవారం జరిగిన 100మీ. సెమీఫైనల్ హీట్‌ను 10.04 సెకన్లలో ముగించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ రేసు అనంతరం బోల్ట్ మోకాలు పైభాగంలో అసౌకర్యానికి గుర య్యాడు. ప్రస్తుతం బోల్ట్ తొడ కండరం నొప్పిని గ్రేడ్-1గా వైద్యులు నిర్ధారించారు. అయితే బోల్ట్ రియో ఆశలకు ఎలాంటి ప్రమాదం లేదు. మరో మూడు వారాల్లో లండన్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ద్వారా బోల్ట్ రియో బెర్తు దక్కించుకోవచ్చు.