గోపిచంద్ బయోపిక్లో ఒలింపిక్స్ ఉండవట | gopichands olympic Image not to feature in his biopic | Sakshi

గోపిచంద్ బయోపిక్లో ఒలింపిక్స్ ఉండవట

Published Fri, Aug 26 2016 1:31 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

గోపిచంద్ బయోపిక్లో ఒలింపిక్స్ ఉండవట

గోపిచంద్ బయోపిక్లో ఒలింపిక్స్ ఉండవట

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు పుల్లెల గోపిచంద్. గతంలో తాను క్రీడాకారుడిగా ఎన్ని విజయాలు సాధించినా రాని ఇమేజ్, ఇప్పుడు కోచ్గా సొంతం చేసుకున్నాడు గోపి. తన మార్గ నిర్థేశంలో పీవీ సింధు...

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు పుల్లెల గోపిచంద్. గతంలో తాను క్రీడాకారుడిగా ఎన్ని విజయాలు సాధించినా రాని ఇమేజ్, ఇప్పుడు కోచ్గా సొంతం చేసుకున్నాడు గోపి. తన మార్గ నిర్థేశంలో పీవీ సింధు ఒలింపిక్ మెడల్ సాధించటంతో గోపిచంద్ పేరు ఈ స్థాయిలో వినిపిస్తోంది. అదే సమయంలో గోపిచంద్ బయోపిక్గా తెరకెక్కుతున్న సినిమాకు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.

ఒలింపిక్స్ కన్నా ముందే ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినా.., సింధు విజయంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో సింధు ఒలింపిక్స్ విజయం సాధించిన సన్నివేశాలు ఉండవట. కేవలం గోపిచంద్ కెరీర్, క్రీడాకారుడిగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లతో పాటు తన తోటి క్రీడాకారిణి పీవీవీ లక్ష్మితో ఆయన ప్రేమ, వివాహం లాంటి అంశాలనే ఈ సినిమాలో చూపించనున్నారు.

స్వతహాగా బ్యాట్మింటన్ క్రీడాకారుడైన సుధీర్ బాబు ఈ సినిమాలో గోపిచంద్ పాత్రలో నటిస్తుండగా జాతీయ అవార్డు సాధించిన చందమామకథలు సినిమాను తెరకెక్కించిన ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించిన ఇతర వివారాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement