
సాక్షి, హైదరాబాద్: భారత మేటి బ్యాడ్మింటన్ క్రీడాకారులైన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ హైదరాబాద్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న ఏసీ బ్యాడ్మింటన్ కోర్టులో వీరిద్దరూ సరదాగా మ్యాచ్ ఆడనున్నారు. సోమవారం భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేతుల మీదుగా ఈ ఏసీ బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా సింధు, శ్రీకాంత్‌ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు, ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ వి. చాముండేశ్వరీనాథ్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన వారికి ప్రైజ్‌మనీ అందజేస్తామని అన్నారు. వీటితో పాటు సింధు, శ్రీకాంత్‌లకు కల్చరల్ సెంటర్‌లో గౌరవ సభ్యత్వం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment