ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రీడా రంగంలో తనదైన పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ తో చేతులు కలిపింది.
రిలయన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌లు సంయుక్తంగా దీర్ఘకాలికా భాగస్వామైనట్లు ప్రకటించాయి. తద్వారా భారతీయ అథ్లెట్లను ప్రోత్సహించడం, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లకు మద్దతు ఇవ్వడం, ప్రపంచ క్రీడా దేశంగా భారత్‌ను నిలబెట్టేలా లక్ష్యాలను నిర్దేశించింది.
ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ నీతా అంబానీ మాట్లాడుతూ, “ప్రపంచ క్రీడా రంగంలో భారత దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పడమే మా కల. భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను భారత్‌లో నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. 2024లో పారిస్ ఒలింపిక్ క్రీడలలో మొట్టమొదటిసారిగా ఇండియా హౌస్‌ని నిర్వహించేందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దేశం యెక్క అపారమైన ప్రతిభను, సామర్థ్యాన్ని, ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇదొక గొప్ప అవకాశమని నీతా అంబానీ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment