
టోక్యో: 2032 విశ్వక్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) బుధవారం ప్రకటించింది. 2000 సంవత్సరంలో సిడ్నీలో ఒలింపిక్స్ జరిగిన తరువాత తిరిగి 32 ఏళ్ల విరామం తర్వాత.. ఆస్ట్రేలియాలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. 1956 ఒలింపిక్స్‌కు మెల్‌బోర్న్ నగరం ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందిస్తూ..
విశ్వక్రీడల ఆతిధ్య హక్కులు తమ దేశానికి దక్కడం గౌరవంగా భావిస్తామని అన్నారు. అలాగే ఈ క్రీడలు విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం జరిగిన ఓటింగ్‌లో బ్రిస్బేన్‌కు 72-5 ఓట్లు పోలయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ తర్వాత 2024 విశ్వక్రీడలకు పారిస్ నగరం ఆతిధ్యం ఇవ్వనుండగా, 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజిల్స్ నగరంలో జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment