బీజింగ్: 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సమావేశాల నిర్వహణ హక్కులను భారత్ గెలుచుకుంది. 40 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా ఐఓసీ సమావేశాలు జరగనున్నాయి. 50 అంతర్జాతీయ క్రీడా సంఘాలు పాల్గొనే ఈ సమావేశాలు ముంబై నిర్వహించేందుకు ఐఓసీ అధికారులు నిర్ణయించారు. చివరిసారిగా ఐఓసీ సమావేశాలు 1983లో న్యూఢిల్లీ వేదికగా జరిగాయి. ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ, భారత్ బిడ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
ఐఓసీ సెషన్స్‌లో కమిటీ సభ్యులందరూ సమావేశమై గ్లోబల్ ఒలింపిక్ మూమెంట్ గురించి చర్చిస్తారు. అలాగే భవిష్యత్తులో ఏ నగరంలో ఒలింపిక్స్ నిర్వహించాలన్న విషయాన్ని నిర్ణయిస్తారు. బీజింగ్‌లో జరిగిన 139వ ఐఓసీ సమావేశంలో భారత్ నుంచి ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ, ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా, క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
చదవండి: IPL 2022: యూపీ సీఎంతో కేఎల్ రాహుల్ జట్టు ఓనర్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment