జెనీవా: విశ్వవేదికపై జెంటిల్మెన్ గేమ్‌ను చూడాలని ఆశించిన క్రికెట్ అభిమానుల ఆశలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నీళ్లు చల్లింది. 2028 లాస్ ఏంజిల్స్ విశ్వక్రీడల కోసం ఐఓసీ ప్రకటించిన 28 క్రీడల జాబితాలో క్రికెట్‌కు చోటు దక్కలేదు. క్రికెట్‌తో పాటు వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, ఆధునిక పెంటాథ్లాన్‌లకు చోటు కల్పించని ఐఓసీ.. స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్కోర్ట్ క్లైంబింగ్ వంటి పలు క్రీడలకు కొత్తగా అవకాశం కల్పించింది.
కాగా, విశ్వక్రీడల్లో క్రికెట్‌కు కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే.1900 పారిస్ గేమ్స్‌లో క్రికెట్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు.
ఇదిలా ఉంటే, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ సమాఖ్యల్లో నెలకొన్న అవినీతి, డోపింగ్ పరిస్థితుల కారణంగా ఆ రెండు క్రీడలపై ఐఓసీ వేటు వేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఆ రెండు క్రీడలను ప్రాధమిక జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ప్రవేశం కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఐఓసీ నుంచి ప్రాధమిక క్రీడల జాబితా వెలువడినప్పటికీ.. తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.
చదవండి: బంగ్లా క్రికెట్ జట్టులో ఒమిక్రాన్ కేసులు..
Comments
Please login to add a commentAdd a comment