International Boxing Association: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ)పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించింది. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సర్లకు ఏ ఇబ్బంది లేకుండా పోటీ పడే అవకాశమిచ్చారు. కొన్నేళ్లుగా ఐబీఏ వివాదాలతో వార్తల్లో నిలిచింది.
సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఐఓసీ ఎన్ని సార్లు సూచించినా ఐబీఏ మాత్రం పెడచెవిన పెట్టింది. దీంతో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు ఐబీఏను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్, ముంబా మాస్టర్స్ గెలుపు
దుబాయ్: గ్లోబల్ చెస్ లీగ్‌లో భాగంగా తొలి రోజు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్, గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్లు గెలుపొందాయి. గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ 10–4 పాయింట్లతో చింగారి గల్ఫ్ టైటాన్స్‌పై, ముంబా మాస్టర్స్ 8–7 పాయింట్లతో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ జట్టుపై విజయం సాధించాయి. ముంబా మాస్టర్స్‌కు ఆడిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment