అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్ష పీఠంపై ఇద్దరు మాజీ ఒలింపిక్ చాంపియన్లు, ఓ మిడిల్ ఈస్ట్ రాజు మొత్తంగా ఏడుమంది అభ్యర్థులు కన్నేశారు. ప్రస్తుత చీఫ్ థామస్ బాచ్ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చిలో అధ్యక్ష ఎన్నికలకు ఇదివరకే నోటిఫికేషన్ ఇవ్వడంతో చివరకు ఏడుగురు రేసులో నిలిచారు. ఇందులో ఎన్నికైన అభ్యర్థి ఎనిమిదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు పోటీలో 7 మంది ఉన్నట్లు ఐఓసీ సోమవారం ప్రకటించింది.
జింబాబ్వేకు చెందిన మహిళ కిర్ కొవెంట్రీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంది. ఈ జింబాబ్వే మాజీ స్విమ్మర్ ఒలింపిక్ చాంపియన్. 130 ఏళ్ల ఐఓసీ చరిత్రలో ఇప్పటి వరకు అంతా పురుషులే ఐఓసీని పాలించారు. ఒక వేళ మార్చిలో ఆమె గెలిస్తే ఐఓసీలో అధ్యక్ష పీఠాన్ని చేపట్టిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కుతుంది.
బ్రిటన్‌కు చెందిన మిడిల్ డిస్టెన్స్ రన్నర్ సెబాస్టియన్ కో కూడా మాజీ ఒలింపిక్ చాంపియన్. ఆయనతో పాటు జోర్డాన్ రాజు ఫైజల్ అల్ హుసేన్ కూడా ఐఓసీ పీఠంపై ఆసక్తి కనబరిచారు. మరో నలుగురు బరిలో నిలువగా 111 మంది సభ్యులు గల కమిటీ వచ్చే మార్చిలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనుంది.
చదవండి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్..
Comments
Please login to add a commentAdd a comment