లుసానే: టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త సాంప్రదాయానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తెర తీస్తోంది. మెగా ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పతాకధారులుగా (ఫ్లాగ్ బేరర్లు) ఇకపై ఒక దేశం నుంచి ఇద్దరిని అనుమతిస్తున్నట్లు ఐఓసీ ప్రకటించింది. ‘ఒక పురుష అథ్లెట్, ఒక మహిళా అథ్లెట్‌ను ఆయా దేశాలు తమ ఫ్లాగ్ బేరర్లుగా నామినేట్ చేయవచ్చు. ఇందు కోసం నిబంధనలు మార్చాం. అన్ని దేశాలు దీని ప్రకారం ఫ్లాగ్ బేరర్లను ఎంపిక చేస్తే బాగుంటుంది’ అని ఐఓసీ వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్‌తో పోలిస్తే 2020 ఒలింపిక్స్‌లో మహిళా సమానత్వానికి అమిత ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందులో పాల్గొనే అథ్లెట్లలో 48.8 శాతం మహిళలే ఉండటం దీనికి రుజువని కూడా ఐఓసీ పేర్కొంది. తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతీ దేశం నుంచి కనీసం ఒక పురుష, ఒక మహిళా అథ్లెట్ ఉండేలా చర్యలు తీసుకున్నామని కూడా స్పష్టం చేసింది. జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment