టోక్యో: వాయిదా పడిన ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ వచ్చే ఏడాది కుదరకపోతే ఇంకో వాయిదా ఉండనే ఉండదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) చీఫ్ థామస్ బాచ్ స్పష్టం చేశారు. 2021 వరకు కరోనా నియంత్రణలోకి రాకపోతే గేమ్స్ వాయిదాకు బదులు రద్దుకే మొగ్గు చూపుతామన్న జపాన్ ప్రభుత్వ వైఖరికి తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ‘జపాన్ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. విశ్వ క్రీడల ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా 3000–5000 మందికి ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం చాలా కష్టం. వాయిదా పడిన ప్రతీసారి క్రీడల షెడ్యూల్ మార్చలేం. గేమ్స్ అప్పుడు ఇప్పుడు అంటూ అథ్లెట్లను అనిశ్చితిలో ఉంచకూడదు. అందుకే వచ్చే ఏడాది నిర్వహణ సాధ్యం కాకపోతే ఒలింపిక్స్ రద్దుకే మొగ్గుచూపుతాం’ అని బాచ్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment