న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ కొనసాగించండి అని ఆటగాళ్లను ప్రోత్సహించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వ్యాఖ్యలపై భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అకాడమీలు అన్ని మూసేసిన ఈ పరిస్థితుల్లో ఎలా ప్రాక్టీస్ చేయమంటారని ట్విట్టర్ వేదికగా ఐఓసీని ప్రశ్నించాడు. ‘ప్రాకీŠట్స్ కొనసాగించమని ఐఓసీ మమ్మల్ని ప్రోత్సహిస్తోంది. కానీ ఎలా? ఎక్కడ? ఐఓసీ.. మీరు జోక్ చేస్తున్నారా?’ అని 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భారత షట్లర్లందరూ ప్రాక్టీస్ చేసే గోపీచంద్ అకాడమీ ఈనెల 31 వరకు మూసేశారని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ కొనసాగించండి ఐఓసీ అని అనడంలో అర్థం లేదని కశ్యప్ అన్నాడు. ‘ఇంకా చెప్పాలంటే అసలు ఒలింపిక్స్‌కు అర్హత ఎవరు సాధించారనే దానిపై స్పష్టత లేదు. ముందే అర్హత పొందిన క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు అకాడమీలు అందుబాటులో లేవు. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విదేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయండి అనడంలో అర్థం లేదు’ అని కశ్యప్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment