Surprised
-
పామును పట్టి, డబ్బాలో పెట్టి, నాలుగు రోజులకు తెరవగానే..
పామును చూడగానే చాలామంది భయపడిపోతుంటారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో పామును పట్టుకున్న తరువాత విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బుందేల్‌ఖండ్‌లోని మక్రోనియా పరిధిలోగల బెటాలియన్ ప్రాంతంలో పాములుపట్టే అఖిల్ బాబా ఇటీవల ఒక నాగు పామును పట్టుకున్నాడు. తరువాత దానిని ఒక పెట్టెలో బంధించాడు. నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెను తెరచి చూసి, ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టాడు. తన 30 ఏళ్ల అనుభవంలో తొలిసారిగా ఇలాంటి ఘటన జరిగిందని తెలిపాడు. తాను ఒక నాగు పామును పట్టుకుని పెట్టెలో బంధించి ఉంచానని, అయితే నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెలో నుంచి ఏవో శబ్ధాలు రావడంతో తెరిచి చూసేసరికి ఆ పాముతో పాటు ఏకంగా 16 పాము గుడ్లు కనిపించాయని తెలిపాడు. వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తానని అఖిల్ బాబా తెలిపారు.నాగుపాము అనేది పాము జాతులలో ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆడ నాగుపాము ఒకేసారి 10 నుండి 30 గుడ్లు పెడుతుంది. వాటి నుంచి 45 నుండి 70 రోజులలో పాము పిల్లలు బయటకు వస్తాయి. -
సాక్షాత్తు ఆయనే అలా చేయడం "ఆశ్చర్యంగా ఉంది": శరద్ పవార్
సాక్షి, ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఆయనే ఎన్నికల ప్రచారంలో అలా చేయడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాన్ని తీసుకున్నప్పుడూ అది భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.అది అసలు మంచిది కాదని చెప్పారు. ఐతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాము లౌకిక వాదాన్ని అంగీకరిస్తామని, పైగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం కోసమే ప్రమాణం కూడా చెప్పారు. కాగా, మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని బార్సు గ్రామంలో మెగా ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికుల విషయమై ప్రశ్నించగా..తాను వీలు కుదిరినప్పుడూ..ఆ ప్రదేశాన్ని సందర్శించడమే గాక నిపుణులతో చర్చించి.. గ్రామస్తుల సమస్యను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. (చదవండి: బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు.. సమస్యలపై ఆరా..) -
ఐఓసీ... జోక్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ కొనసాగించండి అని ఆటగాళ్లను ప్రోత్సహించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వ్యాఖ్యలపై భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అకాడమీలు అన్ని మూసేసిన ఈ పరిస్థితుల్లో ఎలా ప్రాక్టీస్ చేయమంటారని ట్విట్టర్ వేదికగా ఐఓసీని ప్రశ్నించాడు. ‘ప్రాకీŠట్స్ కొనసాగించమని ఐఓసీ మమ్మల్ని ప్రోత్సహిస్తోంది. కానీ ఎలా? ఎక్కడ? ఐఓసీ.. మీరు జోక్ చేస్తున్నారా?’ అని 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భారత షట్లర్లందరూ ప్రాక్టీస్ చేసే గోపీచంద్ అకాడమీ ఈనెల 31 వరకు మూసేశారని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ కొనసాగించండి ఐఓసీ అని అనడంలో అర్థం లేదని కశ్యప్ అన్నాడు. ‘ఇంకా చెప్పాలంటే అసలు ఒలింపిక్స్‌కు అర్హత ఎవరు సాధించారనే దానిపై స్పష్టత లేదు. ముందే అర్హత పొందిన క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు అకాడమీలు అందుబాటులో లేవు. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విదేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయండి అనడంలో అర్థం లేదు’ అని కశ్యప్ పేర్కొన్నాడు. -
ధావన్‌పై వేటు పడితే ఆశ్చర్యం లేదు!
ఇంగ్లండ్‌లో క్రికెట్ సీజన్ భారత్‌కు అనుకూలంగా మారిపోతుందనుకున్న దశలో కుర్రాడు స్యామ్ కరన్ నేతృత్వంలో ఆ జట్టు పేసర్లు ఒక్కసారిగా ఆశలు కూల్చేశారు. తొలి టెస్టును ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో గెలుచుకొని ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగిందంటే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్ వల్లనే. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ను ఒక వైపు కాపాడుకుంటూ మరో వైపు పరుగులు చేస్తూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని కేవలం 13 పరుగులకే పరిమితం చేయడం కన్నార్పకుండా చూడగలిగిన ప్రదర్శన. ఇతరులతో పోలిస్తే పరిస్థితికి తగినట్లుగా మానసికంగా సిద్ధం కావడం గొప్ప ఆటగాళ్ల లక్షణం. కోహ్లి తాను ఎదుర్కొన్న ప్రతీ బంతి ద్వారా దానిని నిజం చేసి చూపించాడు. ఆరంభంలో బంతి విపరీతంగా స్వింగ్ అవుతున్న సమయంలో పట్టుదలగా ఆడిన కోహ్లి ఆ ఉత్కంఠ క్షణాలను అధిగమించాడు. తన బ్యాక్ లిఫ్ట్‌లు మార్పు చేసి, బ్యాట్ వేగాన్ని తగ్గించి అతను ఫలితం సాధించాడు. ఆ తర్వాత తనదైన శైలిలో చక్కటి షాట్లతో చెలరేగిపోయాడు. దురదృష్టవశాత్తూ ఇతర ఆటగాళ్లు మాత్రం మానసికంగా సన్నద్ధం కాలేకపోయారు. ధావన్‌ను రెండో టెస్టునుంచి తప్పిస్తారనే వార్తలు వినిపించాయి. అది నిజమైతే మాత్రం నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. జట్టు ఎప్పుడు ఓడిపోయినా అందరికంటే ముందు అతనిపైనే వేటు పడుతూ వస్తోంది. ఓడిన మ్యాచ్‌లలో సహచరులకంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాల్లో కూడా ధావన్పైనే వేటు వేశారు. అతనిపై అంత అపనమ్మకం ఉంటే అసలు విదేశీ పర్యటనల్లో ఎంపిక చేయడమెందుకు? దీనికి ధావన్ తనను తాను నిందించుకోవాలి. చక్కగా ఆడుతున్న సమయంలో కూడా అనవసరంగా వికెట్ పారేసుకునే తత్వం అతనిది. కనీసం డబుల్ సెంచరీలాంటి ఇన్నింగ్స్ ఆడితే అతనిపై టీమ్ మేనేజ్మెంట్కు నమ్మకం పెరిగి ఇతరులలాగే అదనపు అవకాశాలు ఇస్తారు కదా. పిచ్‌లు బ్యాటింగ్‌కు స్వర్గధామంలా నిలిస్తే తప్ప ఈ సిరీస్‌లో తక్కువ స్కోర్లు నమోదు కాబోతున్నాయని తొలి టెస్టు రుజువు చేసింది. కాబట్టి అదనపు బ్యాట్స్‌మన్‌తో ఆడటం జట్టుకు ఉపయోగకరం. పుజారాకు అవకాశం ఉంది కానీ కార్తీక్, అశ్విన్, పాండ్యా కూడా స్వింగ్ అవుతు న్న బంతిని ఆడలేకపోతున్నారు కాబట్టి ఆరో బ్యాట్స్‌మన్ పనికొస్తాడు. అయితే పుజారాను తీసుకురావాలంటే ఒక నమ్మకమైన ఆటగాడిని తప్పించాల్సి వస్తుంది. అది మాటల్లో చెప్పినంత సులువు కాదు. -
నల్లధనంపై పోరులో ఇది ఒక అడుగు మాత్రమే...
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో భేటీ అయ్యారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రసంగించిన మోదీ డీమానిటైజేషన్ పై భారీ ఎత్తున తనకు లభించిన ఊహించని మద్దతు పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా పెద్దనోట్ల రద్దుకు మద్దతు అందించిన వారిందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షపార్టీలు రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రధాని మండిపడ్డారు. అవినీతినికి ప్రతిపక్షాలన్నీ మద్దతు పలకడం ఆశ్చర్యం కలిగించిందని విమర్శించారు. అవినీతి, నల్లధనం నిర్మూలనలో పెద్ద నోట్ల రద్దు ఒక 'ముందడుగు' మాత్రమే అంతే కానీ ఇదే ముగింపు కాదని ప్రధాని కొత్తసంకేతాలు అందించారు. భవిష్యత్తులో మరిన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయన్న హెచ్చరికలను అందించారు. సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకించేవారు కూడా డీమానిటైజేషన్ నిర్ణయానికి అండగా నిలిచారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి లభించిన సమైక్య మద్దతు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం విశేషం. నల్లదనం, అవినీతిని అంతం చేసేందుకు అధికార పక్షం పోరాడుతుంటే, విపక్షాలు మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యంకానీ పార్టీ ప్రయోజనాలు కాదని మోదీ ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం దేశం కన్నా పార్టీ ముఖ్యమని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చట్టాలు చేస్తారుకానీ అమలు చేయరని ఎద్దేవా చేశారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ నల్లధనం ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు బోఫోర్స్, స్పెక్ట్రమ్ కుంభకోణాలు జరిగినప్పుడు ప్రతిపక్ష ఎన్డీయే ఆందోళన చేసిందని, ఇప్పుడు..అవినీతిపై తాము పోరాడుతుంటే ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసమని వ్యాఖ్యానించారు. 1971లోనే పెద్ద నోట్లు రద్దుచేయాలి వాంచే కమిటీ కోరినా ఇందిరాగాంధీ పట్టించుకోలేదని మోదీ పేర్కొన్నారు. కానీ నల్లధనంపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోంటే అన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థతోనే దేశానికి భవిష్యత్తు అని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా నగదు రహిత లావాదేవీలను చేపట్టాలని ప్రధాని సూచించారు. ఈవిషయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. -
సుప్రీం తీర్పుపై సీఎం ఆశ్చర్యం
ముంబై: ఎనిమిది డాన్సు బార్లకు రెండురోజుల్లో అనుమతులు ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారును సుప్రీం కోర్టు ఆదేశించడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత చట్టం స్థానంలో కొత్త నిబంధనలు తెచ్చిందని నిబంధనలకు లోబడి ఉన్న బార్లకే అనుమతులు ఇస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ముంబైలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డాన్స్ బార్లపై రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా చట్టాన్ని ఆమోదించిందని, నిబంధనల ప్రకారమే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో మరోసారి తమ వాదనలు వినిపిస్తామని ఆయన తెలిపారు. నేర చరితుల జాబితాలోని వారిని బార్లలో నియమించడంపై బారు యాజమాన్యాలు హామీ ఇవ్వనందువల్లనే 8 బార్లకు అనుమతి నిరాకరించామని ప్రభుత్వం కోర్టులో తెలిపిన విషయం తెలిసిందే.