Sharad Pawar Comments On PM Modi's Karnataka Campaign, Surprised Over His Religious Slogans - Sakshi
Sakshi News home page

"ఆశ్చర్యంగా ఉంది": ప్రధాని మోదీ ప్రచారంపై శరద్‌పవార్‌ వ్యాఖ్యలు

Published Mon, May 8 2023 2:44 PM

Sharad Pawar On PM Modi's Karnataka Campaigning Surprised That - Sakshi

సాక్షి, ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఆయనే ఎన్నికల ప్రచారంలో అలా చేయడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాన్ని తీసుకున్నప్పుడూ అది భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.అది అసలు మంచిది కాదని చెప్పారు. ఐతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాము లౌకిక వాదాన్ని అంగీకరిస్తామని, పైగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం కోసమే ప్రమాణం కూడా చెప్పారు. 

కాగా, మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని బార్సు గ్రామంలో మెగా ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికుల విషయమై ప్రశ్నించగా..తాను వీలు కుదిరినప్పుడూ..ఆ ప్రదేశాన్ని సందర్శించడమే గాక నిపుణులతో చర్చించి..  గ్రామస్తుల సమస్యను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు.

(చదవండి: బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు.. సమస్యలపై ఆరా..)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement