sharad power
-
Maharashtra Politics: సుప్రీంకు వెళతాం: శరద్ పవార్
బారామతి(మహారాష్ట్ర): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అన్యాయపూరితమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ శనివారం పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సారథ్యంలోని చీలికవర్గమే అసలైన ఎన్సీపీ అని, పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కూడా అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తూ ఈసీతోపాటు స్పీకర్ నర్వేకర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
‘రామ మందిరం: రాజీవ్‌గాంధీ హయాంలోనే వేడుక జరిగింది’
అయోద్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దేశంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు రామాలయ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వాన ప్రతికలు అందజేస్తోంది. ఇక..ఈ కార్యక్రమంపై పలువురు రాజకీయ నాయకులు బీజేపీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేస్తోదని రాబోయే లోక్‌సభ ఎన్నికలకు పావుగా వాడుకుంటోందని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పింస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ రామ మందిర ప్రారంభోత్సవం విషయంలో మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై తీరుపై విమర్శలు చేశారు. వాస్తవానికి అయోధ్యలో రామ మందిర ఏర్పాటుకు మాజీ, దివంగత ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ హయాంలోనే కీలకమైన ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) చేసి వేడుక జరిపారని గుర్తు చేశారు. శరద్ పవార్ కర్ణాటకలోని నిపాణిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంగళవారం మాట్లాడారు. రామ మందర విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కేవలం రాజకీయం కోసమే చాలా హడావుడీ చేస్తున్నాయని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ‘శిలాన్యాస్’ (శిలాఫలకం శంకుస్థాపన) వేడుక చేశారని తెలిపారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాత్రం రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయోద్యలో బలరాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని 11 రోజులు ఉపవాసం ఉంటున్న విషయం తెలిసిందే. దానిపై కూడా సీనియర్ నేత శరద్ పవార్ స్పందిస్తూ.. రాముడిపై భక్తి, విశ్వాసం ఉండటాన్ని తాను గౌరవిస్తాన్నానని తెలిపారు. కానీ.. దేశంలో పేదరికం నిర్మూలించబడాలని ఉపవాసం చేస్తే దేశ ప్రజలు సైతం ప్రశంసిస్తారని హితవు పలికారు. చదవండి: అటల్ సేతుపై ఆటో రిక్షా.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు! -
సాక్షాత్తు ఆయనే అలా చేయడం "ఆశ్చర్యంగా ఉంది": శరద్ పవార్
సాక్షి, ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఆయనే ఎన్నికల ప్రచారంలో అలా చేయడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాన్ని తీసుకున్నప్పుడూ అది భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.అది అసలు మంచిది కాదని చెప్పారు. ఐతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాము లౌకిక వాదాన్ని అంగీకరిస్తామని, పైగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం కోసమే ప్రమాణం కూడా చెప్పారు. కాగా, మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని బార్సు గ్రామంలో మెగా ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికుల విషయమై ప్రశ్నించగా..తాను వీలు కుదిరినప్పుడూ..ఆ ప్రదేశాన్ని సందర్శించడమే గాక నిపుణులతో చర్చించి.. గ్రామస్తుల సమస్యను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. (చదవండి: బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు.. సమస్యలపై ఆరా..) -
సోనియా గాంధీ స్థానంలో శరత్ పవార్..
ముంబయి: నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్ సోనియా గాంధీ స్థానంలో తదుపరి యుపీఏ చైర్‌పర్సన్‌గా కొనసాగే అవకాశం ఉంది. సోనియా గాంధీ ఆరోగ్యం సరిగా లేనందున యుపీఏ చీఫ్‌గా కొనసాగడానికి ఆమె ఇష్టపడటంలేదు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఆమె అంత చురుకుగా పాల్గొనడంలేదు. ఇలాంటి సందర్భంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు పవార్ ఆమె అధికారికంగా వైదొలిగిన తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి నాయకత్వం వహించడానికి బాధ్యత తీసుకుంటారని సమాచారం. పవార్ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, యుపీఏ పార్టీలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి. సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో గణనీయమైన పట్టు సాధించాడు. రాహుల్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించినందున, పవార్‌ను యుపీఏ చైర్‌పర్సన్‌గా నియమించాలని కాంగ్రెస్ నాయకులలో ఒక విభాగం అభిప్రాయపడింది. లోక్‌సభ ఎన్నికలలో పరాజయం తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసాడు. తరువాత సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులలో ఒక భాగం రాహుల్ గాంధీని యుపీఏకి ముఖ్యుడిగా భావిస్తున్నారు. కాని శరద్ పవార్ యూపీఏ ఛైర్మైన్‌గా బాధ్యతలు స్వీకరించాలని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు ఇంతకుముందు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తరువాత కూడా కూటమిగా ఉన్నాయి. మహా వికాస్ అగాదిని ఏర్పాటు చేయడానికి శివసేన వారితో చేరిన తరువాత వారు ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలించారు. ఇటీవలకాలంలో కొనసాగుతున్న రైతుల నిరసనపై చర్చించడానికి ప్రతిపక్ష నాయకులు భారత రాష్ట్రపతిని కలిసినప్పుడు, మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఉన్నప్పటికీ, శరద్ పవార్ ప్రతినిధిగా బృందానికి నాయకత్వం వహించారు. సోనియా గాంధీ విదేశీ మూలాన్ని ఉటంకిస్తూ 1991 లో రాజీనామా చేసిన వారిలో శరద్ పవార్ కూడా ఉన్నారని గమనించాలి. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి కాంగ్రెస్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు నిర్వహిస్తుంది. రాహుల్ గాంధీ ఈ పదవిని చేపట్టడానికి ఇష్టపడకపోగా, పార్టీ త్వరలో కొత్త అధ్యక్షుడిని పొందే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దేశాన్ని నడిపించే శక్తి ఎన్సీపీ చీఫ్‌కు ఉందన్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో తమ పార్టీ పొత్తు పెట్టుకుని అధికారంలో ఉందని రౌత్ విలేకరులతో అన్నారు. పవార్‌కు అన్ని విషయాలపై అనుభవం, దేశం సమస్యల పరిజ్ఞానం, ప్రజల పల్స్ తెలుసు అని సేన ఆయన అన్నారు. దేశాన్ని నడిపించే సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయన్నారు. డిసెంబర్ 12 న పవార్ 80వ పుట్టినరోజును ప్రస్తావిస్తూ శివసేన తరపున అతనికి శుభాకాంక్షలు తెలియజేసారు. -
‘2019 తరువాత ప్రధానిగా మోదీ ఉండరు’
సాక్షి, ముంబై : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పరాభావం తప్పదని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలో సాగుతున్న బీజేపీ పాలన తిరిగి అధికారం నిలబెట్టుకోలేదని.. మహారాష్ట్రలో కూడా తిరిగి అధికారంలోకి రావడం అంత తేలిక కాదని ఆయన అభిప్రాపడ్డారు. మంగళవారం ముంబైలో జరిగిన ఓ మారథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పార్లమెంటేరియన్ పలు అంశాలపై ముచ్చటించారు. 2019లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశం లేదని.. 2004లో జరిగిన విధంగానే విపక్షాలతో కూటమి ఏర్పడక తప్పదని అన్నారు. రాహుల్ కష్టమే.. ఆయన మాట్లాడుతూ.. ‘‘1999 నుంచి 2004 వరకు ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి పాలనపై ప్రజల్లో అంత వ్యతిరేకత లేకపోయినా.. 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే పునరావృత్తమైయ్యే అవకాశం లేకపోలేదు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకవపోవచ్చు. ప్రతిపక్షాల్లో మోదీని ఢీ కొట్టే నాయకడు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. విపక్షాలు అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరనేది స్పష్టత లేదు. 2004లో అనూహ్యంగా ఆర్థికగా వేత్త మన్మోహన్ సింగ్ ప్రధాని ఐనట్లు ఎవరైనా కావచ్చు. రానున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ మోదీ, రాహుల్ మధ్య ఉంటుందనుకుంటే పొరపాటే. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి నిలబడే అవకాశం లేదు. కూటమి మధ్య అవగహన ఏర్పడడం కష్టమే’’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పేరును పవార్ కొట్టిపారేశారు. ఎన్నికల ముందుగానే రాహుల్‌ను ప్రధానిగా ప్రకటించి.. కాంగ్రెస్ పార్టీ సాహాసం చేయలేదని అన్నారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించమని మాజీ కేంద్ర మంత్రి ఇటీవల పీ. చిదంబరం ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రాజస్తాన్‌లో బీజేపీకి ఓటమి తప్పదని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పోటీ నెలకొందని విశ్లేషించారు. కాగా ఎన్నికల నుంచి శరద్ పవార్ రిటైరైన విషయం తెలిసిందే. చివరి సారిగా జరిగిన 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ప్రస్తుతం పవార్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. -
కీలక భేటీకి ఎన్సీపీ డుమ్మా
న్యూఢిల్లీ: పాలక బీజేపీపై సమైక్య పోరాటాలకు పదును పెట్టేందుకు కార్యాచరణ కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కీలక భేటీకి ఎన్సీపీ హాజరుకాకపోవడం విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీకి దగ్గరవుతారా అనే ఆందోళన ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతున్నది.ఉత్కంఠ రేపిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ విజయం సాధించడం విపక్షాల్లో నైతిక స్థైర్యం నింపిన క్రమంలో తాజాగా ఎన్సీపీ వైఖరి నిరాశపరిచింది. పాలక బీజేపీపై రానున్న రోజుల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో సమన్వయంతో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టే అధికారాన్ని 16 విపక్ష పార్టీల నేతలు కట్టబెట్టారు. కాంగ్రెస్ అధిన్రేతి సోనియా గాంధీకి కట్టబెడుతూ ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో కేవలం ఒక సభ్యుడే కాంగ్రెస అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేయడం, తాజా భేటీకి ఎన్సీపీ దూరం కావడం వంటి పరిణామాలతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయని భావిస్తున్నారు. ఇక విపక్షాల భేటీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే వరకూ ప్రభుత్వంపై సమిష్టి కార్యాచరణతో పోరాటాలు చేపట్టాలని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సూచించారు. బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఆందోళనల్లో విపక్షాలు పాలుపంచుకోవాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. -
ప్రధాని మోదీపై సీనియర్ లీడర్ ప్రశంసలు
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానిమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ పార్టీలు విముర్శలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. ఎన్సీపీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ నుంచి ఊహించనిరీతిలో ప్రశంసలు దక్కాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని శరద్ పవార్ స్వాగతించారు. ఇది సరైన నిర్ణయమని పేర్కొన్నారు. శరద్ పవార్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 50 ఏళ్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సీనియర్ నేత పవార్ అని ప్రశంసించారు.