బోల్ట్ చేజారిన రిలే స్వర్ణం
లుసానే: జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ సాధించిన తొమ్మిది ఒలింపిక్ స్వర్ణాలలో ఒకటి తగ్గనుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బోల్ట్, మైకేల్ ఫ్రాటెర్, అసఫా పావెల్, నెస్టా కార్టర్ సభ్యులుగా ఉన్న జమైకా రిలే జట్టు 4్ఠ100 మీ టర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది.
అయితే ఈ రిలే జట్టు సభ్యుడైన నెస్టా కార్టర్ డోపింగ్‌లో పట్టుబడటంతో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఈ ఫలితాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బోల్ట్ వరుసగా మూడు ఒలింపిక్స్ (2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో) క్రీడల్లో మూడేసి స్వర్ణాలు (100, 200 మీటర్లు, 4్ఠ100 మీ.రిలే) సాధించాడు.