నేటి నుంచి ప్రణబ్ విదేశీ పర్యటన | Mukherjee leaves on Sunday for five-day visit to Sweden, Belarus | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రణబ్ విదేశీ పర్యటన

Published Sun, May 31 2015 9:58 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM

నేటి నుంచి ప్రణబ్ విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రణబ్ విదేశీ పర్యటన

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం స్వీడన్, బెలారస్ దేశాలలో పర్యటనకు బయలుదేరనున్నారు. ఆయన తొలుత స్వీడన్ చేరుకుంటారు. జూన్ 2 వ తేదీ వరకు ఆయన స్వీడన్లో పర్యటిస్తారు. అందులోభాగంగా స్వీడన్ రాజు, రాణీతో ప్రణబ్ ముఖర్జీ భేటీ కానున్నారు. అలాగే స్వీడన్ ప్రధాని పార్లమెంట్ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడిని కూడా ప్రణబ్ కలవనున్నారు. స్వీడన్లోని స్మార్ట్ సిటీలతోపాటు యూరోప్లో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒక్కటైన ఉప్పశాలను ప్రణబ్ ముఖర్జీ సందర్శించనున్నారు.  ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా విద్యా, వ్యాపారం, అరోగ్యం తదితర అంశాలపై ఒప్పందాలు చేసుకోనున్నారు.

అనంతరం ప్రణబ్ ముఖర్జీ బెలారస్ చేరుకుంటారు. ఆ దేశాధ్యక్షుడితో సమావేశం కానున్నారు. ప్రణబ్,ఆ దేశాధ్యక్షుడితో కలిసి సంయుక్త వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. జూన్ 4వ తేదీన ప్రణబ్ భారత్కు తిరిగి వస్తారు. ప్రణబ్ వెంట వెళ్లిన బృందంలో కేంద్ర ఎరువులు మరియు రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారామ్ అహీర్, పార్లమెంట్ సభ్యులు గులాం నబి ఆజాద్, అశ్వీని కుమార్, దేశంలోని ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన ఏడుగురు వైస్ చాన్సలర్లతోపాటు 60 మంది భారతీయ వ్యాపారవేత్తలు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement