మిన్‌స్క్: రష్యాలో స్వల్పకాలిక తిరుగుబాటు విఫలయత్నం అనంతరం తమ దేశానికి చేరుకున్న వాగ్నర్ గ్రూప్‌నకు బెలారస్ అధ్యక్షుడు ఓ ఆఫర్ ఇచ్చారు. తమ దేశ మిలటరీకి శిక్షణ ఇవ్వాలంటూ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్‌ను అధ్యక్షుడు లుకషెంకో కోరారు. ‘ఇక్కడికి వచ్చి మన సైన్యానికి యుద్ధ నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని వాగ్నర్ గ్రూప్‌ను కోరాం. వారి అనుభవం మాకెంతో అవసరం’అని ఆయన అన్నట్లు అధికార వార్తా సంస్థ బెల్టా వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా పోరాడుతూ సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్న వాగ్నర్ గ్రూప్‌ను పశి్చమదేశాలు ద్వేషిస్తున్నాయన్నారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంతటి స్థాయిలో ప్రపంచ సైనిక–రాజకీయ సంక్షోభం ఏర్పడబోతోందని హెచ్చరించారు. దీనిని పరిష్కరించడానికి చర్చల అవసరాన్ని పశి్చమదేశాలు గుర్తించడం లేదని విమర్శించారు. పోలెండ్ మరో ఉక్రెయిన్ మాదిరిగా మారబోతోందని, ఆ దేశానికి ఈయూ, అమెరికా ఆయుధాలు అందిస్తున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment