ఆఫర్లంటే ఇష్టపడని వారుండరు. అందుకే కంపెనీలు, రెస్టారెంట్లు సైతం డిస్కౌంట్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. ఓ రెస్టారెంట్ యజమాని వినూత్నమైన ఆఫర్‌తో కస్టమర్ల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఇలాంటి ఆఫర్ ప్రకటించినందుకు కొంత మంది తిట్టుకుంటున్నారు కూడా. అసలు ఈ రెస్టారెంట్ కథేంటంటే... అమెరికాలో హార్ట్ ఎటాక్ గ్రిల్ అనే రెస్టారెంట్ ఉంది. హాస్పిటల్-థీమ్ సర్వీస్ కారణంగా ఈ రెస్టారెంట్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో వెళ్లి చూస్తే అచ్చం ఆసుపత్రిలానే ఉంటుంది.
అంతేకాకుండా ఇందులో వంట చేసేవాళ్లు, వడ్డించేవారు డాక్టర్లు, నర్సుల్లా తెల్లకోటు ధరించి ఉంటారు. మగవారైతే డాక్టర్లుగా, ఆడవారు నర్సుల్లా పనిచేస్తుంటారు. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ రెస్టారెంట్‌లో తినాలనుకుంటే కస్టమర్లు సైతం పేషంట్లలా తయారవ్వాలి. హార్ట్ ఎటాక్ గ్రిల్‌లోని మెనూలోకి వస్తే, ఇందులో కూడా క్వాడ్రపుల్ బైపాస్ బర్గర్‌ల వంటి పేర్లుతో కనిపిస్తాయి. ఇటీవల ఈ రెస్టారెంట్ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది
158 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నవారికి ఉచితంగా రుచికరమైన ఆహారాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. ఇంకేముందు లావుగా ఉన్నవాళ్లు డైటింగ్ పక్కన పెట్టి ఇందులో ఈటింగ్ మొదలుపెట్టారు. బంఫర్ ఆఫర్‌ను వదులుకోలేక ఆమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రెస్టారెంట్‌కి వెళ్లి లాగించేస్తున్నారు.ఈ తరహా ఆఫర్లను ఇవ్వడమంటే అది ఊబకాయాన్ని ప్రోత్సహించడమేనని కొందరు భావించారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ వారి జీవితాలను రిస్క్‌లో పెడుతున్న ఈ రెస్టారెంట్‌ను మూసివేయాలని ట్విటర్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నెట్టింట ఈ రెస్టారెంట్‌పై ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి. ఇంత జరుగుతన్నా ఈ రెస్టారెంట్ కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
చదవండి: ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్!
Comments
Please login to add a commentAdd a comment