restuarents
-
తళుకుల మాటున కల్తీమాయ!
ఎవరైనా ఆహారం ఎందుకు తింటారు? బతకడానికి. ఆరోగ్యంగా జీవించడానికి. కానీ.. గ్రేటర్ నగరంలోని హోటళ్లలో తింటే ‘ఆహారంతోనే రోగం’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. హోటళ్లతో పాటు బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు, ఐస్‌పార్లర్లు అన్నింటా ఇదే దుస్థితి. ముడిసరుకుల నుంచి తినుబండారాల దాకా, ఫుట్ఫాత్ బండ్ల నుంచి స్టార్‌హోటళ్ల దాకా ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా కల్తీ జరుగుతోంది. దాదాపు గత 40 రోజులుగా అధికారుల తనిఖీల్లో కల్తీ.. శుభ్రత, నాణ్యతల లేమి బట్టబయలవుతున్నాయి. ఇప్పటి దాకా భారీ పెనాలీ్టలు, మూసివేతలు, తగిన శిక్షలు అమలు కాకపోవడం అందుకు ఓ కారణం కాగా, లంచాలకు మరిగిన అధికారులపై చర్యలు లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. నగరంలోని హోటళ్లలో లభించే ఆహార పదార్థాల్లో కల్తీకేదీ కాదు అనర్హం అన్న చందంగా మారింది. ఏ హోటల్ చూసినా ఏమున్నది గర్వకారణం.. అడుగడుగునా ఆహారం నకిలీమయం అన్నట్లు.. గ్రేటర్‌లోని హోటళ్లలో కల్తీ పదార్థాలపై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వీటిలో కల్తీ ఎక్కువ.. కల్తీ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారమున్న వాటిలో టీ పొడి నుంచి నూనెల దాకా ఎన్నో ఉన్నాయి. పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్‌క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి తదితరమైనవి. వీటిలోని కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. మసాలా దినుసుల్లోని గసగసాలు, దాలి్చనచెక్క, లవంగాలు, యాలకులు వంటి వాటిలో 20 శాతం అసలువి కాగా 80 శాతం కల్తీవి కలుపుతారని సమాచారం. వీటితో పాటు జంతు కళేబరాలు, కొవ్వు, ఎముకల నుంచి తయారు చేస్తున్న కల్తీనూనె నగరంలో వినియోగంలో ఉంది.కల్తీ ఇలా.. మచ్చుకు..– తేనె పేరిట గ్లూకోజ్‌వాటర్‌లో పంచదార పాకం, వార్నిష్, డ్రైఫ్రూట్స్ మిశ్రమం కలిపి విక్రయిస్తున్నారు. రంగుల తయారీలో వాడే యాసిడ్లు, హానికర రసాయనాలతో సోంపు తయారు చేస్తున్నారు. రంగుల పరిశ్రమల్లో వాడే సల్ఫ్యూరిక్ యాసిడ్, వార్నిష్, కుళ్లిన ఆలుగడ్డలతో వెల్లుల్లి పేస్ట్.– ఓల్డ్‌సిటీలోని చావ్‌నీబస్తీలోని గోదాముల్లో జంతు కళేబరాల నుంచి నూనె తయారీని గతంలో గుర్తించారు. ఉప్పుగూడ, బహదూర్‌పురా, ఘాన్సీబజార్, బాలానగర్, మియాపూర్ ,మైలార్‌దేవ్‌పల్లి, టాటానగర్ , మల్లాపూర్, జల్పల్లి, శంకర్‌నగర్ తదితర ప్రాంతాల్లో కల్తీ జరుగుతుండటాన్ని గుర్తించినా పూర్తిగా నిలువరించలేకపోయారు.నిబంధనలకు నీళ్లు.. – ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్ఎస్ఎస్ఏ)మేరకు, అన్ని ఆహార విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు, వాటి లైసెన్సుల వివరాలు జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆన్లైన్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా అమలు కావడం లేదు. తనిఖీలు జరిపి కల్తీని బట్టి చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాల ఉత్పత్తి స్థానం నుంచి ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం వరకు ఎక్కడా కల్తీ జరగకుండా ఉండాలంటే తగిన ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాలి.కల్తీని వెంటనే నిర్ధారించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి కానీ ఏదీ లేదు.కాగితాల్లోనే యాప్.. – హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్నీ సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఆటోమేటిక్‌గానే వేటికి ఎంత జరిమానానో పేర్కొంటూ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్న మాటలు కార్యరూపం దాల్చలేదు. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల నుంచి ఆన్లైన్ ఆర్డర్లపై, క్లౌడ్ కిచెన్లు, హోటళ్ల టేక్అవే విండోల ద్వారా తీసుకుంటున్న ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులందుతున్నాయి. – ప్రతి హోటల్లోనూ ట్రేడ్ లైసెన్సు ఫుడ్ లైసెన్సు సర్టిఫికెట్లు కనిపించేలా ఉంచడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా సరఫరా చేయాలి. దాంతోపాటు వివిధ నిబంధనలున్నాయి. వాటిని పాటించకపోతే జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు జరిమానాలు విధించాలి.పకడ్బందీగా అమలు కాని పెనాల్టీలు.. తయారీకి సిద్ధం చేసిన, తయారైన ఆహార పదార్థాలపై దుమ్మూ ధూళి ఉన్నా, కిచెన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేకపోయినా, కిచెన్ శుభ్రంగా లేకున్నా, సిబ్బంది చేతులకు గ్లౌజులు, తలకు టోపీ ధరించకున్నా, ఉద్యోగులకు నిరీ్ణత వ్యవధుల్లో హెల్త్ చెకప్‌లు చేయించకున్నా, అపరిశుభ్రత, పగిలిన పాత్రలు వినియోగించినా రూ. 500 నుంచి పెనాలీ్టలున్నాయి. కానీ పకడ్బందీగా అమలు కావడం లేదు.పేరు గొప్ప.. తీరు దయనీయం..దాదాపుగా 40 రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తించిన వాటిల్లో చిన్న వాటి నుంచి పెద్ద సంస్థల వరకున్నాయి. సీట్ల కోసం ప్రజలు వెయిట్ చేసే ప్రముఖ సంస్థలు కూడా వీటిల్లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్రీమ్‌స్టోన్, నేచురల్స్ ఐస్‌క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీ, హౌస్ రాయలసీమ, రుచుల షా, గౌస్ కామత్ హోటల్, 36 డౌన్‌టౌన్ బ్య్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఏయిర్ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్, సిజ్లింగ్ జోయ్, ఖాన్‌సాబ్, సుఖ్‌సాగర్ రెస్టారెంట్, జంబోకింగ్ బర్గర్స్, రత్నదీప్ రిటైల్ స్టోర్, అట్లూరి ఫుడ్స్ ప్రై వేట్ లిమిటెడ్(చట్నీస్ కాఫీహౌస్ అండ్ వెజ్ రెస్టారెంట్),షాన్‌బాగ్ హోటల్ డీలక్స్, గౌరంగ్ డిజైన్స్ ఇండియా ప్రై వేట్ లిమిటెడ్, కృతుంగ పాలేగార్స్ క్విజి, హెడ్‌క్వార్టర్స్ రెస్టో బార్, తదితరమైనవి వీటిల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.Task force team has conducted inspections in the Madhapur area on 23.05.2024. The Rameshwaram Cafe* Urad Dal (100Kg) stock found expired in Mar'24 worth Rs. 16K* Nandini Curd (10kg), Milk (8L) worth Rs. 700 found expired Above items discarded on the spot.(1/4) pic.twitter.com/mVblmOuqZk— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 23, 2024 ఆరోగ్యం ఖతం.. కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. శరీరానికి అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. తాము పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీవల్ల జీవక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. కల్తీ ఆహారంతో అక్యూట్ డయోరియల్ డిసీజెన్ వస్తాయని ఫీవర్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు.రంగంలోకి టాస్‌్కఫోర్స్..వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులందుతుండటంతో స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్ టీమ్స్ దాదాపు 40 రోజులుగా తనిఖీలు జరుపుతున్నాయి. దాదాపు వంద హోటళ్లు, ఇతరత్రా సంస్థల్లో జరిపిన తనిఖీల్లో 90 శాతం నిబంధనల కనుగుణంగా లేవు. కిచెన్, స్టోర్‌రూమ్స్ శుభ్రంగా లేవు, బొద్దింకలు, ఇతరత్రా క్రిమికీటకాలు సంచరిస్తున్నాయి.ఎక్స్పైర్డ్ ఐటంలు అమ్ముతున్నారు. బ్రాండ్ పేరు ఒకటైతే వేరే సరుకు అమ్ముతున్నారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు, చట్టాల మేరకు 24 కేసులు నమోదు చేశారు. – చెరుపల్లి వెంకటేశ్జరిమానాలు ఇలా (రూపాయలో)..ట్రేడ్ లైసెన్సు ఉన్న ఫొటో కనపడకుంటే - 520 తాగునీరు ఉచితంగా ఇవ్వకుంటే - 1000 వ్యర్థాలను తడి,పొడిగా వేరు చేయకుంటే - 1000 టాయ్లెట్లు శుభ్రంగా లేకుంటే - 5000 టాయ్లెట్లు లేకుంటే - 2000 మురుగునీటి వ్యవస్థ లేకుంటే - 5000 భూగర్భ డ్రై నేజీ లేకుంటే - 10,000 ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేకుంటే - 10.000 భవనం అక్రమ నిర్మాణమైతే - 10,000 పై అంతస్తుల్లో బట్టీలు ఏర్పాటు చేస్తే - 10,000 50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ వాడితే - 10,000 కోల్డ్ చాంబర్లో నిర్ణీత ఉష్ణోగ్రత లేకుంటే - 500 వండిన ఆహారపదార్థాలు నిల్వ ఉంచితే - 5002023లో.. అందిన ఫిర్యాదులు : 2885 తనిఖీలు చేసినవి : 1685 జీహెచ్ఎంసీ పరిధిలో లేనివి : 1047 ఇతర కేటగిరీవి : 165 పెండింగ్ : 15 జీహెచ్ఎంసీలో ఉండాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు : 31 పనిచేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు : 23గత మూడేళ్లలో..లైసెన్సుల జారీ : 33251 వసూలైన ఫీజు : రూ.9,71,02,700 స్ట్రీట్ వెండర్స్ ‘రిజిస్ట్రేషన్లు : 36334 వచ్చిన ఫీజు : రూ.59,48,270 ఫేడ్‌సేఫ్టీపై శిక్షణలిచ్చి జారీ చేసిన సర్టిఫికెట్లు : 1570 ఫిర్యాదు చేసేందుకు..జీహెచ్ఎంసీ పరిధిలో - foodsafetywing.ghmc@gmail.com - Phone no - 04021 11 11 11 దెబ్బతింటున్న కిడ్నీలు..పెచ్చుమీరుతున్న కల్తీ ఆహారంతో క్యాన్సర్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. మనకు దొరికే ఉప్పు, పాలతో సహా రా మెటీరియల్ అంతా కల్తీనే. వీటిని రెస్టారెంట్లు, హోటళ్లలో మరింత కల్తీ చేస్తున్నారు. ఫుడ్ కలర్స్, కెమికల్స్ అన్నీ అనారోగ్యానికి దారి తీసేవే. ముఖ్యంగా బాయిల్డ్ అయిన ఆయిల్‌తో తయారు చేస్తున్న వంటకాలతో అనారోగ్యసమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. – హితశ్రీ రెడ్డి, డైటీషియన్, నిమ్స్కఠిన చర్యలుండాలి!తక్కువ మొత్తంలో పెనాల్టీలతో పరిస్థితి మారదు. కల్తీ నిర్ధారణ అయినప్పుడు చట్టం మేరకు కఠినచర్యలు తీసుకోవాలి. మొక్కుబడి తంతుగా ఏటా పదిరోజులో, నెల రోజులో కాకుండా తనిఖీలు నిరంతరం జరగాలి. వండిన ఆహారపదార్థాల్లోనే కాకుండా మసాలా దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. విదేశాలకు పంపిస్తే వాటిని స్వీకరించకుండా వెనక్కు పంపిస్తున్నారు. ఫిర్యాదులకు ప్రత్యేక సెల్ ఉండాలి.– పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్నిబంధనలు పాటించాలి..హోటళ్లు, తినుబండారాల దుకాణాల నిర్వాహకులు, ఎఫ్ఎస్ఎస్ఏ, జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించాలి. ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు వాడొద్దు. పరిశుభ్రత పాటించాలి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. కల్తీని గుర్తించినప్పుడు ప్రజలు ఫిర్యాదు చేయాలి.– కె. బాలాజీరాజు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్శిక్షణ ఉండాలి..ఇటీవలి కాలంలో హోటళ్ల గురించి తెలియని వారు సైతం పెట్టుబడి వనరుగా ఈ రంగంలోకి వస్తున్నారు. ఇంటీరియర్ల కోసం ఎంతో ఖర్చు చేస్తున్న వారు సిబ్బంది శిక్షణ గురించి పట్టించుకోవడం లేదు. రెస్టారెంట్ల ఓనర్లు, సిబ్బందికి అవగాహన ఉండాలి. ప్రతి ఇరవై మంది సిబ్బందికి ఒక ట్రైనర్ ఉండాలి. ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక రోజు శిక్షణతో ఆన్‌లైన్‌పరీక్షతో సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. శిక్షణలు వినియోగించుకోవాలి.– తుమ్మల సంపత్ శ్రీనివాస్, ప్రెసిడెంట్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ -
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్.. 24గంటలూ తెరిచే ఉంటుంది
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ అది.. అక్కడ ఒకేసారి 5800 మంది భోజనం చేయొచ్చు. గతేడాది ఈ రెస్టారెంట్ గిన్నెస్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించింది. పగలు, రాత్రి అని తేడా లేకుండా 24 గంటలు ఈ రెస్టారెంట్ తెరిచే ఉంటుంది. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకతలు ఏంటన్నది తెలుసుకుందాం.. చుట్టూ పచ్చని కొండలు, అందమైన ప్రకృతిని చూస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకుంటూ ఘుమఘుమలాడే వంటలు తింటుంటే.. ఆ ఫీలింగే వేరు. ఇలాంటి అనుభూతిని పొందాలంటే మాత్రం పిపా యువాన్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. హాట్‌పాట్ రెస్టారెంట్‌గా పిలవబడే ఈ రెస్టారెంట్ చైనాలోని చాంగ్క్వింగ్ పట్టణానికి సమీపంలో కొండ మధ్యలో.. అద్భుతంగా ఉంటుంది. పదో, పాతికో కాదు.. ఈ రెస్టారెంట్లో ఏకంగా ఒకేసారి 5800 మంది భోజనం చేయొచ్చు. 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 900కు పైగా టేబుళ్లు ఈ రెస్టారెంట్లో ఉన్నాయి. ఇక్కడ ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద రెస్టారెంట్లో మనకు బుక్ అయిన టేబుల్ ఏదో తెలుసుకోవడానికి కనీసం పావుగంటైనా సమయం పడుతుంది.. మరి టేస్టీ వంటలను రుచిచూడాలంటే ఆ మాత్రం సమయం వేచిచూడక తప్పదు. చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్లో దొరుకుతాయి. చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్లో దొరుకుతాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు,25మంది క్యాషియర్లతో పాటు వందల మంది క్లీనింగ్ సిబ్బందిఇక్కడ ఉంటారు. 24 గంటల పాటు ఈ రెస్టారెంట్ తెరిచే ఉంటుంది. ముఖ్యంగా రాత్రిళ్లు ఇక్కడికి వచ్చే కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.విద్యుత్ దీపాల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత అందంగా కనిపించడమే దీనికి కారణమని చెబుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. -
మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్లో పుడ్ ఫ్రీ, ఫ్రీ!
ఆఫర్లంటే ఇష్టపడని వారుండరు. అందుకే కంపెనీలు, రెస్టారెంట్లు సైతం డిస్కౌంట్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటుంటారు. ఓ రెస్టారెంట్ యజమాని వినూత్నమైన ఆఫర్‌తో కస్టమర్ల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఇలాంటి ఆఫర్ ప్రకటించినందుకు కొంత మంది తిట్టుకుంటున్నారు కూడా. అసలు ఈ రెస్టారెంట్ కథేంటంటే... అమెరికాలో హార్ట్ ఎటాక్ గ్రిల్ అనే రెస్టారెంట్ ఉంది. హాస్పిటల్-థీమ్ సర్వీస్ కారణంగా ఈ రెస్టారెంట్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో వెళ్లి చూస్తే అచ్చం ఆసుపత్రిలానే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వంట చేసేవాళ్లు, వడ్డించేవారు డాక్టర్లు, నర్సుల్లా తెల్లకోటు ధరించి ఉంటారు. మగవారైతే డాక్టర్లుగా, ఆడవారు నర్సుల్లా పనిచేస్తుంటారు. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ రెస్టారెంట్లో తినాలనుకుంటే కస్టమర్లు సైతం పేషంట్లలా తయారవ్వాలి. హార్ట్ ఎటాక్ గ్రిల్‌లోని మెనూలోకి వస్తే, ఇందులో కూడా క్వాడ్రపుల్ బైపాస్ బర్గర్ల వంటి పేర్లుతో కనిపిస్తాయి. ఇటీవల ఈ రెస్టారెంట్ యాజమాన్యం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది 158 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నవారికి ఉచితంగా రుచికరమైన ఆహారాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. ఇంకేముందు లావుగా ఉన్నవాళ్లు డైటింగ్ పక్కన పెట్టి ఇందులో ఈటింగ్ మొదలుపెట్టారు. బంఫర్ ఆఫర్‌ను వదులుకోలేక ఆమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రెస్టారెంట్‌కి వెళ్లి లాగించేస్తున్నారు.ఈ తరహా ఆఫర్లను ఇవ్వడమంటే అది ఊబకాయాన్ని ప్రోత్సహించడమేనని కొందరు భావించారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ వారి జీవితాలను రిస్క్‌లో పెడుతున్న ఈ రెస్టారెంట్‌ను మూసివేయాలని ట్విటర్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నెట్టింట ఈ రెస్టారెంట్‌పై ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి. ఇంత జరుగుతన్నా ఈ రెస్టారెంట్ కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చదవండి: ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్! -
కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..స్విగ్గీకి భారీ షాక్ ఇచ్చిన 900 రెస్టారెంట్లు
ప్రముఖ ఫుడ్ ఆగ్రిగ్రేటర్స్, రెస్టారెంట్ల మధ్య ఒప్పొందాలు విఫలమయ్యాయి. దీంతో స్విగ్గీకి చెందిన ఫ్రీ టేబుల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘డైన్అవుట్’ నుంచి 900 రెస్టారెంట్లు వైదొలిగాయి. కోవిడ్ -19 తర్వాత రెస్టారెంట్లు పుంజుకోవడంతో ఫుడ్ ఆగ్రిగ్రేటర్స్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ ఎత్తు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో తమకొచ్చే ఆదాయం తగ్గిపోతుందటూ రెస్టారెంట్ యజమానులు చెబుతున్నారు. వాటికి పరిష్కార మార్గంగా రెస్టారెంట్ బాడీ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) సంస్థ .. జొమాటో, స్విగ్గీలాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలతో చర్చలు జరిపింది. చదవండి👉 ఫ్రీగా పిజ్జాలు..జొమాటో, స్విగ్గీలకు డొమినోస్ గుడ్‌బై? ఈ చర్చల సందర్భంగా ఎన్ఆర్ఏఐ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్లకు భారీ ఎత్తున డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో వారు మా రెస్టారెంట్లో ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత డైన్ అవుట్ లేదా జొమాటో పే వంటి యాప్‌ల ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. ఆ చెల్లింపు సమయంలో మేం(రెస్టారెంట్లు) కూడా డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తుంది. తద్వారా మా కొచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. 2ఏళ్ల పాటు రెస్టారెంట్లపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడం, తిరిగి కస్టమర్లకు రెస్టారెంట్లకు రావడంతో వ్యాపారం పుంజుకుంది. నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నంలో ఇలాంటి ఆఫర్లను దీర్ఘకాలికంగా కొనసాగించడం కష్టమే’నని చెప్పారు. చదవండి👉 శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది! నెల గడువు తర్వాత సెప్టెంబరులో విడుదల చేసిన ఎన్ఆర్ఏఐ నోటిఫికేషన్లో..ఆఫర్లు దీర్ఘకాలంలో మొత్తం రెస్టారెంట్ ఇండస్ట్రీపై ప్రభావాన్ని చూపుతాయి. జొమాటో.. జొమాటో పే, స్విగ్గీ..స్విగ్గీ డిన్‌అవుట్ పేరుతో పేమెంట్ గేట్వేలను అందుబాటులోకి తెచ్చాయి. ఇది మా కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వడం, 100% క్యాష్ బ్యాక్‌లు, బ్యాంక్ ఆఫర్లను అందించడం పేమెంట్ గేట్వేలను వినియోగించేలా ప్రోత్సహిస్తుంది. కానీ అలాంటి నిరాధారమైన ఆఫర్లు ఇస్తే..తాము ఫుడ్ ఆగ్రి గ్రేటర్‌లతో పెట్టుకున్న ఒప్పొందాన్ని రద్దు చేసుకుంటామని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఫుడ్ ఆగ్రిగ్రేటర్‌లతో జరిపిన చర్చలు సఫలం కావడంతో రెస్టారెంట్ల బాడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. చదవండి👉 రెస్టారెంట్లపై కేంద్రం ఆగ్రహం,సర్వీస్ చార్జీ వసూలు చేయుడు బంజేయండి! -
వాట్ ఆన్ ఐడియా అశ్విన్జీ !
ఆదాయం పెంచుకునే పనిలో భాగంగా రైల్వేశాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రద్ధీగా ఉండే స్టేషన్లు, రైల్వే స్థలాల్లో సరికొత్త రెస్టారెంట్లు ప్రారంభించనుంది. దీని కోసం పాత రైలు పెట్టెలను ఉపయోగించాలని నిర్ణయించింది. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది. వందల ఏళ్లుగా రైల్వేశాఖ దేశంలో సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త రైలు బోగీలు తయారుచేస్తోంది. ఇదే సమయంలో పాత బోగీలు ప్రయాణానికి పనికిరాకుండా పోతున్నాయి. గత కొంత కాలంగా రైల్వేలో ఫిట్నెస్ లేని కోచ్‌ల సంఖ్య పెరిగిపోతుంది. యాభై ఏళ్లు పైబడిన రైలు పెట్టెల్లో చాలా వరకు ఫిట్నెస్తో ఉండటం లేదు. ఇలాంటి పాత పెట్టెలను మేనేజ్ చేయడం సైతం రైల్వేకు భారంగా మారుతోంది. #Repost @RailMinIndia Coach to Restaurant!! Indian Railways is refurbishing its old railway coaches, which are not fit for use in trains, by turning them into beautiful concept restaurants making them an attraction for travellers. pic.twitter.com/q0lnTVOQwM — Ministry of Tourism (@tourismgoi) February 7, 2022 నిరుపయోగంగా మారుతున్న రైలు పెట్టెలతో సరికొత్త వ్యాపారానికి నాంది పలుకుతోంది. ఓల్డ్ రైల్వే కాంపార్ట్మెంట్లను రెస్టారెంట్లుగా మార్చుతోంది. ఫిట్నెస్ లేని రైలు పెట్టెలకు రైల్వే ఆధీనంలోని వర్క్‌షాప్‌లలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇలా మార్చిన రైలు పెట్టెలను రద్ధీగా ఉండే రైల్వే స్టేషన్లలో రెస్టారెంట్లుగా మార్చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రారంభించిన రెస్టారెంట్లకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భోపాల్, జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఈ తరహా రెస్టారెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో అన్ని ప్రముఖ స్టేషన్లలో అవకాశం ఉన్న చోట ఈ తరహా రెస్టారెంట్ ప్రారంభించే దిశగా రైల్వే కసరత్తు చేస్తోంది. చదవండి: ఐఆర్సీటీసీ ఫీజులో వాటాలపై వెనక్కి తగ్గిన రైల్వేస్.. -
ఈ విషయంలో ప్రేమ జంటలకు ఉదయ్‌పూర్, ఫ్యామిలీలకు ఆగ్రా..
న్యూఢిల్లీ: తమకు ఇష్టమైన ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్‌కు వెళ్లి తినే వారి సంఖ్య పెరుగుతోంది. తీరికలేని జీవనశైలిలో.. కొంచెం సమయం లభించినా మనసుకు నచ్చే రుచులను ఆస్వాదించేందుకు వారు మొగ్గు చూపిస్తున్నారు. 2021లో ఏకంగా 4.5 కోట్ల మంది రెస్టారెంట్లకు వెళ్లి తమ జిహ్వ కోరికలను నెరవేర్చుకున్నట్టు ‘డైన్ అవుట్’ సంస్థ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. సగటున వీరు చెల్లించిన ఒక్కో బిల్లు రూ.2,670గా ఉంది. 2020లో ఇది రూ.1,907గానే ఉండడం గమనించాలి. అంటే గతేడాది వీరంతా కలసి రూ.12,015 కోట్లను నచ్చిన ఆహారంపై ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, రెస్టారెంట్లలో టేబుళ్లను బుక్ చేసుకోవడం ద్వారా వీరు రూ.1,360 కోట్ల ఆదా చేసుకున్నట్టు ఈ నివేదిక తెలిపింది. గంటకు 8,588 టేబుళ్లు రెస్టారెంట్లలో బుక్ అయ్యాయి. ఢిల్లీ వాసులే ముందు.. డైనింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా (రెస్టారెంట్ భోజనానికి రాజధాని)గా ఢిల్లీని ఈ నివేదిక పేర్కొంది. వరుసగా మూడో ఏడాది ఈ ఖ్యాతిని దక్కించుకుంది. 32 శాతం మంది రెస్టారెంట్ల భోజన ప్రియులు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత 18 శాతం మందితో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. వీటికి ప్రాధాన్యం.. బటర్ చికెన్, దాల్ మఖాని, నాన్ ఎక్కువగా తిన్న పదార్థాలలో ఉన్నాయి. 38 శాతం ఉత్తరాది ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వగా.. చైనీస్ వంటకాలకు 18 శాతం, కాంటినెంటల్ (యూరోపియన్) వంటకాలను 16 శాతం మంది ఆర్డర్ చేశారు. టేబుల్‌కు ఇద్దరే.. ప్రేమ జంటలకు ఉదయ్‌పూర్ రాజధానిగా నిలిచింది. ఇందుకు నిదర్శనంగా ఈ పట్టణంలో రెస్టారెంట్లలో 44 శాతం బుకింగ్‌లు ఇద్దరి కోసం చేసుకున్నవే ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల బృందాలు ఎక్కువగా ఆగ్రా, లుధియానాలో రెస్టారెంట్లకు వెళుతున్నారు. ఇక్కడ ఒక టేబుల్‌ను నలుగురి కోసం బుక్ చేసుకున్నారు. ఖర్చు చేయడానికి వీలుగా బ్యాలన్స్ ఉండడం, ఇంటి నుంచే పని విధానంతో దేశవ్యాప్తంగా ఖరీదైన ఆహార సేవనం 120 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలియజేసింది. అలాగే, నాణ్యమైన రెస్టారెంట్లలో భోజనాలు కూడా 105 శాతం పెరిగినట్టు పేర్కొంది. లిక్కర్ క్యాపిటల్ గా బెంగళూరు గత డిసెంబర్లో బెంగళూరు నగరం 50,000 లీటర్ల ఆల్కహాల్‌ను వినియోగించుకుంది. దీంతో 2021 సంవత్సరానికి లిక్కర్ రాజధానిగా బెంగళూరును ఈ నివేదిక ప్రస్తావించింది. రెస్టారెంట్లలో రాత్రి భోజనానికి (డిన్నర్) ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆగ్రాలో 59.3 శాతం మంది రెస్టారెంట్లలో డిన్నర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెన్నై వాసులు 47 శాతం మంది మధ్యాహ్న భోజనాన్ని రెస్టారెంట్లలో తినేందుకు ఇష్టపడుతున్నారు. ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్ ప్రముఖ రెస్టారెంట్ల ప్రాంతంగా ఉంది. ముంబైలోని లోయర్ పారెల్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, చెన్నైలోని త్యాగరాయ నగర్, కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతాలు కూడా ఈ కోవలోకే వస్తాయని డైన్అవుట్ నివేదిక వివరించింది. చదవండి:లగ్జరీ ఫుడ్ స్టోర్ వ్యాపారంలో అడుగుపెట్టిన టాటా గ్రూప్..! -
ఒమిక్రాన్ వైరస్ ఈ నగరాన్ని దెయ్యాల నగరంగా మారుస్తోంది!!
Omicron Wave Is Turning This City Into A Ghost Town: లండన్ వీధులన్ని క్రిస్మస్ వేళ షాపింగ్ మాల్‌లు, రెస్టారెంట్లు , పబ్‌లు కస్టమర్ల ఆర్డర్లతో కళకళలాడుతుంటాయి. అంతేకాదు లండన్‌లోని ప్రముఖ నగరాల వీధులన్ని ప్రజల కేరింతలతో సందడి చేస్తుంటాయి. కానీ ఈ ఒమిక్రాన్ దెబ్బకు లండన్‌లోని వీధులన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. ఒక వైపు రోజు రోజుకి పెరుగుతున్న కేసుల సంఖ్య, మరోవైపు . దేశాధినేతలు, వైద్యాధికారులు ప్రజల ఆరోగ్య దృష్ట్య జారీ చేస్తున్న కఠినమైన కరోనా ఆంక్షల నేపథ్యంలో లండన్ ఘోస్ట్ నగరాన్ని తలిపించేలా నిశబ్దంగా మారిపోయింది. దక్షిణ లండన్‌లోని పార్లెజ్ అనే పబ్ రెస్టారెంట్ యజమానులు వచ్చే క్రిస్మస్ పండుగక అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని ఎన్నో ఆశాలతో ఎదురు చూశాం అని అంటున్నారు. అంతేకాదు ఇప్పుడుప్పుడే ఈ కోవిడ్-19 లాక్డౌన్ల నుంచి నెమ్మదిగా పుంజుకుంటుందని భావించాం అని చెప్పారు. కానీ అనుహ్యంగా ఈ దక్షిణాఫ్రికా ఒమిక్రాన్ వైరస్ తమ ఆశలను అడియాశాలు చేసిందంటూ రెస్టారెంట్ పబ్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం) అంతేకాదు ఈ వారంలో లండన్‌లో కేసులు సంఖ్య పెరుగుతున్నాయని, వైద్యులు, నర్సులు అనారోగ్యానికి గురవుతున్నారని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టి హెచ్చరించారు. ఈ మేరకు లండన్‌లోని సదరు కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోంతో ఇళ్ల వద్ద నుంచి పనిచేయండి అని చెప్పడంతో లండన్ వీధులన్ని నిర్మానుష్యమై పోయాయి. పైగా కఠినమైన కోవిడ్ ఆంక్షలు విధించడంతో డ్రింక్ చేయడానికి కూడా ఎవరూ పెద్దగా బయటకు రావడం లేదు. దీంతో లండన్ ప్రముఖ రెస్టారెంట్లు, పబ్‌లు ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నాయి. గత కొన్నాళ్లుగా బ్రిటన్ ఆతిధ్య వ్యాపారాలన్ని చాలా కోలుకోలేనంత దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే లాక్ డౌన్ల తదనంతరం కోలుకోవడానికి నెమ్మదిగా ప్రయత్నిస్తుండగా ఈ ఒమిక్రాన్ మళ్లీ మరింతగా ఆ వ్యాపారాలన్నింటిని దెబ్బతీసింది. యూకే రాజధానిలో ఎక్కువగా ఉన్న 43 రెస్టారెంట్లు, బార్లు, హోటళ్ల ఆదాయాలు గణనీయంగా తగ్గడం చాలా ఆందోళన కలిగించే విషయం అని లండన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ డెస్ గుణవర్దన్ అన్నారు. ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్ ఓమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి పటిష్టమైన కోవిడ్ చర్యలు అవసరమని క్రిస్మస్ సందర్భంగా ముందుగానే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టి హెచ్చరికల నేపథ్యంలో లండన్‌లోని వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. అయితే ఈ ఆతిధ్య వ్యాపారాలకు ప్రభుత్వ సహాయం లేకపోడం పెద్ద అవరోధంగా ఉందంటూ బ్రిటీష్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రూబీ మెక్‌గ్రెగర్-స్మిత్ ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!) -
బతుకుచిత్రం : మహిళా శక్తికి ప్రాధాన్యతనిస్తోన్న రెస్టారెంట్లు
-
బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, రామచంద్రపురం: బిర్యానీ, నూడిల్స్, చికెన్ జాయింట్లు, మటన్ ధమ్ బిర్యానీ, పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు, పప్పులు, పాలు, నీళ్లు ఇలా కల్తీకి కాదు ఏదీ అనర్హం అన్నట్టు ఉన్నాయి. ఆహార పదార్థాల తయారీలో అక్రమాలకు పాల్పడడంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఇటీవల కాలంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటల్స్‌లో సేల్స్ పెరగటంతో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి తయారీలో విచ్చలవిడిగా ఎసెన్సులు, ఇతర రంగులను వాడుతున్నారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు సిద్ధమైంది. ఇటీవల ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు హోటల్స్, సూపర్ మార్కెట్లు, బేకరీల్లో నిర్వహిస్తున్న ఆకస్మిక దాడుల్లో విచ్చలవిడి రంగుల వాడకం బయట పడింది. లెసెన్స్‌లు లేకుండా నిర్వహణ ఆహార పదార్థాలు తయారు చేసేవారు, నిల్వ చేసే వ్యాపారస్తులు, రవాణా చేసే సంస్థలు లైసెన్స్‌లు తీసుకోవాలి. ఆహార భద్రతా నియమావళి ప్రకారం లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తే సెక్షన్ 63 ఎఫ్ఎస్ఎస్సీ యాక్ట్ 2006 ప్రకారం కేసులు నమోదు చేసి రూ. 5లక్షల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. జిల్లాలో గల ఆహార పదార్థాల అమ్మకాలు, రవాణా, నిల్వ చేసే వ్యాపార, వాణిజ్య సంస్థలు 75శాతం లైసెన్సులు లేకుండానే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. రంగులు కలిపిన బిర్యానీ శాంపిల్స్‌ను తీస్తున్న ఫుడ్ కంట్రోల్ జాయింట్ కమిషనర్ పూర్ణ చంద్రరావు విస్తృతంగా దాడులు ఆహార కల్తీ నియంత్రణ అధికారులు విస్త్రృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. మండపేట, రామచంద్రపురం పట్టణాల్లో హోటల్స్, సూపర్ మార్కెట్లపై దాడులు నిర్వహించగా ఆహార భద్రతా నియమాళికి విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 90శాతం హోటల్స్ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు వెలుగు చూసింది. 30కిపైగా చికెన్, పప్పులు, నిల్వ మాంసం, బిర్యానీ, వంటకాల్లో వాడుతున్న కలర్స్ వంటి వాటి శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో ల్యాబ్‌కు పంపించారు. 15రోజుల్లో ఫలితాలు రానున్నాయి. వీటిని బట్టి ఆయా షాపులు, హోటల్స్‌పై చర్యలు తీసుకొంటారు. నిల్వ మాంసంతో సమస్యలు చికెన్, మటన్, బిర్యానీ, బేకరీల్లోను, స్వీట్స్ తయారీల్లోను ఎసెన్స్, సింథటిక్ రంగులు అధికంగా వేస్తుండటంతో క్యాన్సర్ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. హోటల్స్‌లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్ ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నారు. నిల్వ మాసం తింటే అజీర్తి సమస్యలు, ముఖ్యమైన అవయవాలు పనిచేయకపోవటం వంటి సమస్యలు వస్తాయి. -
కరోనా ఎఫెక్ట్.. రోడ్డెక్కిన రెస్టారెంట్
వాషింగ్టన్: కరోనా వైరస్ మానవాళి జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బయటి ఫుడ్డు తినడమే ఫ్యాషన్‌గా భావించిన వారు.. ఇప్పుడు ఆ పేరు చెప్తేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు. రెస్టారెంట్లు అన్ని కరోనా దెబ్బకు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ రెస్టారెంట్లు ఓ వినూత్న ఆలోచన చేశాయి. అవుట్డోర్ డైనింగ్(బహిరంగ భోజనం)ని అమలు చేశాయి. ఇది బాగా క్లిక్ అయ్యింది. దాంతో ఈ విధానాన్ని పర్మినెంట్ చేయాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తాత్కాలిక పద్దతిన ప్రవేశపెట్టిన ఈ విధానం బాగా క్లిక్ అయ్యింది. నగర వాసులు కూడా దీన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ఈ పద్దతిని శాశ్వతంగా అమలు చేయాలని భావిస్తున్నం’ అన్నారు. ఈ నెల 30 నుంచి న్యూయార్క్ నగరంలో 25శాతం ఆక్యుపెన్సీ పరిమితితో ఇండోర్ రెస్టారెంట్లు తెరుచుకోనున్న నేపథ్యంలో మేయర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. (చదవండి: క్లబ్బులు, అన్ని రకాల బార్లు ఇక ఓపెన్..) ‘కీలకమైన ఆహార పరిశ్రమకు మద్దతు ఇవ్వడంలో ఓపెన్ రెస్టారెంట్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇది చాలా పెద్ద, ధైర్యమైన ప్రయోగం. పైగా విజయవంతమయ్యింది. దీని ద్వారా 90 వేల మందికి ఉపాధి కల్పించాము’ అని బ్లాసియో తెలిపారు. న్యూయార్క్ నగరాన్ని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సిటీగా మార్చడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని శాశ్వతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. అవుట్డోర్ డైనింగ్ కోసం ఇప్పటికే 85 వీదులను కార్-ఫ్రీ స్ట్రీట్స్‌గా మార్చింది. అయితే శీతాకాలంలో ఈ అవుట్డోర్ రెస్టారెంట్ విధానానికి ఇబ్బంది తలెత్తుతుంది. ఎందుకంటే ఆ సమయంలో విపరీతంగా మంచు కురుస్తుంది. -
ఆపరేషన్ చెన్నై చికెన్
సాక్షి, నెల్లూరు : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చెన్నై చికెన్ హోల్‌సేల్ వ్యాపారస్తులపై కన్నేశారు. ఎక్కడ నుంచి ఎలా జిల్లాకు రవాణా చేస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో భారీగా కల్తీ చికెన్ లభ్యమైన క్రమంలో అన్ని చికెన్ స్టాళ్ల విక్రయాలతో పాటు నాన్‌వెజ్ రెస్టారెంట్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నిరంతరం దాడులు చేసి అక్రమార్కుల ఆటకట్టిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరంలో అధికారులు చేస్తున్న వరుస దాడుల్లో చెన్నై చికెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు నగరంలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పద్మావతి సెంటర్, అంబేద్కర్ సెంటర్లో కల్తీ చికెన్ నిల్వలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 500 కిలోలపైన చికెన్ షాపుల్లో నిల్వ ఉండటంతో అధికారులు తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై, బెంగళూరు నగరాల్లో డంపింగ్ యార్డుకు వెళ్లే చికెన్‌ను నెల్లూరు వ్యాపారులు కొందరు కొనుగోలు చేసి ఇక్కడి చికెన్‌లో కలిపి విక్రయిస్తున్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేసి రెండు షాపులను సీజ్ చేసి భారీగా అపరాధ రుసము విధించనున్నారు. నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా చికెన్ పకోడి బండ్లు, బార్లు, సాధారణ హోటళ్లకు దీన్ని అధికంగా విక్రయిస్తున్నారు.దీంతో పాటు నగరంలోని మిగిలిన చికెన్ షాపుల్లో నగరపాలక సంస్థ ప్రజారోగ్య బృందాల తనిఖీలు బుధవారం కూడా కొనసాగాయి. మరోవైపు చెన్నై మూలల అన్వేషణపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని మిగిలిన మున్సిపాల్టీల్లోనూ తనిఖీలు మొదలయ్యాయి. ఇది చదవండి : వామ్మో.. చెన్నై చికెన్ మాంసం విక్రయాలపై ప్రత్యేక నిఘా నాన్‌వెజ్ వంటకాలకు నెల్లూరు ఖ్యాతి గాంచింది. నెల్లూరు నగరంలోనే దాదాపు 150కు పైగా నాన్‌వెజ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో మటన్, చికెన్‌లో కల్తీ జరగుతోందనేది అధికారులకు ఉన్న సమాచారం. ఈ క్రమంలో అన్ని స్టాళ్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. మటన్లోనూ కల్తీ జరగుతోందని అధికారులు ప్రా«థమికంగా నిర్థారించారు. ఈ క్రమంలో నగరంలోని అన్ని ప్రధాన షాపుల్లోని శాంపిల్స్‌ను అక్కడికక్కడే పరిశీలించడంతో పాటు ల్యాబ్‌కు పంపిచనున్నారు. -
బీరులో ఇకపై కోరినంత కిక్కు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని మందుబాబులకు ఓ ‘చల్లని’ వార్త. బీరులో కిక్కు తక్కువ అనుకునేవారు ఇకపై కోరినంత కిక్కును తలకెక్కించుకోవచ్చు. తాజా బీరును క్షణాల్లో తయారు చేసి అందించేందుకు 20 మినీ బీరు ప్లాంట్లు (మైక్రో బ్రేవరేజెస్) అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఈ నెలాఖరులోగా ఏర్పాటు కానున్నట్టు సమాచారం. వీటిలో రెస్టారెంట్లు, స్టార్‌హోటళ్లు సైతం ఉన్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో 650 మి.లీ బీరును సీసాల్లో అందిస్తుండగా.. ఈ మినీ ప్లాంట్లలో అర లీటరు, లీటరు జగ్గుల్లో బీరును లాగించేయొచ్చు. అప్పటికప్పుడు తాజా ముడి పదార్థాలతో తయారు చేయడం ఈ బీరు ప్రత్యేకత. దీని ధర కూడా కాస్త అధికంగానే ఉండనున్నట్టు సమాచారం. అరలీటరు బీరు రూ.150 నుంచి రూ.200 చెల్లించి మందుబాబులు జేబులు గుల్లవడం తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఒక్కో ప్లాంట్‌కు రూ.4 కోట్లు..! ఈ మినీ బీరు ప్లాంటు ఏర్పాటు చేయాలనుకునేవారికి విధిగా రెస్టారెంట్, బార్ లేదా హోటల్ ఉండాల్సిందే. ప్లాంటు ఏర్పాటుకు ప్రత్యేకంగా వెయ్యి చదరపు అడుగుల సువిశాలమైన స్థలం, పార్కింగ్ ఏర్పాట్లు తప్పనిసరి. ఈ ప్లాంటు ఏర్పాటుకు లైసెన్సు ఫీజును ప్రాథమికంగా రూ.3 లక్షలుగా నిర్ణయించారు. రోజువారీ ఉత్పత్తి ఆధారంగా ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. కానీ ప్లాంట్లు ఏర్పాటుకు అంచనా వ్యయం రూ.2 నుంచి రూ.4 కోట్లు అవుతుందని ఆబ్కారీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక నిత్యం ఒక్కో ప్లాంటులో సుమారు 200 నుంచి 500 లీటర్ల బీరు తయారీకి అనుమతివ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతం నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల యజమానులు 20 మందికి మినీ బీర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆబ్కారీశాఖ ప్రాథమిక అనుమతులిచ్చింది. ఆయా ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న ప్రాంతాల్లో ఆబ్కారీశాఖ వర్గాలు తనిఖీలు చేసిన తర్వాతే లైసెన్సులను మంజూరు చేస్తారు. ఈ బీరు చాలా ఖరీదు గురూ.. ప్రస్తుతం 650 మి.లీ లీటర్ల సీసాలో లభ్యమయ్యే లైట్ బీర్ రూ.90, హార్డ్బీర్ రూ.105 చొప్పున మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారు. మినీ బ్రేవరేజెస్లో తయారయ్యే బీరుకు అర లీటరు రూ.150 నుంచి రూ.200 ధర చెల్లించక తప్పదని ఆబ్కారీ శాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా తయారుచేసి అందించడం.. అదీ మనం చూస్తుండగానే క్షణాల్లో సిద్ధం చేయడం, ముడిపదార్థాల నాణ్యత కాస్త మెరుగ్గా ఉండడంతో రుచిలో ఈ బీరు మందుబాబులకు సరికొత్త కిక్ నిస్తుందని సెలవిస్తున్నారు. కనుక బీరుబాబులూ.. బీ(రు)రెడీ.