ఆఫ్రికాలోని నైగర్‌లో సైన్యం సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. జాతీయ టీవీలో నైగర్ సైనికులు ఈ తిరుగుబాటును ప్రకటించారు. నైజర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తిరుగుబాటు తర్వాత దేశ సరిహద్దులన్నీ మూతపడ్డాయి. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారికాదు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇక్కడ నాలుగుసార్లు తిరుగుబాటు జరిగింది. నైగర్‌కు ముందు జిహాదీ తిరుగుబాటు,ఆ తర్వాత పొరుగు దేశాలైన మాలి, బుర్కినా ఫాసోలలో తిరుగుబాటు జరిగింది. తాజాగా ఈ చిన్న దేశంలో జరిగిన తిరుగుబాటు ప్రపంచ దేశాలలో ఆందోళనను పెంచింది. ముఖ్యంగా అమెరికా, ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికా తీవ్ర ఆగ్రహం
నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను తక్షణమే విడుదల చేయాలని, అలాగే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. నైగర్ చాలా పేద దేశం అయినప్పటికీ యురేనియం నిల్వల విషయంలో అగ్రగామిగా ఉంది. ఇదే అమెరికా ఆందోళనను మరింతగా పెంచింది. 80 శాతం భూమి ఎడారిగా ఉన్న దేశంలో చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటుతో అమెరికా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా నైగర్ అంతర్జాతీయ ఏజెన్సీలకు, అనేక దేశాలకు భారీగా రుణపడి ఉంది.
What's Happening in Niger?
— Brian Krassenstein (@krassenstein) August 1, 2023
Most Americans do not seem to pay attention to Africa much, but Africa, particularly Niger are huge exporters of important materials and play a crucial role in international politics. So what's going on?
- Last week a junta seized power from President… pic.twitter.com/6t0vAd1SS6
అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు
ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారులలో నైగర్ ఒకటి. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ (డబ్ల్యుఎన్‌ఏ) తెలిపిన వివరాల ప్రకారం నైగర్ యురేనియం ఉత్పత్తిలో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. రేడియోధార్మిక యురేనియం నిల్వలను కలిగి ఉన్న ఈ దేశంలో రాజకీయ తిరుగుబాటు కారణంగా ఇది ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అణుబాంబు, అణుశక్తిలో వినియోగించే యురేనియం నిల్వలున్న ఈ చిన్న దేశంపై అమెరికాతో పాటు ప్రపంచమంతా దృష్టి సారించింది. నైగర్..యూరోపియన్ యూనియన్‌కు యురేనియం అందించే ప్రధాన సరఫరాదారు. నైగర్ నియంత్రణ సైన్యం చేతికి వచ్చినప్పటి నుంచి ఈ దేశాల్లో ఆందోళన మరింతగా పెరిగింది.
ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క
మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు
సైనిక తిరుగుబాటు తర్వాత నైగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తిరుగుబాటుకు మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు లభించింది. ఫలితంగా ఇతర దేశాలకు మరింత ముప్పు పెరిగింది. ఈ సైనిక తిరుగుబాటుకు మద్దతిచ్చిన మూడు దేశాలు ప్రస్తుతం తిరుగుబాటు సైనికుల పాలనలో ఉన్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా, ఫ్రాన్స్ తన పౌరులను నైజర్ నుండి తరలించడం ప్రారంభించింది. నైగర్‌లో కొనసాగుతున్న తిరుగుబాటు కారణంగా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా మీడియాకు తెలిపారు. అదే సమయంలో పెరుగుతున్న సంఘర్షణల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని స్పెయిన్ కూడా 70 మందికి పైగా పౌరులను విమానంలో తరలించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఇటలీ కూడా తమ దేశ పౌరులను రక్షణ కల్పించే ప్రయత్నాలు చేస్తోంది.
ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు
నైగర్ నూతన సైనిక నాయకులు సీనియర్ రాజకీయ నాయకులను అరెస్టు చేయడంతో పాటు దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్‌ను అతని ప్యాలెస్‌లో బంధించారు. ఈ తిరుగుబాటు తర్వాత జూలై 30న ఫ్రెంచ్ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగాయి. ఈ సమయంలో, నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. వాటిపై ఫ్రెంచ్ వ్యతిరేక నినాదాలు కనిపించాయి.
ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా?
Comments
Please login to add a commentAdd a comment