Tense
-
ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి?
ఆఫ్రికాలోని నైగర్‌లో సైన్యం సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. జాతీయ టీవీలో నైగర్ సైనికులు ఈ తిరుగుబాటును ప్రకటించారు. నైజర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తిరుగుబాటు తర్వాత దేశ సరిహద్దులన్నీ మూతపడ్డాయి. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారికాదు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇక్కడ నాలుగుసార్లు తిరుగుబాటు జరిగింది. నైగర్‌కు ముందు జిహాదీ తిరుగుబాటు,ఆ తర్వాత పొరుగు దేశాలైన మాలి, బుర్కినా ఫాసోలలో తిరుగుబాటు జరిగింది. తాజాగా ఈ చిన్న దేశంలో జరిగిన తిరుగుబాటు ప్రపంచ దేశాలలో ఆందోళనను పెంచింది. ముఖ్యంగా అమెరికా, ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా తీవ్ర ఆగ్రహం నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను తక్షణమే విడుదల చేయాలని, అలాగే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. నైగర్ చాలా పేద దేశం అయినప్పటికీ యురేనియం నిల్వల విషయంలో అగ్రగామిగా ఉంది. ఇదే అమెరికా ఆందోళనను మరింతగా పెంచింది. 80 శాతం భూమి ఎడారిగా ఉన్న దేశంలో చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటుతో అమెరికా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా నైగర్ అంతర్జాతీయ ఏజెన్సీలకు, అనేక దేశాలకు భారీగా రుణపడి ఉంది. What's Happening in Niger? Most Americans do not seem to pay attention to Africa much, but Africa, particularly Niger are huge exporters of important materials and play a crucial role in international politics. So what's going on? - Last week a junta seized power from President… pic.twitter.com/6t0vAd1SS6 — Brian Krassenstein (@krassenstein) August 1, 2023 అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారులలో నైగర్ ఒకటి. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ (డబ్ల్యుఎన్‌ఏ) తెలిపిన వివరాల ప్రకారం నైగర్ యురేనియం ఉత్పత్తిలో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. రేడియోధార్మిక యురేనియం నిల్వలను కలిగి ఉన్న ఈ దేశంలో రాజకీయ తిరుగుబాటు కారణంగా ఇది ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అణుబాంబు, అణుశక్తిలో వినియోగించే యురేనియం నిల్వలున్న ఈ చిన్న దేశంపై అమెరికాతో పాటు ప్రపంచమంతా దృష్టి సారించింది. నైగర్..యూరోపియన్ యూనియన్‌కు యురేనియం అందించే ప్రధాన సరఫరాదారు. నైగర్ నియంత్రణ సైన్యం చేతికి వచ్చినప్పటి నుంచి ఈ దేశాల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు సైనిక తిరుగుబాటు తర్వాత నైగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ తిరుగుబాటుకు మూడు పశ్చిమ ఆఫ్రికా దేశాల మద్దతు లభించింది. ఫలితంగా ఇతర దేశాలకు మరింత ముప్పు పెరిగింది. ఈ సైనిక తిరుగుబాటుకు మద్దతిచ్చిన మూడు దేశాలు ప్రస్తుతం తిరుగుబాటు సైనికుల పాలనలో ఉన్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా, ఫ్రాన్స్ తన పౌరులను నైజర్ నుండి తరలించడం ప్రారంభించింది. నైగర్‌లో కొనసాగుతున్న తిరుగుబాటు కారణంగా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా మీడియాకు తెలిపారు. అదే సమయంలో పెరుగుతున్న సంఘర్షణల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని స్పెయిన్ కూడా 70 మందికి పైగా పౌరులను విమానంలో తరలించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు ఇటలీ కూడా తమ దేశ పౌరులను రక్షణ కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు నైగర్ నూతన సైనిక నాయకులు సీనియర్ రాజకీయ నాయకులను అరెస్టు చేయడంతో పాటు దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్‌ను అతని ప్యాలెస్‌లో బంధించారు. ఈ తిరుగుబాటు తర్వాత జూలై 30న ఫ్రెంచ్ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఫ్రాన్స్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగాయి. ఈ సమయంలో, నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. వాటిపై ఫ్రెంచ్ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
షహీన్‌బాగ్‌లో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారిన దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ధర్నా జరుగుతున్న ప్రాంతానికి సీఏఏ మద్దతుదారులు చేరుకుని విద్రోహులపై కాల్పులు జరపాలని నినాదాలు చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. షహీన్‌బాగ్‌లో నిరసనకు దిగిన ఆందోళనకారులు తక్షణమే అక్కడి నుంచి ఖాళీచేయాలని డిమాండ్ చేశారు. సీఏఏ మద్దతుదారులు వందేమాతరం నినాదాలతో హోర్తెతించారు. షహీన్‌బాగ్ నిరసనలను వ్యతిరేకించిన ఆందోళనకారులను కొందరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని బస్సుల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు. పారామిలటరీ బలగాలతో షహీన్‌బాగ్ వద్ద బందోబస్తును ముమ్మరం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడే మకాం వేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాగా షహీన్‌బాగ్ వద్ద పౌర నిరసనలకు వ్యతిరేకంగా శనివారం తుపాకీతో హల్చల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి : పెళ్లి అని చెప్పి తుపాకీ కొన్నాడు.. -
కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత
-
గింత విషం పోయండి
♦ మల్లన్నసాగర్ ముంపు బాధితుల ఆగ్రహం ♦ కడుపు మండి కొంతమంది నేతల ఇళ్లపై దాడులు.. విధ్వంసం ♦ గ్రామంలో యుద్ధ వాతావరణం పోలీసు పహారాలో కిష్టాపూర్ దుబ్బాక/తొగుట: ‘మల్లన్న సాగర్‌కు భూములివ్వొద్దని రాత్రింబవళ్లు ఇంటింటికీ తిరిగినం.. అయినోళ్లను, కానోళ్లను బతిమిలాడినం.. కాళ్లు మొక్కినం.. అయినా మార్పు రాలే.. ఉన్న ఊరు కన్నతల్లితో సమానం.. కన్నతల్లిని వదులుకోలేక దుఃఖమొస్తోంది.. గుండె భారమవుతోంది.. కడుపు మండుతోంది.. చెట్టుకొక్కరు, పుట్టకొక్కరులా తమ బతుకులు తయారయ్యాయి. తమకింత విషం పోయండి..’ అంటూ కొమరవెళ్లి మల్లన్న సాగర్ ముంపు బాధితులు రోదించారు. మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామ ఎంపీటీసీ దామరంచ ప్రతాప్‌రెడ్డి సమక్షంలో సోమవారం కొంతమంది తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు తమ భూములను అప్పజెప్పారు. విషయాన్ని తెలుసుకున్న ఏటిగడ్డ కిష్టాపూర్, వేములాఘాట్ గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు, యువకులు గ్రామ సర్పంచ్ దాతారు సునంద నేతృత్వంలో తొగుట తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి మల్లన్న సాగర్ పేరున భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని వినతిపత్రాన్ని తహసీల్దార్ దేశ్యా నాయక్‌కు అందించారు. అయితే పక్కనే ఉన్న ప్రతాప్‌రెడ్డి ముంపు బాధితులను చూసి కాలర్ ఎగరేసుకుంటూ వెళ్లారు. ‘గ్రామస్తులంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా.. తమను చూసి కాలర్ ఎగరేస్తావా’ అంటూ వందలాది మంది ఆగ్రహంతో ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడున్న కారును ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుమలగిరిలోని వెల్దండ నర్సింహారెడ్డి ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. నర్సింహారెడ్డి ఇంటి కిటికీలను ధ్వంసం చేశారు. నర్సింహారెడ్డి తండ్రి మల్లారెడ్డిపై దాడి చేసేందుకు యత్నించగా, ఇంటి తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి నేవూరి జీవన్‌రెడ్డి ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ధాన్యాన్ని బయట పారబోశారు. ఇంటి ముందు పల్సర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. అనంతరం వంగ అంజాగౌడ్ ఇంటిపైకి దాడికి వెళ్లగా విషయాన్ని తెలుసుకున్న అంజాగౌడ్ ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇంతలో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ గౌడ్ వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పి, గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించిన భూములను రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ చేసిన ప్రతాప్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, అంజాగౌడ్, నర్సింహారెడ్డిలతో తమకు క్షమాపణ చెప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డితో డీఎస్పీ ఫోన్లో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆందోళనకారులు రాత్రి వరకు గ్రామ పంచాయతీ వద్దే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాట తప్పారు గ్రామానికొచ్చి జిల్లా స్థాయి అధికారులు తమకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయి 15 రోజులవుతోంది. ఇంత వరకు ఏ ఒక్క అధికారి వచ్చి తమకు న్యాయం చేయలేదని, గుంట నక్కల్లా కొంతమందికి ఆశ చూపి భూములను అధికారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై మండిపడ్డారు. ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. భూ నిర్వాసితుల మనోభావాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని విమర్శించారు. పోలీసు పహారాలో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీధర్ గౌడ్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసులు పహారా కాస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
తూళ్లూరులో టెన్షన్
-
విద్యుత్ సౌధలో ఉద్రిక్తత
-
పుత్తా ప్రతాప్ రెడ్డి అర్థ నగ్నంగా నిరసన