
కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నైజీరియాకు ప్రముఖ ఏక్సెస్ బ్యాంకు సీఈవో, ఆయన భార్య, కొడుకు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పామ్ స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం రాత్రి 8.45 గంటలకు బయలుదేరిన యూరోకాప్టర్ ఈసీ 120 రకం హెలికాప్టర్ నెవడాలోని బౌల్డర్ సిటీకి వెళుతుండగా మొజావ్ ఎడారిలోని ఇంటర్‌స్టేట్ 15 రహదారి సమీపంలో 10.30 గంటల సమయంలో కూలిపోయింది.
ఘటనలో అందులో ఉన్న యాక్సెస్ బ్యాంక్ సీఈవో హెర్బర్ట్ వింగ్వే(57), ఆయన భార్య, కొడుకుతోపాటు మొత్తం ఆరుగురూ మృత్యువాతపడ్డారు. నైజీరియాలోని రెండు అతిపెద్ద బ్యాంకుల్లో ఏక్సెస్ బ్యాంకు ఒకటి.