Wimbledon lifts ban on Russian and Belarusian players allows them to compete as neutrals - Sakshi
Sakshi News home page

రష్యా, బెలారస్‌ టెన్నిస్‌ ఆటగాళ్లపై నిషేధం ఎత్తివేసిన ‘వింబుల్డన్‌’ నిర్వాహకులు

Published Sat, Apr 1 2023 8:31 AM | Last Updated on Sat, Apr 1 2023 10:52 AM

Wimbledon Lifts Ban On Russian Belarusian Players Allows Them - Sakshi

Russia And Belarus Tennis Players: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో గత ఏడాది రష్యా, బెలారస్‌ టెన్నిస్‌ క్రీడాకారులపై ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ నిషేధం విధించింది. దాంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రష్యా, బెలారస్‌ క్రీడాకారులు పాల్గొనలేకపోయారు. అయితే ఈ ఏడాది రష్యా, బెలారస్‌ క్రీడాకారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నామని, వారు తటస్థ క్రీడాకారుల హోదాలో పాల్గొనవచ్చని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ తెలిపింది.

దాంతో పురుషుల విభాగంలో స్టార్స్‌ మెద్వెదెవ్, రుబ్లెవ్, ఖచ నోవ్‌ (రష్యా), మహిళల విభాగంలో విక్టోరియా అజరెంకా, ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత అరీనా సబలెంకా (బెలారస్‌) వింబుల్డన్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది    వింబుల్డన్‌ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది.  

చదవండి: IPL2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement