ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికే ఎనిమిది రోజులు గడుస్తోంది. దీని వల్ల ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. అంతేకాకుండా యుద్ధ ప్రభావం రష్యా మీద కూడా ప్రతికూలంగానే ఉంది. సమస్య పరిష్కారం దిశగా వెళ్లాలని ప్రపంచ దేశాలు ఈ ఇరు దేశాలకు చెప్తున్నాయి. అయితే ఎవరివాదన వారిదేనన్నట్లు ఉంది రష్యా ఉక్రెయిన్ తీరు. ఎట్టికేలకు ఉక్రెయిన్, రష్యా మధ్య రెండో దశ చర్చలు బెలారస్- పోలాండ్ మధ్య చర్చలు జరిగాయి. చర్చలోకి వచ్చిన ఎజెండాలోని అంశాలు ఇవే
1. వెంటనే కాల్పుల విరమణ
2.యుద్ధ విరమణ
3. పౌరులు సరిహద్దులు దాటేందుకు వీలుగా చర్యలు
చర్చలు చర్చలే.. దాడులు దాడులేనని అంతవరకు పరిస్థితిలో ఏ మార్పు రాదని రష్యా చెప్తోంది. మా డిమాండ్లను ఇంతకు ముందే చెప్పం.. అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది. దోనాస్క్ ల్యూనిస్క్‌లను వదిలేయాలని ఉక్రెయిన్ అంటోంది. ప్రస్తుతం ఈ రెండో విడత చర్చల కోసం ఉక్రెయిన్ ప్రతినిధులు బెలారస్‌కు బయలుదేరారు. కాగా ఫిబ్రవరి 28న బెలారస్‌లో రష్యా ఉక్రెయిన్‌ల మధ్య సుమారు 4 గంటల చర్చలు జరిగాయి. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైయ్యాయి. ప్రస్తుతం గురువారం జరగబోయే చర్చలైనా సఫలం అవ్వాలని ఇరదేశాల ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment