అంతర్జాతీయ సమాజం నుంచి రష్యాను ఒంటరి చేయడం ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఆంక్షల మీద ఆంక్షలు, నిషేధాల మీద నిషేధాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో రష్యాకు నేరుగా వార్నింగ్ ఇస్తున్న అమెరికా.. ఇప్పుడు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న బెలారస్‌ను కాస్త గట్టిగానే హెచ్చరించింది.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి పరోక్ష సాయం అందిస్తున్న బెలారస్ దేశానికి అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే గనుక తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని తెలిపింది.‘‘ఇదేం తమాషా కాదు.. పుతిన్‌కు మద్ధతు ఇవ్వడం ఏంటి? ఉక్రెయిన్ పై పుతిన్ దురాక్రమణకు అలెగ్జాండర్ లుకషెంకో(బెలారస్ అధ్యక్షుడు) తన మద్దతు ఇలాగే కొనసాగిస్తే బాగోదు. లేదు ఇలాగే ఉంటే గనుక మునుముందు బెలారస్ తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది’’ అంటూ అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ హెచ్చరికలు జారీ చేశారు.
ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన బెలారస్.. అణు రహిత హోదా కలిగిన దేశం కూడా. కానీ, తాజా పరిణామాలతో ఈ హోదాను వదిలేసుకుంది. అంతేకాదు ఒకవైపు ఉక్రెయిన్ రష్యా అణ్వాయుధాలను తన భూభాగం నుంచి ఎక్కు పెట్టేందుకు అనుమతిస్తూ.. మరోవైపు చర్చలకు వేదికగా కూడా నిలిచింది. ఒకానొక టైంలో రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్ పై బెలారస్ కూడా సైనిక చర్యకు దిగొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. అందుకే బెలారస్ తీరుపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది. మరోవైపు బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాషెంకో కూడా తన కార్యనిర్వాహక అధికారాలను గణనీయంగా పెంచుకోగా.. జపాన్ సహా పలు దేశాలు రష్యాకు మద్దతు ఇస్తోందన్న కారణంతోనే యూరోపియన్ దేశం బెలారస్ పైనా ఆంక్షలు మొదలుపెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment