వాగ్నర్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ బెలారస్‌లో కాదు.. రష్యాలోనే ఉన్నాడు | Wagner chief Yevgeny Prigozhin is in Russia, says Belarus President | Sakshi

వాగ్నర్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ బెలారస్‌లో కాదు.. రష్యాలోనే ఉన్నాడు

Jul 7 2023 4:47 AM | Updated on Jul 7 2023 8:23 AM

Wagner chief Yevgeny Prigozhin is in Russia, says Belarus President - Sakshi

మిన్‌స్క్‌: రష్యా అధినేత పుతిన్‌పై స్వల్పకాలం తిరుగుబాటు చేసి, పెను సంచలనం సృష్టించిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నారని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకశెంకో గురువారం చెప్పారు. ప్రిగోజిన్‌ ప్రస్తుతం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరంలో ఆశ్రయం పొందుతున్నాడని తెలిపారు.

ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యా ప్రభుత్వం అందజేసిన నగదు, ఆయుధాలను వెనక్కిఇచ్చేసే ప్రయత్నంలో ప్రిగోజిన్‌ ఉన్నాడని వెల్లడించారు. వాగ్నర్‌ సైనిక దళాలు వారి క్యాంప్‌ల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఆయా క్యాంప్‌లు ఎక్కడున్నాయనే విషయం లుకశెంకో బయటపెట్టలేదు. బెలారస్‌లోని తమ మిలటరీ స్థావరాలను ఉపయోగించుకోవాలని వాగ్నర్‌ సభ్యులకు సూచించామని, వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ సిటీలో ప్రిగోజిన్‌ నివసిస్తున్నట్లు చెబుతున్న ఓ భవంతి ఫొటోలు, వీడియోలను రష్యా ఆన్‌లైన్‌ పత్రిక ఫోంటాకా బయటపెట్టింది. అయితే, ప్రిగోజిన్‌ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలేవీ లభించలేదు. పుతిన్‌ క్షమాభిక్ష పెట్టిన తర్వాత ప్రిగోజిన్‌ బెలారస్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement