private army
-
ఆ దేశంలో ఉద్యోగాల పేరిట దారుణ మోసం: కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: మంచి జీతం అనగానే ట్రావెల్ ఏజెంట్ మాటలు నమ్మి హైదరాబాద్‌కు చెందిన అస్వాన్.. రష్యాలో ఉద్యోగం కోసం వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక బలవంతంగా సైన్యం చేర్పించారు. ఆపై ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఆ యువకుడు ప్రాణం విడిచాడు. రష్యాలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మానవ అక్రమరవాణాను గుర్తించిన కేంద్రం.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారతీయులు పలువురు చిక్కుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘రష్యాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరిట ప్రైవేట్ సైన్యంలో చేరుస్తున్నారు. అలాంటి వాళ్లను గుర్తించి వెనక్కి రప్పించే ప్రయత్నంలో ఉన్నాం’’ అని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ గుర్తించినట్లు తెలిపింది కేంద్రం. మోసకారి మాటలతో రష్యా ప్రైవేట్ సైన్యంలో భారతీయుల్ని చేరుస్తున్న ఏజెంట్లను సీబీఐ గుర్తించిందని.. పలువురిపై కేసులు కూడా నమోదు చేసిందని కేంద్రం తెలిపింది. రష్యాలో ఉద్యోగాల పేరిట.. ఏజెంట్ల ఇచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దంటూ అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ ముఠాలు 35 మంది భారతీయుల్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతమంది ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు!
వాషింగ్టన్: రష్యాలోని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ సహా పదిమంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, విమానం కూలిన తీరుతో పాటు ఇతరత్రా అంశాలను విశ్లేషించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ పాట్ రైడర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చేశారని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ తన శత్రువులను తుదముట్టించే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, కూల్చేశారని వివరించారు. అయితే, పేలుడుకు కారణమేమిటనే విషయం కానీ, తన పేరును కానీ వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. మరోవైపు, తన సెక్యూరిటీతో పాటు తన అనుచరుల భద్రత విషయంలో తమ చీఫ్ ప్రిగోజిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వాగ్నర్ గ్రూపుకు చెందిన సైనికులు చెబుతున్నారు. అలాంటిది కీలక అనుచరులను వెంటబెట్టుకుని ఒకే విమానంలో ఎందుకు ప్రయాణించారో తెలియడం లేదంటున్నారు. వాగ్నర్ గ్రూపులోని కీలక వ్యక్తులంతా సెయింట్ పీటర్స్బర్గ్కు ఎందుకు వెళుతున్నారో కూడా తెలియదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా ప్రిగోజిన్ ఆఫ్రికా దేశంలో ఉన్నారని అక్కడ తమ సైన్యంలో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చని ఆయన తెలుపుతున్నట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం చూస్తే తిరుగుబాటు నాయకుడిని ఆఫ్రికాలోనే హత్య చేసి దాన్ని విమాన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రిగోజిన్ చనిపోయాడన్న వార్తపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఇందులో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ అయితే.. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై హేతుబద్దమైన అనుమానాలున్నాయని అన్నారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి ప్రిగోజిన్ ఉదంతాన్ని ఉదహరిస్తూ ప్రపంచ నేతలు స్పందించడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్‌పింగ్ -
వాగ్నర్ అనుభవంతో బెలారస్ బలోపేతం!
మిన్స్క్ (బెలారస్): ఉక్రెయిన్‌లో రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అనుభవాన్ని వాడుకోవాలని బెలారస్ భావిస్తోంది. వాగ్నర్ సేన శనివారం ఆ దేశంలో బెలారస్లో అడుగుపెట్టింది. ఇరు సైన్యాల మధ్య సమన్వయం కోసం సంయుక్త సైనిక విన్యాసాలు తదితరాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెరుపువేగంతో షూటింగ్, ప్రథమ చికిత్సలో బెలారస్ సైనికులకు వాగ్నర్ గ్రూప్ బలగాలు తరీ్ఫదునిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. -
మా దేశంలో కిరాయి సైన్యం లేదు..
మాస్కో: వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ కిరాయి సైనికులకు ఒకే యూనిట్‌గా సేవలందించేందుకు అవకాశం ఇచి్చనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఇప్పటి వరకు పనిచేసిన విధంగానే అదే కమాండర్ ఆధ్వర్యంలో వారు కార్యకలాపాలు సాగించవచ్చన్నారు. అదే విధంగా, తమ దేశంలో ప్రైవేట్ ఆర్మీ లేదని, అటువంటి వాటికి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. పుతిన్ 23 ఏళ్ల పాలనలో ఎన్నడూ లేని విధంగా గత నెలలో వాగ్నర్ గ్రూప్ సైనికుల తిరుగుబాటుయత్నం, బెలారస్ అధ్యక్షుడు లుకశెంకో మధ్యవర్తిత్వంతో 24 గంటల్లోనే సద్దుమణగడం తెలిసిందే. ఆ తర్వాత అయిదు రోజులకు జూన్ 29న వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ సహా అందులోని 35 మంది కమాండర్లతో సమావేశమైనట్లు పుతిన్ తాజాగా కొమ్మెర్‌శాంట్ పత్రికకు ఇచి్చన ఇంటర్వ్యూలో చెప్పారు. తిరుగుబాటుయత్నం కారణాలు, పరిస్థితులపై చర్చించానన్నారు. భవిష్యత్తులో పనిచేసేందుకు గల పలు అవకాశాలను వారి ముందుంచినట్లు వెల్లడించారు. ఇప్పటి మాదిరిగానే గ్రే హెయిర్ అనే కమాండర్ ఆధీనంలో పనిచేయడం అందులో ఒకటన్నారు. ఎటువంటి మార్పులు ఉండవని, గ్రూప్‌లోని అందరూ అందులో యథావిధిగా కొనసాగవచ్చని చెప్పానన్నారు. చాలా మంది కమాండర్లు ఈ ఆఫర్‌కు మొగ్గు చూపారన్నారు. అయితే, సమావేశం ముందు వరుసలో కూర్చున్న వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మాత్రం..తమ వాళ్లకు ఇది నచ్చలేదని చెప్పారన్నారు. అయితే, చివరికి వాగ్నర్ గ్రూప్ ఈ ఆఫర్‌కు అంగీకరించిందీ లేనిదీ పుతిన్ స్పష్టం చేయకపోవడం గమనార్హం. వాగ్నర్ గ్రూప్‌కు ఎలాంటి చట్టబద్ధత లేదని ఈ సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు. ‘ప్రైవేట్ మిలటరీ సంస్థలకు సంబంధించి దేశంలో ఎలాంటి చట్టాలు లేవు. కాబట్టి, రష్యాలో ప్రైవేట్ ఆర్మీ లేదు. ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్ల విషయమై ప్రభుత్వం, పార్లమెంట్ చర్చించాల్సి ఉంది’అని పుతిన్ వివరించారు. వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికులు రష్యా రక్షణ శాఖతో ఒప్పందానికి రావడం లేదా పొరుగునున్న బెలారస్‌కు వెళ్లిపోవడం, రిటైర్ కావడం వంటి అవకాశాలను ఇచి్చనట్లు గతంలో పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, వాగ్నర్ గ్రూప్‌నకు చెందిన కొందరు సభ్యులు బెలారస్లో తమ కార్యకలాపాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. -
వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ బెలారస్లో కాదు.. రష్యాలోనే ఉన్నాడు
మిన్స్క్: రష్యా అధినేత పుతిన్‌పై స్వల్పకాలం తిరుగుబాటు చేసి, పెను సంచలనం సృష్టించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నారని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో గురువారం చెప్పారు. ప్రిగోజిన్ ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో ఆశ్రయం పొందుతున్నాడని తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం రష్యా ప్రభుత్వం అందజేసిన నగదు, ఆయుధాలను వెనక్కిఇచ్చేసే ప్రయత్నంలో ప్రిగోజిన్ ఉన్నాడని వెల్లడించారు. వాగ్నర్ సైనిక దళాలు వారి క్యాంప్‌ల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఆయా క్యాంప్‌లు ఎక్కడున్నాయనే విషయం లుకశెంకో బయటపెట్టలేదు. బెలారస్‌లోని తమ మిలటరీ స్థావరాలను ఉపయోగించుకోవాలని వాగ్నర్ సభ్యులకు సూచించామని, వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ సిటీలో ప్రిగోజిన్ నివసిస్తున్నట్లు చెబుతున్న ఓ భవంతి ఫొటోలు, వీడియోలను రష్యా ఆన్లైన్ పత్రిక ఫోంటాకా బయటపెట్టింది. అయితే, ప్రిగోజిన్ ప్రస్తుతం రష్యాలోనే ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలేవీ లభించలేదు. పుతిన్ క్షమాభిక్ష పెట్టిన తర్వాత ప్రిగోజిన్ బెలారస్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. -
‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు
వాషింగ్టన్: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ప్రైవేట్ సైన్యం ‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ అధిపతి డేవిడ్ పేట్రాయస్ హెచ్చరించారు. తెరిచి ఉన్న కిటికీల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రిగోజిన్‌కు సూచించారు. గతంలో పుతిన్ ప్రత్యర్థులు చాలామంది ఇలా తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడి మరణించారని పేట్రాయస్ పరోక్షంగా తెలియజేశారు. తిరుగుబాటు చర్య నుంచి వెనక్కి తగ్గడం ద్వారా ప్రిగోజిన్ ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడుకున్నాడని, కానీ వాగ్నర్ గ్రూప్‌ను పోగొట్టుకున్నాడని అభిప్రాయపడ్డారు. రష్యా అధికార పీఠం పెత్తనాన్ని ప్రశ్నించినవారు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. సోవియట్ కూటమిలోనూ, ఆ తర్వాత రష్యాలోనూ ఇలాంటి మరణాలు సంభవించాయి. కిటికీల నుంచి కింద పడిపోయి చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. తనపై తిరుగుబాటు చేసిన వారిని పుతిన్ అంత సులభంగా వదిలిపెట్టబోరని ఆయన గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. ప్రిగోజిన్ ప్రస్తుతం బెలారస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అక్కడ సురక్షితంగా ఉంటారా? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. -
ప్రవాసంలోకి ప్రిగోజిన్
మాస్కో: రష్యాలో ప్రైవేటు సైన్యం తిరుగుబాటు ముగిసింది. సైనిక నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసి కొద్ది గంటల సేపు అల్లకల్లోలం సృష్టించిన ప్రైవేటు సైన్యం సంస్థ వాగ్నర్ చీఫ్ యెవెగినీ ప్రిగోజిన్ వెనక్కి తిరిగారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉన్న బెలారస్‌కు ప్రవాసం వెళ్లాలని ప్రయాణమయ్యారు. అయితే ఆయన బెలారస్ చేరుకున్నారో లేదో అన్న దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సైనికులంతా ఎక్కడివారు అక్కడికే ఉక్రెయిన్ శిబిరాల్లోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. బెలారస్ అధ్యక్షుడు మధ్యవర్తిత్వంతో ఈ సంక్షోభం టీ కప్పులో తుపానులా సమసిపోయింది. ఒప్పందం ప్రకారం ప్రిగోజిన్‌పై పెట్టిన కేసులన్నింటినీ వెనక్కి తీసుకున్నట్టు రష్యా ప్రభుత్వం ప్రకటించింది. ప్రిగోజిన్‌తో పాటు తిరుగుబాటులో పాల్గొన్న వాగ్నర్ సైనికులపై ఎలాంటి విచారణ జరపబోమని స్పష్టం చేసింది. వాగ్నర్ సైనికుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో సైన్యంలోకి తీసుకుంటామని రష్యా రక్షణ శాఖ ఆఫర్ ఇచి్చంది. రక్తపాతం వద్దు అనే.. ప్రిగోజిన్‌ను దేశద్రోహి, వెన్నుపోటుదారుడు అని అభివరి్ణంచిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనూహ్యంగా ప్రిగోజిన్, అతని సైన్యాన్ని వదిలేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకవైపు ఉక్రెయిన్‌తో పూర్తి స్థాయి లో తలబడలేక అంతర్జాతీయంగా ఉన్న పరువును పోగొట్టుకున్న పుతిన్ ఇప్పుడు అంతర్గత సంక్షోభాలను తట్టుకునే స్థితిలో లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘దేశంలో రక్తపాతం జరగకుండా చూడాలని, అంతర్గత పోరు కొనసాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయన్న ఆందోళన కూడా ఆయనల ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ ఎంత బలహీనంగా మారిపోయారంటే ఎలాంటి రిస్క్ చేయలేకపోతున్నారు’’అనే విశ్లేషణలు వినబడుతున్నాయి. మరోవైపు తిరుగుబాటు జరిగిన మర్నాడే రష్యా విదేశాంగ శాఖ ఉప మంత్రి ఆండ్రూ చైనా పర్యటనకు వెళ్లారు. చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌తో తాజా పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాకు చైనా మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. రష్యా రక్షణ వ్యవస్థపై నీలినీడలు ప్రిగోజిన్ తిరుగుబాటుతో రష్యా రక్షణ వ్యవస్థలో ఉన్న డొల్లతనం బయటపడింది. వాగ్నర్ గ్రూప్ సైనికులు రాత్రికి రాత్రి కొన్ని గంటల వ్యవధిలో రోస్తావో నగరంలోకి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవేశించారు. ప్రభుత్వ సైనికులతో ఘర్షణలు చెలరేగాయి. ఈ సమయంలో వాగ్నర్ సైనికులు చేసిన దాడుల్లో 39 మంది పైలెట్లు మరణించినట్లు తెలుస్తోంది. అమెరికాకి ముందే తెలుసు రష్యాపై ప్రిగోజిన్ తిరుగుబాటు చేస్తారని అమెరికా నిఘా సంస్థలు ముందే పసిగట్టాయని వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలు ప్రచురించాయి. జూన్ మధ్యలో ప్రిగోజిన్ రష్యాపై తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా నిఘా సంస్థలకు సమాచారం అందింది. వారం క్రితం నిర్ధారణగా తెలిసింది. తిరుగుబాటుకు ఒక్క రోజు ముందే రష్యాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని అమెరికా ప్రభుత్వానికి నిఘా సంస్థలు నివేదిక ఇచ్చాయి. పుతిన్‌కు ఒకరోజు ముందే తిరుగుబాటు విషయం తెలుసని అమెరికా మీడియా అంటోంది. రష్యాలో పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అధినేతలతో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. తమ మద్దతు ఎప్పటికీ ఉక్రెయిన్‌కే ఉంటుందని పునరుద్ఘాటించారు. రష్యాలో తిరుగుబాటు జరిగినంత మాత్రాన తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. -
20 వేలమందిని బఖ్‌ముత్‌లో కోల్పోయాం
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని బఖ్ముత్ నగరంలో తమకు భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రైవేట్ సైన్యమైన ‘వాగ్నర్’ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ వెల్లడించారు. ఉక్రెయిన్ సేనలతో జరిగిన పోరాటంలో 20,000 మందికిపైగా సైనికులను కోల్పోయామని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా ప్రభుత్వం ఖైదీలకు, వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నవారికి కొంత శిక్షణ ఇచ్చి, ప్రైవేట్ సైన్యంగా మార్చి, ఉక్రెయిన్‌లో యుద్ధ రంగానికి పంపిస్తున్న సంగతి తెలిసిందే. బఖ్‌ముత్‌లో గత తొమ్మిది నెలలుగా సాగుతున్న హోరాహోరీ యుద్ధంలో ఉక్రెయిన్ జవాన్లు ఎంతమంది మరణించారన్నది తెలియరాలేదు. దీనిపై ఉక్రెయిన్ సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పది వేల మందికిపైగానే ఉక్రెయిన్ సైనికులు మరణించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
'బెల్ట్' తీసే ప్రైవేటు సేన!
సాక్షి, హైదరాబాద్ : బెల్టు షాపులకు మద్యం సరఫరా విషయంలో వ్యాపారుల మధ్య గొడవలను నియంత్రించేందుకు ఎక్సైజ్ అధికారులు ఓ చట్ట విరుద్ధ పాలసీని అమల్లోకి తెచ్చారు. అధీకృత (ఏ4 షాపు) మద్యం దుకాణం చుట్టూ ఉన్న రెవెన్యూ గ్రామాలను ఒక గ్రూపులో చేర్చి, ఆయా గ్రామాల్లో బెల్టు దుకాణాలకు నిర్ధేశిత ఏ4 దుకాణం యాజమాన్యమే మద్యం సరఫరా చేయాలని ఒప్పందం చేయించారు. ఈ ఒప్పందాన్ని అతిక్రమించకుండా పక్కాగా అమలు చేసేందుకు యాజమాన్యాలు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి లైసెన్స్డ్ దుకాణానికి నలుగురికి తగ్గకుండా ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నాయి. బెల్టు షాపే తారక మంత్రం ప్రభుత్వం మద్యం ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది. ఎంఆర్పీకి మించి మద్యం అమ్మిన దుకాణాలకు రూ.2 లక్షల జరిమానా, నెల పాటు లైసెన్స్ రద్దు చేస్తోంది. ఈ నిబంధన వ్యాపారులతోపాటు, ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఇబ్బందిగానే మారింది. అదనపు సంపాదన లేక వ్యాపారులు నెల మామూళ్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏ4 దుకాణాల ద్వారా మద్యం విక్రయాల నెలవారీ టార్గెట్లను అందుకోలేకపోతున్నారు.దీంతో ఎక్సైజ్ అధికారులు బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో 8,685 రెవె న్యూ గ్రామాలు, 21 వేల హాబిటేషన్లు ఉన్నా యి. ప్రతి రెవెన్యూ గ్రామంలో సగటున 5 చొప్పున, ప్రతి హాబిటేషన్ గ్రామంలో ఒకటి చొప్పున 65 వేలకు పైగా బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని మద్యం వ్యాపారంలో 60 శాతం బెల్టు దుకాణాల ద్వారానే నడుస్తోంది. ఏడాదికి కనీసం 633 లక్షల కేసుల మద్యం విక్రయించాలని, ఇందులో 283.20 లక్షల కేసుల బ్రాందీ, విస్కీ, 349.42 లక్షల కేసుల బీరు, 0.82 లక్షల కేసుల విదేశీ మద్యం విక్రయించడం ద్వారా రూ.15,836 కోట్ల విలువైన వ్యాపారం చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. మద్యం దుకాణాల ద్వారా అమ్మితే ఇందులో 40% మద్యం కూడా అమ్ముడవదు. దీంతో ప్రభుత్వం బెల్టు షాపులను ప్రోత్సహిస్తోంది. దుకాణానికి నలుగురు ఒప్పందం పక్కాగా అమలు చేసేందుకు దుకాణాల యాజమాన్యాలు ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి దుకాణానికి నలుగురు యువకుల చొప్పున చేర్చుకున్నారు. వీరికి నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తున్నారు. గ్రామాల్లోని బెల్టు దుకాణాలను నిత్యం పర్యవేక్షిస్తూ.. పక్క దుకాణాల నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నారని తెలిస్తే దాడులు చేయటమే వాళ్ల పని. మద్యం నిర్దేశిత దుకాణం లోనిదా? కాదా ? అని నిర్ధారించుకునేందుకు ‘వేర్ ఇట్’అనే ఎక్సైజ్ శాఖ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఫోన్స్‌లో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నారు. బెల్టు దుకాణంలోని మద్యం సీసా మూతకు అతికించిన లేబుల్‌ను స్కాన్ చేస్తే ఆ సీసా ఏ లైసెన్స్డ్ దుకాణం నుంచి వచ్చిందో తెలిసిపోతుంది. ఒకవేళ బెల్టు దుకాణాల నిర్వాహకులు ఒప్పందం అతిక్రమిస్తే ప్రైవేటు సైన్యం భౌతిక దాడులు చేస్తోంది. తర్వాత స్థానిక ఎక్సైజ్ అధికారికి ఫిర్యాదు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు వారి మీద అక్రమ మద్యం కేసులు నమోదు చేస్తున్నారు. తరచూ గొడవలు కొత్తగా లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. దీంతో వ్యాపారులు బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసే పనిలో పడ్డారు. ప్రతి క్వార్టర్‌కు ప్రస్తుతానికి ఎంఆర్పీ మీద రూ.2 అదనంగా వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులో రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకే మండలంలో రెండు,మూడు మద్యం దుకాణాలు ఉన్న చోట బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే విషయంలో తరచుగా గొడవలు తలెత్తుతున్నాయి. ఈ గొడవలను నివారించటం కోసం స్థానిక ఎక్సైజ్ పోలీసులు మధ్య వర్తిత్వం చేసి గ్రామాలను విభజించి పరిధిని నిర్ధారించారు. నిర్ధారించిన గ్రామా ల్లోని బెల్టు దుకాణాలకు మాత్రమే మద్యం సరఫరా చేయాలని ఒప్పందం చేసుకున్నారు. -
50 అడుగుల ఎత్తైన ప్రహరీగోడ- సాయుధ ప్రైవేటు సైన్యం!
బల్వారా: హర్యానాలోని బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్‌పాల్‌కు అతి పెద్ద ఆధ్యాత్మిక సామ్రాజ్యమే ఉంది. ఆయనకు చెందిన సత్యలోక్ ఆశ్రమం వద్ద శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు కేంద్రం 500 పారామిలటరీ బలగాలను తరలించిందంటే ఆ సామ్రాజ్యం ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఆశ్రమంలో రామ్‌పాల్ అనుచరులు 15వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆశ్రమం వద్దకు వెళితే ఆయన అనుచరులు పోలీసులపైనే తిరగబడ్డారు. అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసుల ఆదేశాలతో లోపల ఉన్న అనుచరులు తమతమ గ్రామాలకు వెళ్లిపోతున్నారు. సాయుధ బలగాల సహాయంతో హర్యానా పోలీసులు బుధవారం సాయంత్రం రామ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో అతను ముఖానికి వస్త్రం అడ్డుపెట్టుకున్నాడు. అతనిని రేపు కోర్టులో హాజరుపరుస్తారు. అరెస్ట్ సందర్భంగా ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి రామ్‌పాల్ అధిపతి. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న బల్వారాలో అతని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి చుట్టూ 50 అడుగుల ఎత్తైన ప్రహారీ గోడ ఉంది. లోపల 12 ఎకరాల విశాల స్థలం. ముఖ్య అనుచరులకు ఏసీ గదులు. ఎల్ఈడీ స్క్రీన్లు ఉన్న లెక్చర్ హాళ్లు ఉన్న ప్రధాన ఆశ్రమమనే ఆధునిక భవనంలో ఆయన నివాసం. అనుచరులు, సేవకులు, సాయుధ ప్రై వేటు సైన్యంతో పాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ కార్లు ఆయన సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీల్లో 25 లక్షలకు పైగా అనుచరులు, భక్తులున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని సమాచారం. **