
న్యూఢిల్లీ : భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఈ సీజన్‌లో నాలుగో స్వర్ణానికి గెలుపు దూరంలో నిలిచింది. బెలారస్‌లో జరుగుతున్న మెద్వేద్ ఓపెన్ టోర్నమెంట్‌లో వినేశ్ 53 కేజీల విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో వినేశ్ 11–0తో యాఫ్రెమెన్కా (బెలారస్)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో రష్యా రెజ్లర్ మలిషెవాతో ఆడుతుంది. ఈ సీజన్‌లో వినేశ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రి, యాసర్ డొగో టోర్నీ, పోలాం డ్ ఓపెన్ టోర్నీల్లో పసిడి పతకాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment