
అడిలైడ్: గత ఏడాది ఒక్క టైటిల్ నెగ్గలేకపోయిన బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ సబలెంకా ఈ సంవత్సరాన్ని టైటిల్‌తో ప్రారంభించింది. ఆదివారం ముగిసిన అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది.
ఫైనల్లో సబలెంకా 6–2, 7–6 (7/4)తో క్వాలిఫయర్ లిండా నొస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ టోర్నీలో సబలెంకా ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సబలెంకా కెరీర్‌లో ఇది 11వ టైటిల్‌కాగా... ఆమెకు 1,20,150 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 98 లక్షల 92 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment