ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాలు.. టాప్‌ సీడ్‌లకు షాకిచ్చిన అనామకులు | Australian Open 2024: Mirra Andreeva, Elina Avanesyan Shocks Top Seeds | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాలు.. టాప్‌ సీడ్‌లకు షాకిచ్చిన అనామకులు

Published Thu, Jan 18 2024 10:16 AM | Last Updated on Thu, Jan 18 2024 10:34 AM

Australian Open 2024: Mirra Andreeva, Elina Avanesyan Shocks Top Seeds - Sakshi

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో సంచలనాలు నమోదయ్యాయి. రష్యాకు చెందిన 16 ఏళ్ల మిరా అండ్రీవా అద్భుత ఆటతో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఆరో సీడ్‌ ఆన్స్‌ జెబర్‌ (ట్యునీషియా)ను ఇంటిదారి పట్టించగా... ఎలీనా అవెనెస్యాన్‌ (రష్యా) ఎనిమిదో సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌)ను బోల్తా కొట్టించింది. కేవలం 54 నిమిషాల్లో ముగిసిన ఈ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో అండ్రీవా 6–0, 6–2తో ఆన్స్‌ జెబర్‌పై, ఎలీనా 6–4, 6–4తో సాకరిపై గెలిచి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.  

ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 6–3, 6–2తో ఫ్రువిర్తోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, నాలుగో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 7–6 (7/2), 6–2తో డొలెహిడె (అమెరికా)పై, తొమ్మిదో సీడ్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 6–2తో తమారా (జర్మనీ)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ 3 గంటల 11 నిమిషాల్లో 6–3, 4–6, 7–6 (7/4), 6–3తో అలెక్సీ పాపిరిన్‌ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement