మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్)కు రెండో లీగ్ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మెక్సికోలోని కాన్‌కున్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అమెరికా ప్లేయర్ జెస్సికా పెగూలా 6–4, 6–3తో సబలెంకాను ఓడించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెగూలా ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు సబలెంకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సబలెంకా, రిబాకినా (కజకిస్తాన్) మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌కు రెండో సెమీఫైనల్ బెర్త్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment