
మినెస్క్: ఆడి కారులో తిరగాలన్న కోరికను ఓ పశువుల కాపరి వినూత్న ఆలోచనతో తీర్చుకున్నారు. జీవితంలో ఏనాటికైనా ఆడి కారు కొనాలని, అందులో తిరగాలనుకున్నది యూరప్‌లోని బెలారస్‌కు చెందిన అలెక్సీ చిరకాల వాంఛ. అయితే, ఆడి కారు కొనే స్థోమత లేకపోవడం, ఒకవేళ అప్పోసప్పో చేసి దానిని కొనుగోలు చేసినా గొర్రెలు, ఆవులకు కాపరిగా దాన్ని తీసుకుని వెళ్ళలేడు. దాంతో ఆయనకు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. పనిచేయని ఓ ఆడి కారును కొనుగోలు చేసి, దాని ఇంజిన్ భాగాన్ని తొలగించి గుర్రపు బండిగా మార్చేశాడు అలెక్సీ. గుర్రం కారును లాగుతుంటే ఆయన ఎంచక్కా అందులో గొర్రెలు, ఆవులు కాసేందుకు వెళ్తున్నాడు. పెట్రోల్ ఖర్చు భారం కూడా లేదు. పశువుల కాపరిగా పనులు చేసుకోవడంతోపాటు, ఆడి కారు కమ్ గుర్రపు బక్కీలో ఆయన షికార్లకు సైతం వెళుతూ మురిసిపోతున్నాడు. అలెక్సీ ఆడికారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









Comments
Please login to add a commentAdd a comment