న్యూఢిల్లీ: రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించడం కోసం ప్రపంచ బ్యాంక్‌తో రూ.1,300 కోట్లకు పైగా లైన్ ఆఫ్ క్రెడిట్‌పై (ఎల్‌ఓసీ) సంతకం చేసినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుక్రవారం తెలిపింది.
గృహ,ఇన్‌స్టిట్యూషనల్ విభాగాల్లో గ్రిడ్‌కు అనుసంధానించే రూఫ్‌టాప్ సోలార్ పీవీ ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇవ్వడం కోసం ఈ ఎల్‌ఓసీ అని ఎస్‌బీఐ శుక్రవారం తెలిపింది.
పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్ట్‌లకు రుణ సా యం అందించేందుకు యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌తో సుమారు రూ.1,800 కోట్ల ఎల్‌ఓసీపై ఎస్‌బీఐ ఈ వారం ప్రారంభంలో సంతకం చేసింది.ఎల్‌ఓసీ అనేది బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థ ద్వారా ప్రభుత్వం, కంపెనీ లేదా వ్యక్తిగత కస్టమర్‌కు ఇచ్చే రుణ సదుపాయం.
Comments
Please login to add a commentAdd a comment