దేశంలో ఆయా బ్యాంకుల వద్ద లోన్లు తీసుకుని ఉద్దేశ పూర్వకంగా ఎగవేతకు (ఎగ్గొట్టే) పాల్పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా అప్పులు తీసుకుని ఎగ్గొట్టి, మోసగించి తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్ల పని పట్టేందుకు ఆర్‌బీఐ నడుం బిగించింది.
ఇందులో భాగంగా ఆరునెలలు లోపాట ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడే వారితో పాటు లోన్లు తీసుకుని చెల్లించని వారిని గుర్తించేలా ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన గడువులోగా నికర నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) జాబితాలో చేర్చాలని ఆదేశించింది. అయితే, డీపాల్టర్స్ లిస్ట్‌ను ఎన్ని రోజుల్లోగా గుర్తించాలనే అంశంపై సెంట్రల్ బ్యాంక్ స్పష్టత ఇవ్వలేదు.
ట్రాన్స్‌యూనియన్ డేటా ప్రకారం.. మార్చి 2023 నాటికి ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన మొత్తం రూ.50,000 కోట్ల నుంచి రూ.353,874 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని 16,883 బ్యాంక్ అకౌంట్ల నుంచి తీసుకున్నారు.2022 మార్చి నెల సమయానికి 14,899 బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.304,063 మొత్తాన్ని తీసుకున్నారు. వెరసి నేషనల్ బ్యాంక్స్, ఎస్‌బీఐలలో రుణాలు తీసుకుని కావాలనే ఎగవేతకు పాల్పడింది 77 శాతంగా ఉంది.
మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (Wilful defaulters) జాబితాలో 1,921 ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్లు ఉండగా.. ఆ అకౌంట్ల నుంచి తీసుకున్న మొత్తం రుణాల విలువ రూ.79,271 కోట్లు, నేషనలైజ‍్డ్ బ్యాంక్స్ 11,935 అకౌంట్లు ఉండగా రుణాలు మొత్తం రూ. 193,596 కోట్లు, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లు 2,332 ఉండగా.. రుణాలు రూ. 54,250 కోట్లు, 2,231 పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లు ఉండగా ఆ రుణాల మొత్తం విలువ రూ.41,353 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు చెందిన 1,831 అకౌంట్లు ఉండగా వాటి మొత్తం విలువ రూ.35,623 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.22,754 కోట్లు తీసుకోగా అకౌంట్లు 340 ఉన్నాయి. ఐడీబీఐకి చెందిన 340 బ్యాంక్ అకౌంట్లు ఉండగా 24,192 కోట్లు ఉన్నాయి. మార్చి 2023 సమయానికి 36,150 ఎన్‌పీఏ బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.9.24లక్షల కోట్లు వసూలు చేసింది.
రుణాలు చెల్లించగలిగే శక్తి ఉన్నా.. కావాలనే ఎగవేతకు పాల్పడే ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు’గా గుర్తించేలా కఠిన నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం ఇలాగే కొనసాగేలా ఎగ వేతదార్ల జాబితా బయటపెట్టనుంది. ఈ నిర్ణయం ఎంత మేరకు లాభిస్తుందో చూడాల్సి ఉందని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment