దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీలో మరికొంత వాటాను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆర్‌బీఐ నుంచి అనుమతి పొందింది.
జనవరి 24, 2025 నాటికి ఎల్‌ఐసీ తన మొత్తం వాటాను మొత్తం వాటాను 9.99 శాతానికి పెంచుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీలో అదనంగా 4.8శాతం వాటాను పొందేలా ఎల్‌ఐసీకి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. 2023 డిసెంబర్ నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ 5.19 శాతం వాటాను కలిగి ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన నోటిఫికేషన్‌లో జనవరి 25, 2025 నాటికి బ్యాంక్‌లో 9.99శాతం వరకు కొనుగోలు చేయడానికి ఎల్‌ఐసీ.. ఆర్‌బీఐ నుంచి ఆమోదం పొందిందని తెలిపింది. అయితే నిబంధనలకు అనుగుణంగా ఏడాదిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో వాటాను ఎల్‌ఐసీ 9.99 శాతానికి పెంచుకోవచ్చు. అయితే ఆ పరిమితిని దాటకూడదు.
Comments
Please login to add a commentAdd a comment