wilful defaulters
-
ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు
బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను (విల్‌ఫుల్ డిఫాల్టర్) నిరోధించడానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక చర్యలను చేపట్టింది. వీరి వర్గీకరణపై తుది మార్గదర్శకాలను జారీ చేసింది.ఆర్బీఐ వివరాల ప్రకారం..రుణ ఖాతాలు మొండి బకాయిగా మారిన ఆరు నెలల లోపు విల్‌ఫుల్ డిఫాల్టర్లను నిర్దిష్టంగా గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేక కమిటీ పరిశీలిస్తూ ఉండాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల ఫొటోలను ప్రచురించాలి. ఎగవేతదారుకు, అతనికి సంబంధమున్న ఏ కంపెనీకీ అదనపు రుణ సదుపాయాలను అందించరాదు. ఎగవేతదార్ల జాబితా నుంచి బ్యాంకులు సదరు వ్యక్తి పేరును తొలగించిన ఏడాది వరకు ఇది అమల్లో ఉండాలి.ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!తాజా మార్గదర్శకాలు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఎక్స్పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) వంటి ఆర్థిక సంస్థలకు వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. బకాయి మొత్తం రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండి, రుణగ్రహీత లేదా గ్యారెంటార్ రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన పక్షంలో దాన్ని ‘విల్‌ఫుల్ డిఫాల్టర్’గా వ్యవహరిస్తారు. -
బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కావాలనే ఎగ్గొడితే.. రంగంలోకి ఆర్బీఐ
దేశంలో ఆయా బ్యాంకుల వద్ద లోన్లు తీసుకుని ఉద్దేశ పూర్వకంగా ఎగవేతకు (ఎగ్గొట్టే) పాల్పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా అప్పులు తీసుకుని ఎగ్గొట్టి, మోసగించి తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్ల పని పట్టేందుకు ఆర్బీఐ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఆరునెలలు లోపాట ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడే వారితో పాటు లోన్లు తీసుకుని చెల్లించని వారిని గుర్తించేలా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన గడువులోగా నికర నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలో చేర్చాలని ఆదేశించింది. అయితే, డీపాల్టర్స్ లిస్ట్‌ను ఎన్ని రోజుల్లోగా గుర్తించాలనే అంశంపై సెంట్రల్ బ్యాంక్ స్పష్టత ఇవ్వలేదు. ట్రాన్స్‌యూనియన్ డేటా ప్రకారం.. మార్చి 2023 నాటికి ఉద్దేశపూర్వకంగా రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన మొత్తం రూ.50,000 కోట్ల నుంచి రూ.353,874 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని 16,883 బ్యాంక్ అకౌంట్ల నుంచి తీసుకున్నారు.2022 మార్చి నెల సమయానికి 14,899 బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.304,063 మొత్తాన్ని తీసుకున్నారు. వెరసి నేషనల్ బ్యాంక్స్, ఎస్బీఐలలో రుణాలు తీసుకుని కావాలనే ఎగవేతకు పాల్పడింది 77 శాతంగా ఉంది. మరోవైపు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల (Wilful defaulters) జాబితాలో 1,921 ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్లు ఉండగా.. ఆ అకౌంట్ల నుంచి తీసుకున్న మొత్తం రుణాల విలువ రూ.79,271 కోట్లు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ 11,935 అకౌంట్లు ఉండగా రుణాలు మొత్తం రూ. 193,596 కోట్లు, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లు 2,332 ఉండగా.. రుణాలు రూ. 54,250 కోట్లు, 2,231 పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్లు ఉండగా ఆ రుణాల మొత్తం విలువ రూ.41,353 కోట్లు, యూనియన్ బ్యాంక్‌కు చెందిన 1,831 అకౌంట్లు ఉండగా వాటి మొత్తం విలువ రూ.35,623 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.22,754 కోట్లు తీసుకోగా అకౌంట్లు 340 ఉన్నాయి. ఐడీబీఐకి చెందిన 340 బ్యాంక్ అకౌంట్లు ఉండగా 24,192 కోట్లు ఉన్నాయి. మార్చి 2023 సమయానికి 36,150 ఎన్పీఏ బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.9.24లక్షల కోట్లు వసూలు చేసింది. రుణాలు చెల్లించగలిగే శక్తి ఉన్నా.. కావాలనే ఎగవేతకు పాల్పడే ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు’గా గుర్తించేలా కఠిన నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం ఇలాగే కొనసాగేలా ఎగ వేతదార్ల జాబితా బయటపెట్టనుంది. ఈ నిర్ణయం ఎంత మేరకు లాభిస్తుందో చూడాల్సి ఉందని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల నిబంధనలు కఠినతరం
ముంబై: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నిబంధనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సవరణలను ప్రతిపాదించింది. రూ. 25 లక్షలకు పైన బాకీ పడి, స్థోమత ఉన్నా చెల్లించడానికి నిరాకరిస్తున్న వారిని ఈ పరిధిలోకి చేర్చేలా నిర్వచనాన్ని మార్చనున్నట్లు ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ కోవకు చెందిన డిఫాల్టర్లకి రుణ సదుపాయాన్ని పునర్వ్యవస్థీకరించుకునేందుకు అర్హత ఉండదు. అలాగే ఇతరత్రా ఏ కంపెనీ బోర్డులోనూ పదవులు చేపట్టే వీలుండదు. బాకీలను వేగవంతంగా రాబట్టుకునేందుకు అవసరాన్ని బట్టి సదరు రుణగ్రహీతలు, హామీదారులపై బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మొండిబాకీగా వర్గీకరించిన పద్దుకు సంబంధించి ఆరు నెలల వ్యవధిలో ఉద్దేశపూర్వక ఎగవేత అవకాశాలను సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముసాయిదాపై సంబంధిత వర్గాలు అక్టోబర్ 31లోగా ఆర్బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు
అప్పుల ఎగవేతదారులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిబంధనలు ప్రతిపాదించింది. అకౌంట్లు నిరర్థకంగా మారిన ఆరు నెలల్లోపు సదరు రుణగ్రహీతలను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (Wilful Defaulters)గా ప్రకటించాలని బ్యాంకులకు, రుణ సంస్థలకు సూచించింది. (20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..) బకాయిలను చెల్లించగల సామర్థ్యం ఉండీ కూడా రుణాలు తిరిగి చెల్లించకుండా నిధులను ఇతర మార్గాలకు మళ్లీంచేవారిని ఆర్బీఐ ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారులు’ పరిగణిస్తుంది. అయితే దీనికి నిర్ధిష్ట కాల వ్యవధిని మాత్రం ఆర్బీఐ ఇంతవరకూ నిర్దేశించలేదు. ఇప్పుడు ప్రతిపాదించిన 6 నెలల కాలవ్యవధి నిబంధనలకు అనుగుణంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC) కూడా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ప్రకటించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ సూచించింది. అలాగే రుణగ్రహీత రాతపూర్వకంగా సమాధానమిచ్చేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగతంగా విచారణకు సైత అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ తన డ్రాఫ్ట్ మాస్టర్ ఆదేశాలలో పేర్కొంది. ఒక ఖాతా ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయినట్లు ప్రకటిస్తే.. తిరిగి ఆ ట్యాగ్ తొలగించిన ఒక సంవత్సరం వరకు బ్యాంకులు అదనపు రుణాలు మంజూరు చేయకూడదని ఆర్బీఐ నిర్దేశించింది. డిఫాల్ట్ అయిన ఖాతాను మరొక బ్యాంకుకు, రుణ సంస్థకు లేదా అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌కు బదిలీ చేయడానికి ముందు 'విల్‌ఫుల్ డిఫాల్ట్'ని నిర్ధారించడానికి లేదా తోసిపుచ్చడానికి దానిపై విచారణ పూర్తి చేయాల్సి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అటువంటి ఖాతాలను రీస్ట్రక్చర్ చేయడానికి వీలుండదని స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనలపై వాటాదారులు అక్టోబర్ 31 వరకు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. -
టాప్50 ఎగవేతదారుల బకాయిలు రూ.87 వేల కోట్లు
న్యూఢిల్లీ: గీతాంజలి జెమ్స్..ఇరా ఇన్ఫ్రా.. ఆర్ఈఐ ఆగ్రో.. ఏబీజీ షిప్‌యార్డు తదితర టాప్–50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు(సంస్థలు) దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సుమారు రూ.87,295 కోట్ల మేర బకాయి పడ్డారు. ఇందులో టాప్–10 మంది ఎగవేతదారులు రూ.40,825 కోట్ల మేర షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు(ఎస్సీబీ)లకు బకాయి ఉన్నారని కేంద్రం తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి ఎస్సీబీలు మొత్తం రూ.10,57,326 కోట్ల మేర రుణాలను మాఫీ చేసినట్లు ఆర్బీఐ తెలిపిందన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి టాప్–50 ఉద్దేశపూర్వక డిఫాల్టర్లు ఎస్‌సీబీలకు రూ.87,295 కోట్ల బకాయి పడినట్లు ఆర్బీఐ తెలిపిందన్నారు. ఇందులో పరారైన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ సంస్థ అత్యధికంగా రూ.8,738 కోట్లు ఎస్‌సీబీలకు బకాయి పడింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కలి్పంచే నిబంధన 2007 నుంచే ఉందని మంత్రి వివరించారు. మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన..2022–23 సంవత్సరాల్లో నమోదైన 66,069 ఆన్లైన్ మోసాల ఘటనల్లో రూ.85.25 కోట్ల మేర నష్టం జరిగిందని చెప్పారు. -
రాహుల్‌కి నిర్మలా సీతారామన్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుల బకాయిల మాఫీ ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ముఖ్యంగా రుణాలను ఎగవేసిన వారిలో ఎక్కువగా బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన దాడికి ఆమె ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నిర్మలా సీతారామన్ బ్యాంకు రుణాల మాఫీ విషయంపై రాహుల్ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మండిపడ్డారు. ఈ విషయంలో అవగాహన కోసం కాంగ్రెస్ హాయంలో ఆర్థికమంత్రిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను సంప్రదించాలని కోరారు. బ్యాంకులు ఎవరి రుణాలను మాఫీ చేయలేదని, రుణాలు చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ కావాలనే ఎగగొట్టినవారిని ‘విల్ ఫుల్ డీఫాల్టర్లు’గా ఆర్బీఐ ఆయా కేటగిరీల్లో చేర్చిందని వివరించారు. (షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ) 2009-10, 2013-14 మధ్య షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 1,45,226 కోట్లను మాఫీ చేశాయని గుర్తు చేశారు. రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనల్ సైకిల్ ప్రకారం ఎన్‌పిఎలకు (నిరర్ధక ఆస్తులు) కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. నాటి యూపీఏ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా లాభపడినవారే డిఫాల్టర్లుగా మారారని నిర్మలా సీతారామన్ ఎదురు దాడికి దిగారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నరుగా ఉన్న రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఉటంకించారు. 2006-2018 మధ్య కాలంలోనే మొండి రుణాలను ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా సీతారామన్ చెప్పుకొచ్చారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వివరాలను కూడా ట్విట్ చేశారు. వీళ్లను ఫ్యుజిటివ్ ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించడంతోపాటు వారికి సంబంధించిన స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. రెడ్ కార్నర్ నోటీసులిచ్చాం. వారిని స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ఆయాదేశాలతో కలసి పని చేస్తున్నామని చెప్పారు. వరుసగా 13 ట్వీట్లలో ప్రభుత్వ వైఖరిని వివరించారు. (‘ఎగవేతదారుల్లో వారే అధికం’) కాగా ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఆర్బీఐ 50 మంది డీఫాల్టర్ల జాబితాను విడుదల చేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రుణాలు ఎగగొట్టిన వారిలో బీజేపీ మిత్రులు ఉన్నారంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. @INCIndia and Shri.@RahulGandhi should introspect why they fail to play a constructive role in cleaning up the system. Neither while in power, nor while in the opposition has the @INCIndia shown any commitment or inclination to stop corruption & cronyism. — Nirmala Sitharaman (@nsitharaman) April 28, 2020 -
రూ. 68,607 కోట్ల బాకీల రైటాఫ్
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా లోని టాప్ 50 సంస్థలు కట్టాల్సిన రూ. 68,607 కోట్ల మేర రుణాల బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ లిస్టులో విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఆర్బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్ 30 నాటి వరకు గణాంకాల ప్రకారం.. టాప్ 50 లిస్టులో.. గీతాంజలి జెమ్స్ (పరారీలో ఉన్న చోక్సీకి చెందిన సంస్థ) అత్యధికంగా రూ. 5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది. ఆర్ఈఐ ఆగ్రో రూ. 4,314 కోట్లు, విన్సమ్ డైమండ్స్ రూ. 4,076 కోట్లు కట్టాల్సి ఉంది. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 1,943 కోట్ల బాకీలతో 9వ స్థానంలో ఉంది. ఇక డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ. 1,962 కోట్లు, ట్రాన్స్ట్రాయ్ రూ. 1,790 కోట్లు బాకీ పడ్డాయి. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిబ్రవరి 16న ఎగవేతదారుల వివరాల కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేశారు. అయితే అప్పట్లో ఆ వివరాలు అందుబాటులో లేవని పేర్కొన్న రిజర్వ్ బ్యాంక్.. ఏప్రిల్ 24న రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరోవైపు, డిఫాల్టర్ల జాబితాలో చాలా మంది అధికార బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అందుకే, దీనిపై తాను పార్లమెంటులోనే ప్రశ్నించినా ప్రభుత్వం దాటవేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ 2019 సెప్టెంబర్ దాకా బీజేపీ ప్రభుత్వం రూ. 6.66 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించింది. -
షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభంతో దేశ ఆర్థికవ్యవస్థ తీవ్రమైన మాంద్యంలోకి జారిపోతున్న వేళ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించిన వ్యాపార వేత్తలకు సంబంధించి రూ. 60వేల కోట్లకుపైగా మాఫీ (రైట్ ఆఫ్) చేసినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ 30, 2019 నాటికి బ్యాంకులు 68,000 కోట్ల రూపాయల వరకు రుణాలను నిలిపి వేసినట్లు సమాచార హక్కు (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే తన ట్విటర్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం నిరాకరించడంతో తాను ఇదే విషయంపై ఆర్టీఐని ఆశ్రయించినట్టు గోఖలే ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 16 న టాప్-50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వారి ప్రస్తుత రుణ స్థితికి సంబంధించిన వివరాలను కోరగా, ఏప్రిల్ 24న తనకు ఈ సమాధానం వచ్చినట్టు గోఖలే చెప్పారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు చెల్లించాల్సిన మొత్తం రూ .68,607 కోట్లు మాఫీ అయ్యాయని గోఖలే ట్వీట్ చేశారు. వీరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తదితరులు ఉన్నారు. ప్రధానంగా ఈ సంస్థల్లో ఆరు డైమండ్ అండ్ జ్యుయల్లరీ సంస్థలు ఉండటం గమనార్హం. 'విల్‌ఫుల్ డిఫాల్టర్స్' జాబితాలో రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ.5492 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. సందీప్, సంజయ్ ఝున్ ఝన్ వాలాకు చెందిన ఎఫ్ఎంసిజి సంస్థ ఆర్ఇఐ ఆగ్రో లిమిటెడ్, (రూ. 4314 కోట్లు), జతిన్ మెహతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ లిమిటెడ్ ( రూ.4వేల కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రూ.2,850 కోట్లతో కాన్పూర్ ఆధారిత కంపెనీ రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. వీరితో పాటు బాబా రామ్‌దేవ్ బాలకృష్ణ గ్రూప్ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండోర్ (రూ .2,212 కోట్లు) డిఫాల్టర్ల జాబితాలో ఉంది. ఇక రూ.1,943 కోట్ల విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా ఈ జాబితాలో వుంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ విదేశీ రుణగ్రహీతలపై సమాచారాన్ని వెల్లడించడానికి ఆర్బీఐ నిరాకరించింది. This is why Finance Minister @nsitharaman tried to escape from a straight & clear question asked by Rahul Gandhi. Sadly - the truth can never stay hidden too long. Massive kudos to RG for calling the govt’s bluff way back in March! PS: Here’s the list if anyone missed it 😊 https://t.co/OA4moYdTYz pic.twitter.com/JsaoBewhBT — Saket Gokhale (@SaketGokhale) April 28, 2020 -
విదేశాలకు ఎగిరి పోకుండా ఆంక్షలు
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోతున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకుని, విదేశాలకు వెళ్తున్న ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోంది. ఇక మీదట ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకుండా ఉండేలా కఠిన వైఖరి అనుసరించాలని కేంద్రం భావిస్తోంది. దీని కోసం పైనాన్సియల్ సర్వీసెస్ సెక్రటరీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ పలు సూచనలను కేంద్రం ముందు ఉంచింది. వాటిలో ఒకటి దేశీయ పాస్‌పోర్టు చట్టం సెక్షన్ 10లో సవరణ. ఈ చట్టం పాస్‌పోర్ట్‌ల రద్దుకు సంబంధించింది. అంతేకాక రూ.50 కోట్లు, ఆపై రుణాలు తీసుకునే వారి పాస్‌పోర్టు వివరాలను కూడా తప్పనిసరిగా బ్యాంక్‌లు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ వీరు ఉద్దేశ్యపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోవాలనుకుంటే, ఎయిర్‌పోర్టుల వద్దనే వారికి చెక్ పెట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్బీఐ ప్రతినిధులు, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధులు, ఈడీ, సీబీఐ ప్రతినిధులు ఉన్నారు. పీఎన్బీలో రూ.14వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీతో పాటు, విజయ్‌మాల్యా, మరికొంత మంది ప్రమోటర్లు బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. వారిపై చర్యలు తీసుకునేందుకు, వారు అసలు భారత్‌కు రావడం లేదు. దీంతో ముందస్తు జాగ్రత్తలుగా రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు కలిగి ఉన్న ఎన్పీఏ అకౌంట్లు ఏమేమీ ఉన్నాయో విచారణ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఆదేశించింది. కాగా గత కొన్ని రోజుల క్రితమే రూ.100 కోట్ల కన్నా ఎక్కువ విలువైన ఆర్థిక నేరాలకు పాల్పడేవారి ఆస్తులను, వారి బినామీ ఆస్తులను జప్తు చేయడానికి కేంద్రం ఆర్థిక నేరగాళ్ల బిల్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం
-
మొండి బకాయిలను ఎస్బీఐ ఏం చేసింది?
న్యూఢిల్లీ: దేశ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో ఉన్న రుణ బకాయిలను వేరే ఖాతాలోకి మళ్లించి... తన బ్యాలెన్సు షీటులో మొండి బకాయిల భారం లేకుండా చూసుకుంది. ఇందుకోసం రిజర్వు బ్యాంకు అనుమతించిన పద్ధతి అయిన 'అడ్వాన్స్ అండర్ కలెక్షన్ అకౌంట్స్ (ఆకా)' అనే పద్ధతిని అవలంబించింది. దీని ప్రకారం మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులను ఒక ప్రత్యేకమైన అకౌంటులోకి బదిలీ చేస్తారు. తద్వారా ముందుగా అవి బ్యాంకు బ్యాలెన్సు షీటులో కనిపించవు. తద్వారా బ్యాంకు పనితీరు మెరుగుపడినట్లు అవుతుంది. కానీ, అంతమాత్రాన వాటిని పూర్తిగా మాఫీ చేసినట్లు కాదు. వన్‌టైమ్ సెటిల్మెంట్లు తప్ప మిగిలిన బకాయిలన్నింటినీ సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు చూపించినా, వాటిని 'ఆకా'లో యథాతథంగా ఉంచుతారు. అంటే, చిట్టచివరి రూపాయి వసూలయ్యే వరకు వాటి రికవరీ విధానం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పద్ధతిలో మొత్తం 63 మంది డిఫాల్టర్లకు చెందిన మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.7,016 విలువ చేసే నిరర్థక ఆస్తులను ఇలా చేసినట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ మేరకు డైలీ న్యూస్ & అనాలిసిస్ బుధవారం ఒక కథనం ప్రచురించింది. ఇలా చేసిన రుణాలలో... విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫియర్ ఎయిర్ లైన్స్ బకాయిలు రూ 1,201 కోట్లు కూడా ఉన్నాయి. మొండిబకాయిల జాబితాలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అగ్రస్థానంలో ఉంది. మరికొన్ని తెలుగు కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రూ.93.91 కోట్లు విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ లిమిటెడ్ రూ. 66.57 కోట్లు కెఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు రూ. 86.73 కోట్లు ఘన్ శ్యాం దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ రూ.61.72 కోట్లు తెలంగాణ తోటెం ఇన్ ఫ్రా లిమిటెడ్ రూ. 93.68కోట్లు ఎస్ఎస్బీజీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ రూ.65.24 కోట్లు వీటితోపాటు కేఎస్ ఆయిల్ (రూ 596 కోట్లు), సూర్య ఫార్మాస్యూటికల్స్ (రూ 526 కోట్లు) జీఈటీ పవర్, (రూ .400 కోట్లు) సాయి అండ్ ఇన్ఫో సిస్టమ్ (రూ 376 కోట్లు) ఉన్నాయి. 63 ఖాతాలను పూర్తిగా ఆకాలోకి మళ్లించగా, 31 ఖాతాలను పాక్షికంగా మళ్లించినట్లు తెలిపింది. ఆరింటిని మొండి బకాయిలుగా చూపించారు. ఈ తరలింపు ద్వారా దాని బ్యాలెన్స్ షీట్లు సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. -
బడా ఎగవేతదారులతోనే దెబ్బ!
ఆనంద్(గుజరాత్): బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడానికి బడా రుణ ఎగవేతదారులే కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ‘కొంత మంది పెద్ద రుణ గ్రహీతల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిలు భారీగా ఎగబాకి నష్టాలపాలవుతున్నాయి. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలన్న బాధ్యతలేకుండా రిస్క్‌లేని పెట్టుబడిదారీ విధానంతో ఈ బడా రుణ గ్రహీతలు ఒకరకంగా జల్సా చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు, నిజాయితీగా రుణాలను చెల్లించేవాళ్లు దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఒక పెద్ద రుణ గ్రహీత మొండిబకాయిదారునిగా మారితే.. పరిశ్రమ దిగ్గజం కాబట్టి వెసులుబాటు ఇవ్వడం కుదరదు. దేశ ప్రజల కష్టార్జితాన్ని అనుభవిస్తున్న పరాన్నభుక్తులుగా వీళ్లను పేర్కొనవచ్చు’ అని రాజన్ పేర్కొన్నారు. మంగళవారమిక్కడ డాక్టర్ వర్ఘీస్ కురియన్ మూడో మెమోరియల్ లెక్చర్ కార్యక్రమంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్రమైన మొండిబకాయిల సమస్యలను ఎదుర్కొంటుండటం... అదికూడా కొన్ని బడా కార్పొరేట్లకు ఇచ్చిన రుణా ల రికవరీ జటిలంగా మారుతున్న నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నేను రిస్క్ తీసుకోవడానికి వ్యతిరేకం కాదు. కొంత మంది ప్రమోటర్లు తమ వ్యాపారాలు నిలదొక్కుకోవాలంటే కొన్ని ప్రోత్సాహకాలు కల్పించాలంటూ బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వాలను బెదిరిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే, దురదృష్టవశాత్తూ మన రుణ వ్యవస్థ దుర్భరంగా ఉంది. ఇటీవల కొన్నేళ్లుగా తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులు సజావుగా జరగడం లేదు. ఈ ఇబ్బందులకు పెద్ద రుణ గ్రహీతలే కారణం. చిన్న రుణ గ్రహీతల వల్ల ఎలాంటి సమస్యాలేదు. అని కూడా రాజన్ అన్నారు. ఇవే అభిప్రాయాలతో గతంలో రాజన్ ‘సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ద క్యాపిటలిస్ట్స్’ అనే పుస్తకాన్ని రాయడం గమనార్హం. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ పలు బ్యాంకులకు రూ.7,000 కోట్లకుపైగా రుణాలు చెల్లించకుండా మొండిబకాయిదారుగా మారడం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం నాటికి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోని రుణాల్లో మొండిబకాయిలు(పునర్వ్యవస్థీకరించిన వాటితో సహా) 10.4 శాతానికి ఎగబాకడం అటు ప్రభుత్వం, ఇటు నియంత్రణ సంస్థల్లో గుబులు పుట్టిస్తోంది. సమాజంలో ఆగ్రహం... రుణాల చెల్లింపుల విషయంలో కార్పొరేట్ల నిర్లక్ష్య ధోరణి కారణంగా సమాజంలో ఆందోళనలు పెల్లుబికేందుకు దారితీయొచ్చని కూడా రాజన్ వ్యాఖ్యానించారు. ప్రమోటర్లు, బ్యాంకుల మధ్య కుదిరే రుణ ఒప్పందాలపై మాట్లాడుతూ... బ్యాంకులు కొన్నిసార్లు బడా రుణ గ్రహీతల పలుకుబడి ఇతరత్రా అంశాల వల్ల తలొగ్గాల్సి వస్తుందన్నారు. ‘ప్రమోటర్లు తమ సొంత సొమ్ముతో కాకుండా ప్రజల సొమ్ముతో ఇష్టానుసారంగా వ్యాపారాలను నిర్వహిస్తుంటారు. దీనివల్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది. దీంతో చట్టాలను మరింత పటిష్టం చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల చిన్న సంస్థలు ఇబ్బందుల్లో పడతాయి’ అని రాజన్ పేర్కొన్నారు. ఎవరైనా బడా రుణ గ్రహీత ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టినా.. లేదంటే బ్యాంకులకు చెల్లింపుల్లో సహకరించకపోయినా దీని అర్థం ఒక్కటే.. పన్ను చెల్లింపుదార్లను దోచుకుంటున్నట్లే లెక్క. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అవసరమైన కొత్త పెట్టుబడుల నిధులపై మరింత భారం పడేందుకు దీనివల్ల దారితీస్తుందని రాజన్ పేర్కొన్నారు. 2013-14లో బ్యాంకులు రూ.2.36 లక్షల కోట్ల బకాయిలను వసూలు చేసుకోవాల్సి ఉండగా.. రుణ వసూళ్ల ట్రిబ్యునల్(డీఆర్టీ) ద్వారా కేవలం రూ.30,590 కోట్లను మాత్రమే రికవరీ చేసుకోగలిగాయని కూడా రాజన్ తెలిపారు. డీఆర్‌టీల్లో కేసులు పేరుకుపోతున్నాయన్నారు. ఈ విధానపరమైన జాప్యాల కారణంగా బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడుతోందని రాజన్ వివరించారు. వృద్ధి కోసం రిస్క్ తీసుకోవడానికి రెడీ.. నిలిచిపోయిన ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించగలిగితే మొండిబకాయిలు(ఎన్పీఏ)గా మారిన రుణాలను పునర్వ్యవస్థీకరించడంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు ఇవ్వడానికి సిద్ధమేనని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ‘రుణాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మరింత వెసులుబాటు కావాలంటూ బ్యాంకులు ఆర్బీఐని కోరుతున్నాయి. దీనివల్ల ఎన్‌పీఏల్లో కొంత భాగాన్ని ఆయా కంపెనీల్లో ఈక్విటీగా బ్యాంకులు తీసుకోవాల్సి వస్తుంది. వివిధ ప్రాజెక్టులకు నగదు ప్రవాహం పెరిగి మళ్లీ గాడిలోపడతాయని... వృద్ధి రేటు రికవరీ బాటలోకి పయనిస్తుందని భావిస్తే ఈ రిస్క్ తీసుకోవడానికి మేం సన్నద్ధంగానే ఉన్నాం’ అని రాజన్ వ్యాఖ్యానించారు. పర్యావరణ సంబంధ అనుమతుల్లో జాప్యం, భూసేకరణ వంటి అడ్డంకుల కారణంగా సుమారు రూ.20 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిలిచిపోయినట్లు అంచనా. దీంతో ఆర్బీఐ రుణాల పునర్ వ్యవస్థీకరణ నిబంధనలను కఠినతరం చేసింది. మరింత మొత్తాన్ని ప్రొవిజనింగ్గా పక్కనబెట్టాల్సి రావడంతో బ్యాంకుల లాభాలపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తోంది. ‘2010-11లో 9 శాతంపైగా నమోదైన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 5 శాతం దిగువకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్పీఏ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడం కోసం బ్యాంకుల నుంచి వస్తున్న డిమాండ్లుకూడా సరైనవే. గతంలో ఇలాంటి వెసులుబాటు ఇస్తే చాలా బ్యాంకుల యాజమాన్యాలు దుర్వినియోగం చేశాయి. అందుకే ఆర్బీఐ ఈ విషయంలో తటపటాయించాల్సి వచ్చింది’ అని రాజన్ పేర్కొన్నారు.