బ్యాంకుల్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులను (విల్‌ఫుల్ డిఫాల్టర్) నిరోధించడానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక చర్యలను చేపట్టింది. వీరి వర్గీకరణపై తుది మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆర్‌బీఐ వివరాల ప్రకారం..రుణ ఖాతాలు మొండి బకాయిగా మారిన ఆరు నెలల లోపు విల్‌ఫుల్ డిఫాల్టర్లను నిర్దిష్టంగా గుర్తించి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేక కమిటీ పరిశీలిస్తూ ఉండాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల ఫొటోలను ప్రచురించాలి. ఎగవేతదారుకు, అతనికి సంబంధమున్న ఏ కంపెనీకీ అదనపు రుణ సదుపాయాలను అందించరాదు. ఎగవేతదార్ల జాబితా నుంచి బ్యాంకులు సదరు వ్యక్తి పేరును తొలగించిన ఏడాది వరకు ఇది అమల్లో ఉండాలి.
ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే 100 మందికి తండ్రయ్యాడు..!
తాజా మార్గదర్శకాలు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) వంటి ఆర్థిక సంస్థలకు వర్తిస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బకాయి మొత్తం రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండి, రుణగ్రహీత లేదా గ్యారెంటార్ రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన పక్షంలో దాన్ని ‘విల్‌ఫుల్ డిఫాల్టర్’గా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment