గత ఏడాది పలు బ్యాంకులు కస్టమర్లకు తక్కువ కాలానికి ఎక్కువ వడ్డీ రేట్లు అందించేలా ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్ని అందుబాటులోకి తెచ్చాయి. వాటిలో కొన్ని పథకాల కాల వ్యవధి నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది.
ఎస్‌బీఐ, ఐడీబీఐ బ్యాంకులు అమృత్ కలశ్, అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ పేరుతో ఎఫ్‌డీలను అందిస్తున్నాయి. వాటిలో సీనియర్ సిటిజన్ల కోసం రీటైల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలశ్‌ను 400 రోజుల పాటు అందిస్తుంది. ఈ మొత్తం సమయానికి ఏడాదికి 7.10శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. ‘ది స్పెసిఫిక్ టెన్యూర్ స్కీమ్ ఆఫ్ 400’ (అమృత్ కలశ్) పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ ఏప్రిల్ 12, 2023 నుంచి ప్రారంభం అయ్యింది. ఇక సీనియర్ సిటిజన్లు అత్యతధికంగా 7.60 శాతం వడ్డీ పొందవచ్చు’ అని పేర్కొంది.
ఎస్‌బీఐ ప్రత్యేక ఎఫ్‌డీ పథకంలోని పలు డిపాజిట్‌లపై ప్రీమెచ్యూర్డ్ (విత్‌డ్రా), లోన్ వంటి సౌకర్యం కూడా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3శాతం నుంచి 7శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.50శాతం నుంచి 7.50శాతం మధ్య వడ్డీ పొందవచ్చు.
వడ్డీ చెల్లింపు, నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక వ్యవధిలో. ప్రత్యేక టర్మ్ డిపాజిట్లపై- మెచ్యూరిటీ ii) వడ్డీ, నెట్ ఆఫ్ టీడీఎస్, కస్టమర్ ఖాతాలో జమ అవుతుంది. ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా టీడీఎస్ విధిస్తారు. పన్ను మినహాయింపు కోసం డిపాజిటర్ ఫారమ్ 15G/15Hలో ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఐడీబీఐ బ్యాంక్ అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ
అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ అనేది 375, 444 రోజుల నిబంధనల కోసం ఐడీబీఐ బ్యాంక్ అందించే ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్. బ్యాంకు రెగ్యులర్, నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (ఎన్‌ఆర్‌వో) , నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్‌ఆర్‌వో) కస్టమర్లకు 444 రోజుల అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ పథకం కింద 7.15 శాతం వడ్డీ రేటు, 375 రోజుల టెన్యూర్ కాలానికి 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. వృద్ధులకు 7.65 శాతం పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ పౌరులకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3 శాతం, 6.80 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.50శాతం నుంచి 7.30శాతం మధ్య వడ్డీ రేట్లు పొందవచ్చు.
ఇతర ప్రత్యేక డిపాజిట్లు
ఇండియన్ బ్యాంకు ప్రత్యేక ఎఫ్‌డీ ఐఎన్‌డీ సూపర్ 400 రోజులు; ఐఎన్‌డీ సుప్రీ 300 డేస్ ఆగస్ట్ 31,2023న ముగుస్తుంది. పంజాబ్ - సింధ్‌లు 400 రోజులు 601 రోజుల వ్యవధిపై అధిక వడ్డీ రేటును అందిస్తాయి. పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2023గా బ్యాంకులు నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment