Idbi
-
ఎన్సీఎల్ఏటీలో కాఫీ డే సంస్థకి ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్)కి ఊరట లభించింది. కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఆదేశాలపై ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణ వరకు స్టే విధించింది. కంపెనీ పిటీషన్‌పై మూడు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఐడీబీఐ ట్రస్టీషిప్ సరీ్వసెస్ (ఐడీబీఐటీఎస్ఎల్)ను ఆదేశించింది. వివరాల్లోకి వెడితే, రూ. 228.45 కోట్ల మొత్తాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయిన కాఫీ డే సంస్థపై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్‌ని ఐడీబీఐటీఎస్ఎల్ ఆశ్రయించింది. దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్సీఎల్టీ, కంపెనీ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. అయితే, సస్పెండ్ అయిన కంపెనీ బోర్డు సీఈవో మాళవిక హెగ్డే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
ప్రముఖ బ్యాంకును అమ్మనున్న కేంద్రం..!
కేంద్రం కొన్ని ప్రభుత్వసంస్థల నుంచి చాలా కాలంగా పెట్టుబడులను ఉపసంహరిస్తోంది. వ్యూహాత్మక విక్రయాల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోందని పలుమార్లు చెప్పింది. తాజాగా ప్రముఖ బ్యాంకులోని ప్రభుత్వ వాటాను విక్రయించేందుకు సన్నద్ధం జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో ఐడీబీఐ బ్యాంక్‌లోని తమ వాటాను ఉపసంహరించుకుంటామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాండే మాట్లాడారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ వ్యూహాత్మక విక్రయం పూర్తవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి భద్రతాపరమైన అనుమతి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వ్యవస్థీకృత ఆమోదం లభిస్తే.. బ్యాంక్‌ను కొనేందుకు ఆసక్తి ఉన్నవారిని బిడ్ల ద్వారా ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో పరోక్షంగా, ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సుమారు 95 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి 45 శాతం వాటా ఉండగా, ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు 49.24 శాతం వాటా ఉంది. ఈ రెండు వాటాల్లో కలిపి మొత్తంగా దాదాపు 61 శాతం అమ్మేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇక 2022 అక్టోబర్‌లోనే బిడ్లను ఆహ్వానించగా, 2023 జనవరిలో కొంటామని కొందరు ఆసక్తికనబరిచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, వచ్చే నెలాఖర్లోగా ఖజానాకు రూ.17,500 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. సవరించిన అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణతో రూ.30,000 కోట్లను ఖజానాకు తరలించాల్సి ఉంది. ఇదీ చదవండి: పన్నుస్లాబ్ సవరణలపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు ఇదిలా ఉండగా, ఐడీబీఐ బ్యాంకులో వాటా కొనుగోలు చేయాలనుకునే బిడ్డర్లకు కనీసం రూ.22,500 కోట్ల కనీస నికర సంపద, గత ఐదేళ్లలో కనీసం మూడేళ్లలో నికర లాభాలు ఉండాలనే నియమాలు ఉన్నాయి. ఒకవేళ బిడ్డర్లు కన్సార్టియంగా ఏర్పడితే.. గరిష్ఠంగా నలుగురు మాత్రమే ఉండాలని ‘దీపం’ షరతు విధించింది. డీల్ కుదిరితే బిడ్డర్లు కనీసం 40 శాతం వాటాలను ఐదేళ్ల వరకు తమ వద్దే అట్టిపెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
ఐడీబీఐ బ్యాంక్ వేల్యుయర్ బిడ్డింగ్ ప్రక్రియ రద్దు
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసే అసెట్ వేల్యుయర్ ఎంపికకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను కేంద్రం రద్దు చేసింది. బిడ్డింగ్‌కు అంతగా స్పందన లభించకపోవడమే ఇందుకు కారణం. బిడ్డర్లను ఆకర్షించే విధంగా బిడ్డింగ్ నిబంధనలను మెరుగుపర్చి, త్వరలోనే కొత్త ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)ని జారీ చేయనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్) పేర్కొంది. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి 94.72 శాతం వాటాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా, రెండు కలిసి సుమారు 61 శాతం వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ఐడీబీఐ బ్యాంకు విలువను మదింపు చేసేందుకు అసెట్ వేల్యుయర్‌ను నియమించడానికి సెప్టెంబర్ 1న దీపమ్ .. బిడ్లను ఆహ్వానించింది. బిడ్ల సమర్పణకు అక్టోబర్ 9 గడువు అయినప్పటికీ అక్టోబర్ 30 వరకు పొడిగించారు. అయినప్పటికీ ఒకే ఒక్క బిడ్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఆర్ఎఫ్పీని జారీ చేయాలని దీపమ్ నిర్ణయించుకున్నట్లు వివరించాయి. వాటాల విక్రయం తర్వాత బ్యాంకులో ప్రభుత్వానికి 15 శాతం, ఎల్ఐసీకి 19 శాతం వాటాలు ఉండనున్నాయి. -
ఐడీబీఐ బ్యాంక్ నికర లాభం రూ.1,323 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను ఐడీబీఐ బ్యాంక్ రూ.1,323 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభంలో 60 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.6,066 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.6,924 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 16.51 శాతం నుంచి 4.90 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 1.15 శాతం నుంచి 0.39 శాతానికి దిగొచ్చింది. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన సమయానికి బ్యాంక్ ప్రమోటర్లయిన ఎల్ఐసీ, భారత ప్రభుత్వం వద్ద 94.72శాతం వాటా ఉంది. ఎఫ్ఐఐల వద్ద 0.40శాతం, డీఐఐల వద్ద 0.24శాతం, రిటైల్ ముదుపర్ల వద్ద 4.62శాతం వాటా ఉంది. -
పెట్టుబడి పెట్టారా? వడ్డీ 7.60 శాతం,ఈ ఎస్బీఐ పథకానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
గత ఏడాది పలు బ్యాంకులు కస్టమర్లకు తక్కువ కాలానికి ఎక్కువ వడ్డీ రేట్లు అందించేలా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్ని అందుబాటులోకి తెచ్చాయి. వాటిలో కొన్ని పథకాల కాల వ్యవధి నేటితో ముగియనున్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ, ఐడీబీఐ బ్యాంకులు అమృత్ కలశ్, అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ పేరుతో ఎఫ్డీలను అందిస్తున్నాయి. వాటిలో సీనియర్ సిటిజన్ల కోసం రీటైల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలశ్‌ను 400 రోజుల పాటు అందిస్తుంది. ఈ మొత్తం సమయానికి ఏడాదికి 7.10శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ వివరాల ప్రకారం.. ‘ది స్పెసిఫిక్ టెన్యూర్ స్కీమ్ ఆఫ్ 400’ (అమృత్ కలశ్) పేరుతో ఫిక్స్డ్ డిపాజిటర్లకు 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ ఏప్రిల్ 12, 2023 నుంచి ప్రారంభం అయ్యింది. ఇక సీనియర్ సిటిజన్లు అత్యతధికంగా 7.60 శాతం వడ్డీ పొందవచ్చు’ అని పేర్కొంది. ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీ పథకంలోని పలు డిపాజిట్లపై ప్రీమెచ్యూర్డ్ (విత్‌డ్రా), లోన్ వంటి సౌకర్యం కూడా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3శాతం నుంచి 7శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.50శాతం నుంచి 7.50శాతం మధ్య వడ్డీ పొందవచ్చు. వడ్డీ చెల్లింపు, నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక వ్యవధిలో. ప్రత్యేక టర్మ్ డిపాజిట్లపై- మెచ్యూరిటీ ii) వడ్డీ, నెట్ ఆఫ్ టీడీఎస్, కస్టమర్ ఖాతాలో జమ అవుతుంది. ఆదాయపు పన్ను నిబంధనలకు అనుగుణంగా టీడీఎస్ విధిస్తారు. పన్ను మినహాయింపు కోసం డిపాజిటర్ ఫారమ్ 15G/15Hలో ధరఖాస్తు చేసుకోవచ్చు. ఐడీబీఐ బ్యాంక్ అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ అనేది 375, 444 రోజుల నిబంధనల కోసం ఐడీబీఐ బ్యాంక్ అందించే ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్. బ్యాంకు రెగ్యులర్, నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్వో) , నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) కస్టమర్లకు 444 రోజుల అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ పథకం కింద 7.15 శాతం వడ్డీ రేటు, 375 రోజుల టెన్యూర్ కాలానికి 7.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. వృద్ధులకు 7.65 శాతం పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ పౌరులకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3 శాతం, 6.80 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.50శాతం నుంచి 7.30శాతం మధ్య వడ్డీ రేట్లు పొందవచ్చు. ఇతర ప్రత్యేక డిపాజిట్లు ఇండియన్ బ్యాంకు ప్రత్యేక ఎఫ్డీ ఐఎన్డీ సూపర్ 400 రోజులు; ఐఎన్డీ సుప్రీ 300 డేస్ ఆగస్ట్ 31,2023న ముగుస్తుంది. పంజాబ్ - సింధ్‌లు 400 రోజులు 601 రోజుల వ్యవధిపై అధిక వడ్డీ రేటును అందిస్తాయి. పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2023గా బ్యాంకులు నిర్ణయించాయి. -
ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ బ్యాంకు.. స్పష్టత ఇచ్చిన కేంద్రం!
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణను వాయిదా వేస్తున్నట్లు వస్తున్న వార్తల్ని కేంద్రం ఖండించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ నిర్వహణలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ (దీపం) విభాగం అధికారిక ప్రకటన చేసింది. ఐడీఐబీ బ్యాంక్‌ను వ్యూహాత్మక అమ్మక ప్రణాళికలు కొనసాగుతున్నట్లు తెలిపింది. ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ( Expression of Interest (EOI)దశలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రైవేటీకరణపై దీపం సెక్రటరీ తుహిన్‌కాంత పాండే ట్వీట్లు చేశారు. ఐడీబీఐ బ్యాంక్ కొనుగోలు కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈఏఐలు దాఖలయ్యాయని, ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా విక్రయించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కేంద్రం, ఆర్బీఐ ఐడీబీఐ కొనుగోలు చేసేందుకు దాఖలైన బిడ్లను పరిశీలిస్తుంది. ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి భద్రతాపరమైన అనుమతులు వచ్చిన వెంటనే రెండో దశ బిడ్ల ప్రక్రియ ప్రారంభం కానుందని తుహిన్‌కాంత పాండే పేర్కొన్నారు. ఐడీబీఐలో కేంద్రం,ఎల్ఐసీ వాటా ఎంతంటే కేంద్రం, ఎల్ఐసీ ఈ రెండింటికీ ఐడీబీఐ బ్యాంకులో 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. విక్రయంలో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.48 శాతం చొప్పున వాటాలు ఆఫర్ చేయనున్నాయి. విక్రయానంతరం ప్రభుత్వం 15%, ఎల్ఐసీ 19% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. -
ప్రైవేటు బ్యాంకుగానే ఐడీబీఐ బ్యాంక్, స్పష్టం చేసిన కేంద్ర ఆర్ధిక శాఖ
న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్ఐసీ, ప్రభుత్వ వాటాల విక్రయం తదుపరి ఐడీబీఐ బ్యాంకు దేశీ ప్రయివేట్ రంగ సంస్థగా కొనసాగనున్నట్లు ఆర్ధిక శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది. వ్యూహాత్మక విక్ర యం తదుపరి మిగిలిన 15% ప్రభుత్వ వాటాను పబ్లిక్ షేర్ హోల్డింగ్‌గా పరిగణించనున్నట్లు తెలియజేసింది. పబ్లిక్కు కనీస వాటా(ఎంపీఎస్) విషయంలో బ్యాంకు కొత్త యాజమాన్యానికి అధిక గడువును అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బ్యాంకును గెలుపొందిన బిడ్డర్ అనుబంధ సంస్థల పునర్వ్యవస్థీకరణను చేపట్టడంలో ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. బ్యాంకు కొనుగోలులో భాగంగా ముందస్తు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) సందేహాలకు సమాధానమిచ్చే ప్రక్రియకింద ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ ఈ అంశాలపై వివరణ ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకు విక్రయానికి ప్రభుత్వం అక్టోబర్ 7న బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. డిసెంబర్ 16కల్లా కొనుగోలుదారులు ఈవోఐలను దాఖలు చేయవలసి ఉంటుంది. సంయుక్తంగా విక్రయం ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా విక్రయించనున్నాయి. ప్రస్తుతం ఈ రెండింటికీ ఐడీబీఐ బ్యాంకులో 94.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎల్ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. పబ్లిక్ వాటా 5.2 శాతంగా నమోదైంది. దీంతో కొనుగోలుదారుడు 5.28 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించవలసి వస్తుంది. విక్ర యంలో భాగంగా ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభు త్వం 30.48 శాతం చొప్పున వాటాలు ఆఫర్ చేయనున్నాయి. విక్రయానంతరం ప్రభుత్వం 15%, ఎల్ఐసీ 19% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. -
ఐడీబీఐ వివరాలకు మరింత గడువు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆధ్యర్యంలోని ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రాసెస్‌కు ఆర్థిక శాఖ తాజాగా గడువును పొడిగించింది. ఆసక్తిగల సంస్థలు నవంబర్ 10లోగా వివరాలు తెలుసుకునే(క్వెరీస్) వెసులుబాటును కల్పించింది. తదుపరి డిసెంబర్ 16లోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. ఐడీబీఐ బ్యాంకులో 61 శాతం వాటా విక్రయించేందుకు ఈ నెల 7న ఆర్థిక శాఖ బిడ్స్‌కు ఆహ్వానం పలుకుతూ ప్రాథమిక సమాచార వివరాల(పీఐఎం)కు తెరతీసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా క్వెరీస్‌కు అక్టోబర్ 28వరకూ గడువు ప్రకటించింది. అయితే దీపమ్ తాజాగా పీఐఎంను సవరిస్తూ నవంబర్ 10వరకూ గడువు పెంచింది. తద్వారా మార్చికల్లా ఫైనాన్షియల్ బిడ్స్‌కు వీలున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి అర్ధభాగంలో బ్యాంకు ప్రయివేటైజేషన్‌ను పూర్తి చేయగలమని ఆశిస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం, ఎల్ఐసీకి బ్యాంకులో గల 94.72 శాతం సంయుక్త వాటా 34 శాతానికి పరిమితంకానుంది. బ్యాంకు ప్రయివేటైజేషన్‌లో భాగంగా ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటాలు విక్రయించనున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేరు బీఎస్ఈలో స్వల్పంగా బలపడి రూ. 45 వద్ద ముగిసింది. చదవండి: World smallest TV ప్రపంచంలోనే చిన్న టీవీ ఆవిష్కారం, ధర వింటే? -
చివరి దశకు ఐడీబీఐ ఎంఎఫ్ విలీనం
ముంబై: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్), ఐడీబీఐ ఎంఎఫ్ విలీనం చివరి దశకు చేరుకుంది. విలీన ప్రాసెస్ జరుగుతున్నట్లు ఎల్ఐసీ ఎంఎఫ్ ఎండీ, సీఈవో టీఎస్ రామకృష్ణన్ పేర్కొన్నారు. కీలకమైన చివరి దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. విలీనానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఐడీబీఐ ఎంఎఫ్ మాతృ సంస్థ ఐడీబీఐ బ్యాంకులో పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ మెజారిటీ వాటా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రెండు ఎంఎఫ్‌లలో ఒకే ప్రమోటర్‌కు 10 శాతానికి మించి వాటాకు నిబంధనలు అంగీకరించవంటూ ఇటీవల వెలువడుతున్న వార్తల నేపథ్యంలో విలీనానికి ప్రాధాన్యత ఏర్పడింది. రూ. 18,000 కోట్ల విలువైన నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగి ఉన్న ఎల్ఐసీ ఎంఎఫ్ విలీనానికి అత్యంత ప్రాధా న్యతను ఇస్తున్నట్లు రామకృష్ణన్ వెల్లడించారు. -
ఐడీబీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్!
ముంబై: ఐడీబీఐ బ్యాంక్ తన బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. బ్యాంకులో పెట్టుబడి పెట్టిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఎఫ్డీ వడ్డీ రేట్లలో కొన్ని మార్పులు చేసింది. రూ. 2 కోట్ల కన్నా తక్కువ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐడీబీఐ పేర్కొంది. ఐడీబీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 20 సంవత్సరాల మెచ్యూరిటీతో వస్తాయి. ఈ వ్యవధిలోని అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.7% నుంచి 4.8%% వరకు వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు అనేవి జూలై 14 నుంచి అమల్లోకి వచ్చాయి. ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ఎఫ్డీలపై ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్ల కొరకు ప్రస్తుతం బ్యాంక్ 3.2% నుంచి 5.3% వరకు ఎఫ్డీ రేట్లను అందిస్తుంది. ఈ డిపాజిట్లను పన్ను ఆదా చేసే ఎఫ్డీలు అని కూడా అంటారు. ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బీపీఎస్ వడ్డీరేట్లను అన్ని టెనర్లలో అందిస్తుంది. ఐడీబీఐ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ల అయితే ఈ వడ్డీ రేట్లకు 50 బీపీఎస్(0.50 శాతం) అదనం అని గుర్తు పెట్టుకోవాలి. ఎఫ్డీలపై తాజా వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 14 రోజులు వరకు అయితే 2.7% 15 రోజుల నుంచి 30 రోజులు వరకు అయితే 2.7% 31 రోజుల నుంచి 45 రోజులు వరకు అయితే 2.8% 46 రోజుల నుంచి 60 రోజులు వరకు అయితే 3.00% 61 రోజుల నుంచి 90 రోజులు వరకు అయితే 3.00% 3 నెలల నుంచి 6 నెలలు వరకు అయితే 3.5% 6 నెలలు 1 రోజు నుంచి 270 రోజులు వరకు అయితే 4.3% 271 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు అయితే 4.3% 1 సంవత్సరం వరకు అయితే 5% 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే 5.1% 2 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ అయితే 5.1% 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ అయితే 5.3% 5 సంవత్సరాల వరకు అయితే 5.25% 5 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 7 సంవత్సరాల వరకు అయితే 5.25% 7 సంవత్సరాలకంటే ఎక్కువ నుంచి 10 సంవత్సరాల వరకు అయితే 5.25% 10 సంవత్సరాలకంటే ఎక్కువ నుంచి 20 సంవత్సరాలు వరకు అయితే 4.8% -
అది ‘బ్యాడ్’ ఐడియా..!
న్యూఢిల్లీ: కొన్ని కీలక అంశాల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా మొండిబాకీల వసూళ్ల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ (బ్యాడ్ బ్యాంక్) ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ‘వ్యవస్థ స్థాయిలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రెండు, మూడు కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మొండిబాకీలను బ్యాడ్ బ్యాంక్‌కు ఏ రేటుకు విక్రయిస్తారనేది మొదటి అంశం. పారదర్శకంగా, సముచితమైన విధంగా విలువను నిర్ధారించడం జరగాలి. ఇక బ్యాడ్ బ్యాంక్ గవర్నెన్స్‌పై అత్యంత స్పష్టత ఉండాలి. చివరిగా రికవరీ రేటు ఎలా ఉంటుందనే దానిపైనా స్పష్టత ఉండాలి. ఇదంతా ప్రజాధనం. రికవరీ బాగా ఉంటుందంటే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే అర్థం లేదు’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా సోమవారం కొటక్ తెలిపారు. గతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కూడా ఇలాగే మొండి బాకీల వసూలు కోసం స్ట్రెస్డ్ అసెట్స్ స్థిరీకరణ ఫండ్ (ఎస్‌ఏఎస్‌ఎఫ్) ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2004–05లో ఏర్పాటైన ఎస్‌ఏఎస్‌ఎఫ్‌కు 636 మొండి పద్దులకు సంబంధించి సుమారు రూ. 9,000 కోట్ల ఎన్పీఏలను బదలాయించారు. 2013 మార్చి ఆఖరునాటికి దీని ద్వారా సగానికన్నా తక్కువగా కేవలం రూ. 4,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఎన్పీఏల రికవరీకి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మూడు–నాలుగేళ్లకోసారి తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా గత నెలలో జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కొటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కార్పొరేట్లు మారాలి..: ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించే దిశగా దేశీ కార్పొరేట్లు ఆలోచనా ధోరణిని కొంత మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని కొటక్ చెప్పారు. పెట్టుబడుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. స్థాయికి మించిన రుణాలు లేని కంపెనీలు ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభంలోనూ కనిపిస్తున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కొటక్ సూచించారు. కొత్తగా వ్యూహాత్మక రంగాల్లో సాహసోపేతంగా మరిన్ని పెట్టుబడులు పెట్టాలన్నారు. కరోనా పరిణామాలతో గణనీయంగా కన్సాలిడేషన్ జరగవచ్చని, పలు రంగాల్లో కేవలం కొన్ని సంస్థలు మాత్రమే మిగలవచ్చని కొటక్ చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నిర్వహణ వ్యయాలు, తక్కువ రుణభారం ఉన్న సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాయని విశ్వసిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. విద్య, వైద్యంపై పెట్టుబడులు పెరగాలి.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే వైద్యం, విద్య, పర్యావరణం, గ్రామీణ మౌలిక సదుపాయాలు మొదలైన సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని కొటక్ తెలిపారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.3%గా ఉన్న వైద్య రంగ పెట్టుబడులు కనీసం 5 నుంచి 10%కి పెరగాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్మెంట్లు ఉండాలని కొటక్ సూచించారు. -
రుణాల్లో 15 శాతం మొండివే!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండి బకాయిలు (ఎన్పీఏ) 2017–18 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రుణాల్లో 14.6 శాతానికి చేరాయి. ఆర్బీఐ గణాంకాలను ఉటంకిస్తూ పార్లమెంటులో ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు. దీనిప్రకారం 28%మొండిబకాయిలతో ఐడీబీఐ మొదటి స్థానంలో నిలిచింది. ఎన్‌పీఏల్లో 90% 4,387 బడా రుణ బకాయిదారుల అకౌంట్లకు సంబంధించినవేనన్నారు. వీటి విలువ రూ.8.6 లక్షల కోట్లని తెలిపారు. మార్చి 2014లో ఎన్పీఏలు రూ.2.51 లక్షల కోట్లయితే, 2018 మార్చి చివరకు రూ.9.62 లక్షల కోట్లకు చేరాయి. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలపై తగిన సలహాలు ఇవ్వాలని ఆర్బీఐకి కేంద్రం కోరినట్లు కూడా మంత్రి వివరించారు. బ్యాంకులపై ఆర్బీఐకి అధికారాలు... బ్యాంకింగ్‌కు సంబంధించి ఏర్పడే విభిన్న పరిస్థితులను ఎదుర్కొనడానికి తగిన అధికారాలు అన్నీ రిజర్వ్ బ్యాంక్‌కు ఉన్నాయని మంత్రి శుక్లా పార్లమెంటుకు ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘‘అధికారులను ప్రశ్నించవచ్చు. ప్రత్యేక ఆడిట్‌ను నిర్వహించవచ్చు. బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వవచ్చు’’ అని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల హోల్–టైమ్ డైరెక్టర్ల నియామకాలుసైతం ఆర్బీఐతో సంప్రతింపులతోనే జరుగుతున్నాయి’’ అని మంత్రి వివరించారు. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పార్లమెంటరీ స్థాయి సంఘం (ఫైనాన్స్) ముందు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కావాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. రూ.4,300 కోట్ల బినామీ ఆస్తుల జప్తు ఆదాయపు పన్ను శాఖ జూన్ 30వ తేదీ నాటికి రూ.4,300 కోట్ల విలువపైన బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. బినామీ ఆస్తులు కూడగట్టే వారిపై చర్యలకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐటీ శాఖ ప్రత్యేకంగా 24 బినామీ గుర్తింపు, నిరోధక విభాగాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీలపై ఫిర్యాదులు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం– ఐసీఐసీఐ బ్యాంక్, ఇంజనీరింగ్ సంస్థ– లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)పై సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)కు ఫిర్యాదులు అందినట్లు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రి పీపీ చౌదరి వెల్లడించారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీపై కూడా ఎస్‌ఎఫ్‌ఐఓకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీపై ఫిర్యాదుల వివరాలను ఆయన వెల్లడించలేదు. గడచిన ఐదేళ్లలో 29 లిస్టెడ్ కంపెనీలను కేంద్రం ఎస్‌ఎఫ్‌ఐఓకు రిఫర్ చేసిందన్నారు. వీటిలో నాలుగింటిలో విచారణ పూర్తయ్యిందని, ప్రాసిక్యూషన్స్ ఫైల్ అయ్యాయని వివరించారు. విదేశీ కంపెనీల నుంచిపెరుగుతున్న పన్ను వసూళ్లు 2017–18 అసెస్మెంట్ ఇయర్లో విదేశీ కంపెనీల నుంచి రూ.27,561 కోట్ల పన్ను వసూళ్లు జరిగినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. 2016–17 ఇదే కాలంలో ఈ వసూళ్ల పరిమాణం రూ.24,541 కోట్లని ఈ సందర్భంగా వివరించారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఐడీబీఐలో ఎల్ఐసీకి వాటాపై బోర్డులే నిర్ణయించుకోవాలి
ముంబై: తీవ్ర సమస్యల్లో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వరంగ ఎల్ఐసీ వాటా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉందంటూ వార్తలు రావడంతో కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. ఈ విషయంలో రెండు కంపెనీల బోర్డులే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘‘ఐడీబీఐ బ్యాంకు, ఎల్ఐసీ రెండూ స్వతంత్ర సంస్థలు. అన్ని నిర్ణయాలను బ్యాంకుల బోర్డులకే విడిచిపెట్టాం. సూక్ష్మ స్థాయిలోనూ వాటిని నిర్వహించాలనుకోవడం లేదు’’ అని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ముంబైలో జరిగిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు వార్షిక సదస్సు సందర్భంగా మీడియాకు తెలిపారు. ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీకి ఇప్పటికే 10% పైగా వాటా ఉంది. అయితే, ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తనకున్న వాటాను విక్రయించే ఉద్దేశంతో ఉండగా, కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోతే ఎల్ఐసీనే మరో 40 శాతం వాటాను కొనుగోలు చేయాలని కోరే అవకాశం ఉందని మీడియా కథనాల సారాంశంగా ఉంది. -
30 శాతం వృద్ధి లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 30 శాతం ఆదాయ వృద్ధి అంచనా వేస్తున్నట్లు జీవిత బీమా సంస్థ ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ రామన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం స్థూల ప్రీమియం పరిమాణం .. పదహారు శాతం పెరిగి రూ. 1,783 కోట్లకు చేరిందని ఆయన వివరించారు. కొత్త ప్రీమియంలో 15 శాతం, రెన్యువల్లో 25 శాతం వృద్ధి సాధించామని సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. నిర్వహణలో ఉన్న అసెట్స్ విలువ 23 శాతం పెరిగి రూ. 7,503 కోట్లకు చేరిందని, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి సుమారు 91 శాతం మేర ఉంటోందని వివరించారు. డీమానిటేజేషన్ అనంతరం భారీగా నిధులు బీమా సాధనంలోకి వచ్చాయని, దీంతో 2016–17 క్యూ4లో పాలసీ విక్రయాలు గణనీయంగా జరిగాయని రామన్ తెలిపారు. అయితే, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనూ .. అంతక్రితం క్యూ4 కన్నా మెరుగైన పనితీరే సాధించగలిగినట్లు పేర్కొన్నారు. సరళతరమైన పాలసీలపై దృష్టి.. సులభంగా అర్ధమయ్యే రీతిలో సరళమైన పాలసీలను అందుబాటులోకి తేవడంపై దృష్టి సారిస్తున్నామని రామన్ చెప్పారు. అంతేగాకుండా టెక్నాలజీ తోడ్పాటుతో పాలసీ జారీ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. కస్టమర్ నుంచి సేకరించిన వివరాలు మొదలైనవి ట్యాబ్లెట్ ద్వారా అప్పటికప్పుడు అప్లోడ్ చేసి .. కొన్ని సార్లు గంటల వ్యవధిలోనే జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని రామన్ తెలిపారు. టెక్నాలజీ వినియోగం కారణంగా సంస్థ వ్యయాలు తగ్గి.. ఆ మేరకు వచ్చే ప్రయోజనాలు పాలసీదారులకు బదలాయించడానికి వీలవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 20 పైగా రకాల పాలసీలను విక్రయిస్తున్నామని, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు (యులిప్), చైల్డ్ ప్లాన్స్ అత్యధికంగా విక్రయించే వాటిల్లో ఉన్నాయని చెప్పారు. మరింతమంది ఏజెంట్ల నియామకం.. 3 వేల పైచిలుకు ఫెడరల్, ఐడీబీఐ బ్యాంకుల శాఖల్లో పాలసీలు విక్రయిస్తున్నామని రామన్ పేర్కొన్నారు. అలాగే తమకు సొంతంగా 63 పైగా ఏజెన్సీ బ్రాంచీలు ఉండగా, నాలుగు శాఖలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం 10వేల పైచిలుకు ఏజెంట్లు ఉండగా వీరి సంఖ్యను క్రమంగా పెంచుకుంటున్నామని, ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 12,000–12,500 స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నామని ఆయన వివరించారు. మరోవైపు, జీవిత బీమాపై అవగాహన పెంచే దిశగా మారథాన్స్ మొదలైన వాటిని నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నామని రామన్ పేర్కొన్నారు. అలాగే, క్రీడలకు కూడా ప్రోత్సాహమిస్తూ.. యువ టాలెంట్‌ను గుర్తించి, తోడ్పాటు అందించేందుకు పుల్లెల గోపీచంద్ అకాడమీతో చేతులు కలిపినట్లు ఆయన వివరించారు. టాలెంట్ హంట్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా వేల కొద్దీ దరఖాస్తులు రాగా 26 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు, వీరిలో ఆరుగురు తెలంగాణ నుంచి ఉన్నట్లు రామన్ చెప్పారు. -
ఆ ఉత్తర్వులు సవరించండి..!
జేపీ ఇన్ఫ్రా కేసులో సుప్రీంకు ఐడీబీఐ న్యూఢిల్లీ: జేపీ అసోసియేట్స్– అనుబంధ సంస్థ జేపీ ఇన్ఫ్రాపై దివాలా చర్యలు ప్రారంభించటాన్ని నిలిపేయాలన్న ఉత్తర్వులను సవరించాలని ఐడీబీఐ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఐడీబీఐ వాదనలు వినడానికి అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్వేకర్, జస్టిస్ అమిత్వా రాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం, ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. సీనియర్ అడ్వొకేట్ ఏఎం సింఘ్వీ బ్యాంక్ తరఫున తన వాదనలు వినిపిస్తూ, ఎన్సీఎల్టీ– అలహాబాద్ ఇచ్చిన రూలింగ్‌కు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం వల్ల ఐడీబీఐ తీవ్ర ప్రతికూల పరిస్థితిలో పడిపోయిందని పేర్కొన్నారు. బ్యాంక్ డబ్బు కూడా ప్రజల సొమ్మేనన్న విషయాన్ని పరిశీలించాలని కోరారు. దివాలా ప్రక్రియ ద్వారా ఇతర బ్యాంకింగ్ సంస్థలతోపాటు, గృహ కొనుగోలుదారుల క్లెయిమ్స్నూ పరిరక్షించే వీలుంటుందని అన్నారు. అయితే ఈ వాదనల్లో పసలేదని, గృహ కొనుగోలుదారుల సంతోషానికి కారణమైన ఉత్తర్వులను మార్చాల్సిన అవసరం లేదని గృహ కొనుగోలుదారుల్లో కొందరి తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ అజిత్ సిన్హా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 11న సమగ్ర విచారణ జరుగుతుందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. జేపీ ఇన్ఫ్రాపై దివాలా చర్యలు ప్రారంభించి, ప్రధాన రుణదాతగా ఐడీబీఐ తన డబ్బు వసూలు చేసేసుకుంటే, సాధారణ గృహ కొనుగోలుదారుల సంగతేమిటని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం పేర్కొంది. ఈ అంశంపై ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ), జేపీ ఇన్ఫ్రా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, ఐడీబీఐ బ్యాంక్‌లకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ నిమిత్తం కేసును అక్టోబర్ 10కి వాయిదా వేసింది. -
ఉత్తమమైన కస్టమర్ సర్వీసులు..
12 బ్యాంకులే పాస్.. ముంబై: దేశంలోని 51 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నాయి. ఇవి ‘హై’ రేటింగ్‌ను పొందాయి. ఈ 12 బ్యాంకుల్లో కేవలం ఒకే ఒక ప్రభుత్వ బ్యాంక్ ‘ఐడీబీఐ’ స్థానం పొందింది. మిగతావన్నీ ప్రైవేట్, విదేశీ బ్యాంకులే. బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) తాజాగా వార్షిక కోడ్ కాంప్లియెన్స్ రేటింగ్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. ‘హై’ రేటింగ్ పొందిన బ్యాంకుల్లో ఆర్బీఎల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, సిటీ బ్యాంక్‌లు ఉన్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ స్కోర్ మిగతా అన్నింటికన్నా ఎక్కువగా 95గా నమోదయ్యింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకులు స్కోర్ సగటున 77గా ఉంది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కోర్ 78గా నమోదయ్యింది. ఇది కొంత విచారింపదగిన అంశం. కాగా ఆర్బీఐ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర సంస్థ ఈ బీసీఎస్‌బీఐ. మంచి బ్యాంకింగ్ విధానాలను ప్రోత్సహించడం, పారదర్శకత పెంపొందించడం, కార్యాచరణ ప్రమాణాల మెరుగుదల వంటి పలు అంశాల సాధనే బీసీఎస్‌బీఐ ప్రధాన లక్ష్యం. -
మొండి కొండ @ 7.7 లక్షల కోట్లు
♦ 2016–17లో 35 శాతం పైకి ♦ ప్రైవేటు బ్యాంకుల్లోనూ పెరిగిపోతున్న ఎన్పీఏలు ♦ 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు ♦ యాక్సిస్, యస్ బ్యాంకుల ఖాతాల్లో తేడాలు ♦ ఐవోబీ, ఐడీబీఐ బ్యాంకుల్లోనూ తార స్థాయికి ♦ సరైన స్థాయిలోలేని నిధుల కేటాయింపులు న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు 2016–17 ఆర్థిక సంవత్సరంలోనూ మొండి బకాయిల సమస్య నుంచి బయటపడలేకపోయాయి. సరికదా గత కాలపు రుణాల సమస్యలు వాటిని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. బడా కార్పొరేట్ సంస్థల నుంచి ఛోటా మోటా కంపెనీల వరకు, ఔదార్యంతో భారీగా రుణాలను మంజూరు చేసేసిన బ్యాంకులు... ఇప్పుడు వాటిని వసూలు చేసుకోలేక, రద్దు చేసి అందుకు సరిపడా నిధులు కేటాయించలేక (ప్రొవిజన్స్) ‘మింగలేక కక్కలేక’ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకూ మొండి బకాయిలు (వసూలు కాకుండా మొండిగా మారినవి/ఎన్పీఏలు) ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)కే ఎక్కువ శాతం పరిమితం అనుకుంటుంటే... ఇన్నాళ్లు వాటిని కప్పి పెట్టిన ప్రైవేటు రంగ బ్యాంకుల దాపరికాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎన్పీఏలను వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపిస్తున్నట్టు ఇటీవలి యెస్ బ్యాంకు ఉదంతం తెలియజేస్తోంది. మొత్తానికి దేశీయ స్టాక్ మార్కెట్లో నమోదిత బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.7.7 లక్షల కోట్లకు చేరి సవాల్‌గా మారాయి. ఏడాదిలోనే భారీగా పెరుగుదల మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇప్పటి వరకు దాదాపు అన్ని బ్యాంకులు ప్రకటించాయి. సిటీ యూనియన్ బ్యాంకు వెల్లడించాల్సి ఉంది. ఇటీవలే ఐదు బ్యాంకులను తనలో కలిపేసుకున్న ఎస్బీఐ సైతం కన్సాలిడేటెడ్ ఫలితాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన అన్ని బ్యాంకుల ఖాతా పుస్తకాల ప్రకారం స్థూల ఎన్పీఏలు రూ.7.7 లక్షల కోట్లకు చేరినట్టు స్పష్టమవుతోంది. 2016 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో స్థూల ఎన్పీఏలు రూ.5.70 లక్షల కోట్లు. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొండి రుణాలు 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నికర ఎన్పీఏలు 58 శాతం పెరిగిపోవడం గమనార్హం. కానీ, బ్యాంకులు మొండి బాకీల కోసం చేస్తున్న కేటాయింపులు అరకొరగానే ఉన్నట్టు అర్థమవుతోంది. ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఖాతాల ప్రక్షాళన కార్యక్రమాన్ని 2015–16 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల నుంచే మొదలు పెట్టగా... ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం ఈ ప్రక్రియను గత ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించాయి. దీంతో వాటి ఖాతాల్లోని మకిలి బయటకొస్తోంది. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు ఏకంగా 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు చేరడం దీన్నే సూచిస్తోంది. మరి అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్బీఐలో కలిసిన బ్యాంకులను మినహాయించి చూస్తే) ఎన్పీఏల పెరుగుదల చాలా తక్కువగా 20 శాతంగానే ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో ఒక విధంగా తమ ఖాతాల ప్రక్షాళనను భారీగానే నిర్వహించాయి. ఆర్బీఐ సమీక్షతో వెలుగులోకి పీఎస్బీల్లో మొండి బకాయిల ప్రక్షాళన కార్యక్రమం 2015–16 ద్వితీయార్ధం నుంచి ఆరంభమైంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించిన (ఏక్యూఆర్) ఆర్బీఐ... వసూలు కాకుండా ఒత్తిడిలో ఉన్న రుణాలను ఎన్‌పీలుగా ప్రకటించి వాటికి నిధులు కేటాయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఫలితం 2015 డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్థిక ఫలితాల్లో కనిపించడం ఆరంభమైంది. ఆర్బీఐ ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు 2015 సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ఉన్న స్థూల ఎన్పీఏలను విశ్లేషించి చూస్తే ఆ తర్వాతి కాలంలో పీఎస్‌బీల కంటే ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు అనూహ్యంగా పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏల పెరుగుదల 300% మించి ఉంది. ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు ఈ రెండు బ్యాంకులు ఎన్పీఏలను తక్కువ చేసి చూపించినట్టు స్పష్టమవుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీల విషయమై ఆర్బీఐ నిర్ధారణకు, తమ అంచనాలకు మధ్య తేడా ఉన్నట్టు ఈ రెండు బ్యాంకులు ఇటీవలే ప్రకటించాయి కూడా. ఈ తేడా రూ.9,478 కోట్లు అని యాక్సిస్ బ్యాంకు వెల్లడించగా... యాక్సిస్ ఖాతాల పరంగా వెలుగు చూడని ఎన్పీఏలు రూ.4,177 కోట్లు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో యునైటెడ్ బ్యాంక్, ఐడీబీఐ ఎన్పీఏలు భారీగా పెరిగాయి. పరిమితి దాటితే ఆంక్షలు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఐఓబీ, ఐడీబీఐ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఎన్పీఏల శాతం గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా సత్వర దిద్దుబాటు చర్యల్ని చేపట్టాల్సి ఉంటుంది. అంటే నియమకాలు నిలుపుచేయడం, శాఖల విస్తరణకు బ్రేక్‌వేయడం వం టివి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం చూస్తే... నికర ఎన్పీఏలు 6–9% ఉంటే ఆ బ్యాంకులు రిస్క్ కేటగిరీ–1 పరిధిలోకి వస్తాయి. ఎన్పీఏలు 9–12% ఉంటే రెండో రిస్క్ విభాగంలోకి, 12%పైన ఉన్న బ్యాంకులు మూడో కేటగిరీ కిందకు వస్తాయి. నికర విలువను దాటేసిన ఎన్పీఏలు: మెకిన్సే కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కో దేశీ బ్యాంకుల మొండి బకాయిల సంక్షోభంపై తాజాగా నివేదిక విడుదల చేసింది. దేశీయ బ్యాంకులకు చెందిన ఒత్తిడిలో ఉన్న మొత్తం రుణాలు (పునరుద్ధరించిన రుణాలు సహా) ఈ రంగం మొత్తం నెట్‌వర్త్‌ను మించిపోయాయి. ఈ రంగం నికర విలువ రూ.9.24 లక్షల కోట్లు కాగా, ఒత్తిడిలో ఉన్న రుణాల విలువ రూ.9.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు మెకిన్సే వివరించింది. ‘‘తక్కువ వడ్డీ రేట్ల వాతావరణంలోనూ రుణాల్లో వృద్ధి లేకపోవడం, ఒత్తిడితో కూడిన రుణాలు అధిక స్థాయికి చేరడం, టెక్నాలజీ, నియంత్రణల పరంగా వచ్చిన మార్పులు భారత బ్యాంకింగ్ రంగానికి తుఫాను మాదిరి వాతావరణాన్ని కల్పించాయి’’ అని మెకిన్సే పేర్కొంది. ఎన్పీఏ ఆర్డినెన్స్ పరిధిలో 15 రోజుల్లో ప్రణాళిక! న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ)ల సమస్య పరిష్కారానికి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో పక్షం రోజుల్లో ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేయనుంది. ఎన్పీఏలు రూ. 8 లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశలో ఆర్బీఐకి మరిన్ని అధికారాలను కట్టబెడుతూ ఇటీవలే కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేయడం తెలిసిందే. ఎన్పీఏలకు సంబం ధించి సమస్యల గుర్తింపునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు, సమ స్య పరిష్కార ప్రక్రియలో సమయ కేటాయింపు, నిర్ణయం వంటి అంశాలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్ల డించాయి. ఈ సమస్య 60 నుంచి 90 రోజులు ఉంటుందని కూడా తెలుస్తోంది. బడా మొండిబకాయిలకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐ 50 కేసులను గుర్తించినట్లు సమాచారం. ఆర్డినెన్స్ అమలు పర్యవేక్షణకు కమిటీ ఎన్పీఏ ఆర్డినెన్స్‌ను ఆచరణలో పెట్టే దిశగా ఆర్బీఐ చర్యల్ని ఆరంభించింది. ఇందు కోసం తన అధికార పరిధిలో పర్యవేక్షణ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ సోమవారం ప్రకటించింది. అలాగే, సమస్య తీవ్రత దృష్ట్యా కమిటీని విస్తరించి మరింత మంది సభ్యులకు చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. -
ఐడీబీఐలో 1000 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ).. గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంజీఈఎస్)లో ప్రవేశం కల్పిస్తారు. ఇక్కడ ఏడాది వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్)కోర్సు అభ్యసించాలి. ఇందులో తొమ్మిది నెలలు తరగతి గది బోధన, మూడు నెలలు ఐడీబీఐ బ్యాంక్ బ్రాంచ్ల్లోఇంటర్న్షిప్ ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత మణిపాల్ వర్సిటీ పీజీడీబీఎఫ్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది.దీంతోపాటు అర్హులైన అభ్యర్థులను ఐడీబీఐ బ్యాంక్‌లో గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్‌గా నియమిస్తారు. కేటగిరీల వారీగా ఖాళీలు ఎస్సీ-138, ఎస్టీ-108, ఓబీసీ-285. మొత్తం మీద 41 సీట్లను దివ్యాంగులకు రిజర్వ్ చేశారు. వేతనం: తొమ్మిది నెలల క్లాస్‌రూం ట్రైనింగ్‌లో నెలకు రూ.2,500; మూడు నెలల ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.10,000 స్టైపెండ్ ఇస్తారు. గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్‌గా నియమితులైతే నెలకు రూ.14,400-40,900 పేస్కేల్ ఇస్తారు. కోర్సు ఫీజు: రూ.3,50,000. దీంతోపాటు పరీక్ష ఫీజు చెల్లించాలి. వీటిని వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం ఇస్తారు. ఎడ్యుకేషన్ లోన్: కోర్సు ఫీజు చెల్లించేందుకు ఐడీబీఐ నుంచి రుణం పొందొచ్చు. విద్యార్హత: 2016, అక్టోబర్ 1 నాటికి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 2016, అక్టోబర్ 1 నాటికి కనీసం 20 ఏళ్లు, గరిష్టం 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో జరిగే రాత పరీక్షలో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి. ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇందులో అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీలో సమాధానాలు చెప్పొచ్చు. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.150; ఇతరులు రూ.700 చెల్లించాలి. ముఖ్య తేదీలు 1.ఆన్లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: డిసెంబర్ 9, 2016. 2.హాల్‌టికెట్ల డౌన్లోడ్: 2017, జనవరి 17 తర్వాత 3.ఆన్లైన్ పరీక్ష తేదీ: 2017, ఫిబ్రవరి 3 వెబ్సైట్: www.idbi.com -
ఐడీబీఐలో కొలువుల జాతర
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఐడీబీఐ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వందలమంది ఉద్యోగులను నియమించుకోనుంది. ఈ మేరకు అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ బేస్ గా సుమారు 500 ఎక్జికెటివ్ లను నియమించుకొనేందుకు రంగం సిద్ధం చేసింది. 20-25 మధ్యగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. మూడు సంవత్సరాలపాటు ఈ కాంట్రాక్ట్ అమల్లో ఉండనుంది. మొదటి సంవత్సరంలో నెలకు రూ.17,000 ఏకీకృత వేతం నెలకు ఉంటుంది, రెండవ సంవత్సరంలో రూ.18,500 మూడో ఏడాది రూ 20,000 చెల్లించనుంది. అలాగే మూడేళ్ల కాలాన్నివిజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఎ) ఉద్యోగాలకు అర్హత పొందుతారు. అప్లికేషన్లు, అర్హత, ఆన్లైన్ పరీక్షకేంద్రాలు తదితర పూర్తి వివరాలు ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. -
ఐడీబీఐలో 500 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ).. వివిధ బ్రాంచ్‌లు, కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులను నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ కాల వ్యవధిని ఏడాదిగా పేర్కొన్నప్పటికీ సంస్థ అవసరం, అభ్యర్థి పనితీరు ఆధారంగా మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. మూడేళ్ల కాంట్రాక్ట్ పీరియడ్‌ను విజయవంతంగా పూర్తిచేసినవారు ఐడీబీఐ నిర్వహించే ఎంపిక ప్రక్రియ ద్వారా ‘ఏ’ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్‌గా నియమితులయ్యేందుకు అర్హత పొందుతారు. మొత్తం ఖాళీలు: 500 (ఎస్సీ-85, ఎస్టీ-40, ఓబీసీ-130, ఇతరులు-245. ఇందులో దివ్యాంగులకు-26) వేతనం: మొదటి ఏడాదినెలకు రూ.17,000; రెండో ఏడాది నెలకు రూ.18,500; మూడో ఏడాది నెలకు రూ.20,000 చెల్లిస్తారు. విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి: 2016 అక్టోబర్ 1 నాటికి కనీసం 20 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 25 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం 90 నిమిషాల (గంటన్నర) వ్యవధిలో జరిగే పరీక్షలో 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. తతెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.150; ఇతరులు రూ.700 చెల్లించాలి. ముఖ్య తేదీలు 1. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 30. 2.హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం: డిసెంబర్ 27 తర్వాత 3.ఆన్లైన్ పరీక్ష తేది: 2017 జనవరి 6 వెబ్సైట్: www.idbi.com క్ర.సం. సబ్జెక్టు {పశ్నల సంఖ్య మార్కులు 1. రీజనింగ్ 50 50 2. వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 50 3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 మొత్తం 150 150 -
ఐడీబీఐ జోరు
ముంబై: ప్రభుత్వరంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయ ప్రకటనతో మార్కెట్లో దూసుకుపోతోంది. 2.34లాభంతో 74.35 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 5శాతానికి పైగా ఎగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లో 1.5 శాతం వాటాను వాటా విక్రయించినట్లు వెల్లడించింది. 6.75 లక్షల షేర్లు టీఐఎంఎఫ్ హోల్డింగ్స్‌కు విక్రయించినట్లు బీఎస్ఈకి ఫైలింగ్ లో తెలిపింది. దీంతో ఐడీబీఐ బ్యాంక్ షేరు పట్ల భారీ ఆసక్తి నెలకొంది. గతంలో ప్రభుత్వ రంగ కంపెనీ ఎల్ ఐసీకి దాదాపు 9లక్షల షేర్లను(2శాతం) విక్రయించిన సంస్థ తాజాగా టిఐఎంఎఫ్ హోల్డింగ్స్ కు భారీ వాటాను విక్రయించింది. దీంతో గత ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న ఐడీబీఐ షేర్లు గురువారం నాటి మార్కెట్లో పుంజుకున్నాయి. కాగా బ్యాడ్ లోన్ల కారణంగా గత ఏడాది 13 శాతం వృద్ధితో పోలిస్తే ఇవాల్టి జోరుతో కలిపి ఈ ఏడాది 3శాతం మాత్రమే వృద్ధి చెందింది. -
మాల్యాపై మరో కేసు విచారణ వేగవంతం
ముంబై: ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కు మరోసారి షాక్ ఇచ్చింది. ఐడీబీఐ రుణ అవకతవకల కేసులో సీరియస్ గా స్పందించిన ఈడీ మరో కేసులో విచారణను వేగవంతం చేసింది. యునైటెడ్ స్పిరిట్స్ దాఖలు చేసిన దాదాపు 9వందల కోట్ల రూపాయల ఫారిన్ ఎక్సేంజ్ నిబంధనల అతిక్రమణ ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ మారక నిబంధనల ఉల్లంఘన కోణంలో దర్యాప్తు మొదలు పెట్టినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. యూఎస్ఎల్ సమర్పించిన పత్రాలపై మనీలాండరింగ్ , కేసులో ప్రత్యేక ఆర్థిక విచారణ ఏజెన్సీ ఆధర్యంలో విచారణ జరగనుందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 9 వేల కోట్ల రుణాలు ఎగవేసి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాపై ఈడీ విచారిస్తున్న ఇది రెండవ కేసు కాగా రుణాల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి మొదటిది. యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ మాజీ ఛైర్మన్ విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా రూ 900 కోట్ల మేరకు విదేశీ మారక ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన ధిక్కారం పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. కాగా అక్రమ లావాదేవీల ఆరోపణలతో మాల్యా వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతి పెద్ద లిక్కర్ సంస్థ డియాజియో ఫిర్యాదుల అనంతరం, మరో కేసులో విచారణ వేగవంతం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐడీబీఐ మనీలాండరింగ్ కేసులో మాల్యాకు చెందిన రూ.1411 ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. ఈ ఏడాది మార్చి 13న మాల్యా ఉద్దేశ పూర్వంగా రుణాలను ఎగ్గొట్టినట్టు ముంబై కోర్టు తేల్చి చెప్పింది. అలాగే చెక్ బౌన్స్ కేసులోఏఏఐ దాఖలు చేసిన పిటిషన్ పై దర్యాప్తుకు హాజరు కాని మాల్యాపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
విజయ్ మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్
ఐడీబీఐ నుంచి రూ.900 కోట్ల రుణం కేసులో ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ముంబై: బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్న ‘ఉద్దేశపూ ర్వక రుణ ఎగవేతదారు’ విజయ్ మాల్యా మరింత ఇరుకున పడ్డారు. ఆయన అరెస్టుకు ఇక్కడి ప్రత్యేక కోర్టు (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు జడ్జి పీఆర్ భావ్కీ సోమవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. రూ.900 కోట్లు ఐడీబీఐ బ్యాంక్ రుణం కేసులో మూడుసార్లు సమన్లు పంపినా... మాల్యా పట్టించుకోలేదని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. ఈడీ విజ్ఞప్తి మేరకు మాల్యా డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను కేంద్రం నాలుగువారాల పాటు సస్పెన్షన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. కింగ్‌ఫిషర్ పిటిషన్ కొట్టివేత కాగా ఐడీబీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న రు.900 కోట్ల రుణంలో సగం మొత్తాన్ని విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు మాల్యా వెచ్చించినట్లు ఈడీ చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ... కింగ్‌ఫిషర్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను కూడా ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషన్‌ను దాఖలు చేసిన వెన్వెంటనే కోర్టు దీనిని తోసిపుచ్చింది. మాల్యా తన, అలాగే తన కుటుంబ సభ్యుల దేశ, విదేశాల్లో ఆస్తుల వివరాలను ఈ నెల 21వ తేదీలోపు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణ 26వ తేదీన జరగనుంది. ఇవ్వాల్సిన మొత్తంలో రూ.4,000 కోట్లు చెల్లించడానికి సిద్ధమని మాల్యా చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకింగ్ గ్రూప్ విన్నవించిన నేపథ్యంలో సుప్రీం సంబంధిత ఉత్తర్వులు ఇచ్చింది. బ్యాంకులకు బకాయి వున్న రుణ మొత్తం రూ.6,903 కోట్లలో (వడ్డీకాకుండా) రూ. 4,000 కోట్లు తిరిగి చెల్లించేస్తానని గతంలో మాల్యా సుప్రీంకోర్టుకు విన్నవించారు. వివిధ వ్యాపార వివాదాలకు సంబంధించి తాము దాఖలు చేసిన కేసుల్లో రావాల్సివున్న మొత్తం వస్తే, మరో రూ.2,000 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించారు. అయితే వడ్డీలతో కలిపి మాల్యా వివిధ బ్యాంకులకు రూ. 9.000 కోట్లు బకాయివున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు గతంలో విన్నవించింది. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలకు సంబంధించిన వివాదాన్ని అర్థవంతమైన సంప్రదింపుల ద్వారా, పరిష్కరించుకోవడం పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ.. తగిన మొత్తాలను తన ముందు డిపాజిట్ చేయాలని కూడా మాల్యాను న్యాయస్థానం ఆదేశించింది. ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ కోరతాం: ఈడీ కాగా, నేడు ముంబై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ ఆధారంగా విజయ్‌మాల్యా అరెస్ట్‌కు ఇంటర్‌పోల్ వారెంట్‌ను కోరబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి గ్లోబల్ పోలీస్ సంస్థకు త్వరలో సీబీఐ ద్వారా ఒక లేఖ పంపుతామని ఆ వర్గాలు తెలిపాయి. మార్చి 2న దేశం నుంచి వెళ్లిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. -
40వేల కోట్లతో జాతీయ ఇన్ఫ్రా నిధి
న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే లక్ష్యంతో కేంద్రం రూ. 40,000 కోట్ల జాతీయ పెట్టుబడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)ను ఏర్పాటు చేసింది. దీనికి సీఈవో నియామక ప్రక్రియ జనవరి ఆఖరు నాటికి పూర్తి కాగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రష్యా, సింగపూర్, బ్రిటన్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాల సావరిన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్.. ఎన్ఐఐఎఫ్లో పాలు పంచుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్ఐఐఎఫ్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాలు తెలిపారు. ఫండ్ పనితీరును సమీక్షించేందుకు మార్చిలో కౌన్సిల్ మరోసారి సమావేశమవుతుందని చెప్పారు. ఈ నిధికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్) పెట్టుబడుల సలహాదారుగా ఆరు నెలల పాటు వ్యవహరిస్తుంది. అలాగే ఎన్ఐఐఎఫ్ ట్రస్టీ లిమిటెడ్ సంస్థకు ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ ఏడాది పాటు సలహాదారుగా వ్యవహరిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్‌ఐఐఎఫ్‌కు బడ్జెట్ నుంచి ప్రభుత్వం రూ.20,000 కోట్ల మేర కేటాయింపులు జరపనుండగా, ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి మరో రూ. 20,000 కోట్లు వస్తాయని అంచనా. కొత్త వాటితో పాటు నిలిచిపోయిన ప్రాజెక్టులు, విస్తరణ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా ఆర్థిక మంత్రి వ్యవహరిస్తుండగా, ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి అంజలి చిబ్ దుగ్గల్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో ప్రభుత్వ వాటా 49శాతం లోపు ఉంటుంది. -
ఐడీబీఐ బ్యాంక్‌కు సీబీఐ నోటీసు
న్యూఢిల్లీ/ముంబై: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ రుణం ఇవ్వడంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకుకు ఎంక్వైరీ నోటీసు జారీ చేసింది. ఆర్థిక భారంతో సర్వీసులు నిలిచిపోయిన విజయ్‌మాల్యా నియంత్రణలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ రూ.950 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇంతభారీ మొత్తం రుణం మంజూరు చేయడంలో విశ్వసనీయత కొరవడిందన్నది సీబీఐ నోటీసుల సారాంశంగా తెలుస్తోంది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నెట్‌వర్త్ ప్రతికూలంగా ఉన్నప్పుడు రూ.950 కోట్ల భారీ రుణాన్ని ఐడీబీఐ బ్యాంక్ ఎలా మంజూరు చేసిందో తేలాల్సి ఉందని సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇందుకోసమే ప్రాథమిక విచారణ (పీఈ)కు నోటీసులు జారీ అని తెలిపారు. వివరణ పంపుతాం: బ్యాంక్ సీఎండీ కాగా తాజా వ్యవహారంపై ఐడీబీఐ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) ఎంఎస్ రాఘవన్ వివరణ ఇచ్చారు. ‘‘దీని గురించి సమాచారం అంతా ఉంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను సీబీఐ కోరింది. వాటికి మేము రానున్న కొద్ది రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంది. గతంలో కూడా ఈ తరహాలోనే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కోరడం జరిగింది. బ్యాంకు కూడా సమాధానాలు పంపింది. ఇక్కడ దాయడానికి ఏమీ లేదు. కన్సార్షియం లేదా మల్టిప్లై బ్యాంకింగ్‌లో భాగంగా రుణాలను బ్యాంక్ సమకూర్చింది’’ అని ఆయన అన్నారు. సిండికేట్ బ్యాంక్ నేపథ్యం... ప్రాధాన్యత నిబంధనలకు విరుద్ధంగా కంపెనీల రుణ పరిమితి పెంచేందుకు లంచం తీసుకున్న కేసులో సిండికేట్ బ్యాంక్ సీఎండీ ఎస్.కె.జైన్‌తో పాటు మరో ఏడుగురి అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో సీబీఐ తాజా నోటీసులకు ప్రాధాన్యత ఏర్పడింది. భూషణ్ స్టీల్ కంపెనీ సిండికేట్ బ్యాంకుకు కోట్లాది రూపాయల రుణాలకు సంబంధించిన వాయిదాలను చెల్లించకపోయిన్పటికీ ఆ కంపెనీ రుణ పరిమితిని పెంచేందుకు రూ.50 లక్షల కోసం సంప్రదింపులు జరుపుతున్న జైన్‌ను సీబీఐ అధికారులు ఇటీవలే అరెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాం కుల్లో పాలనాపరమైన కొన్ని సమస్యలున్నాయని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవలి పాలసీ విధాన ప్రకటన సందర్భంలోనూ పేర్కొన్నారు. రుణాల మంజూరులో మరింత పారదర్శకత అవసరమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పాలన వ్యవస్థపై మరోమారు దృష్టిసారించి లోపాలను సరిదిద్దాల్సి ఉందన్నారు. రుణ బకాయిల్లో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ 2012 అక్టోబర్ నుంచీ కార్యకలాపాలను నిలిపివేసింది. ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల బృం దానికి కేఎఫ్ఏ దాదాపు రూ.7,000 కోట్ల బకాయి ఉంది. దీనిలో ఎస్బీఐ వాటా దాదాపు 1,600 కోట్లు.