ఐడీబీఐలో 1000 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ఐడీబీఐలో 1000 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
Published Wed, Nov 30 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ).. గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంజీఈఎస్)లో ప్రవేశం కల్పిస్తారు. ఇక్కడ ఏడాది వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్)కోర్సు అభ్యసించాలి. ఇందులో తొమ్మిది నెలలు తరగతి గది బోధన, మూడు నెలలు ఐడీబీఐ బ్యాంక్ బ్రాంచ్‌ల్లోఇంటర్న్‌షిప్ ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత మణిపాల్ వర్సిటీ పీజీడీబీఎఫ్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేస్తుంది.దీంతోపాటు అర్హులైన అభ్యర్థులను ఐడీబీఐ బ్యాంక్‌లో గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్‌గా నియమిస్తారు.
కేటగిరీల వారీగా ఖాళీలు
ఎస్సీ-138, ఎస్టీ-108, ఓబీసీ-285. మొత్తం మీద 41 సీట్లను దివ్యాంగులకు రిజర్వ్ చేశారు.
వేతనం: తొమ్మిది నెలల క్లాస్‌రూం ట్రైనింగ్‌లో నెలకు రూ.2,500; మూడు నెలల ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.10,000 స్టైపెండ్ ఇస్తారు. గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్‌గా నియమితులైతే నెలకు రూ.14,400-40,900 పేస్కేల్ ఇస్తారు.
కోర్సు ఫీజు: రూ.3,50,000. దీంతోపాటు పరీక్ష ఫీజు చెల్లించాలి. వీటిని వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం ఇస్తారు.
ఎడ్యుకేషన్ లోన్: కోర్సు ఫీజు చెల్లించేందుకు ఐడీబీఐ నుంచి రుణం పొందొచ్చు.
విద్యార్హత: 2016, అక్టోబర్ 1 నాటికి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 2016, అక్టోబర్ 1 నాటికి కనీసం 20 ఏళ్లు, గరిష్టం 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: రెండు గంటల (120 నిమిషాల) వ్యవధిలో జరిగే రాత పరీక్షలో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులను గుర్తించాలి.
ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇందులో అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీలో సమాధానాలు చెప్పొచ్చు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.150; ఇతరులు రూ.700 చెల్లించాలి.
ముఖ్య తేదీలు
1.ఆన్‌లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ: డిసెంబర్ 9, 2016.
2.హాల్‌టికెట్ల డౌన్‌లోడ్:
2017, జనవరి 17 తర్వాత
3.ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2017, ఫిబ్రవరి 3
వెబ్‌సైట్: www.idbi.com
Advertisement
Advertisement