ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను ఐడీబీఐ బ్యాంక్ రూ.1,323 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభంలో 60 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.6,066 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.6,924 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 16.51 శాతం నుంచి 4.90 శాతానికి దిగిరాగా, నికర ఎన్‌పీఏ 1.15 శాతం నుంచి 0.39 శాతానికి దిగొచ్చింది. రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసిన సమయానికి బ్యాంక్ ప్రమోటర్లయిన ఎల్‌ఐసీ, భారత ప్రభుత్వం వద్ద 94.72శాతం వాటా ఉంది. ఎఫ్‌ఐఐల వద్ద 0.40శాతం, డీఐఐల వద్ద 0.24శాతం, రిటైల్ ముదుపర్ల వద్ద 4.62శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment