
ముంబై: ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్), ఐడీబీఐ ఎంఎఫ్ విలీనం చివరి దశకు చేరుకుంది. విలీన ప్రాసెస్ జరుగుతున్నట్లు ఎల్‌ఐసీ ఎంఎఫ్ ఎండీ, సీఈవో టీఎస్ రామకృష్ణన్ పేర్కొన్నారు. కీలకమైన చివరి దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. విలీనానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు.
ఐడీబీఐ ఎంఎఫ్ మాతృ సంస్థ ఐడీబీఐ బ్యాంకులో పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ మెజారిటీ వాటా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రెండు ఎంఎఫ్‌లలో ఒకే ప్రమోటర్‌కు 10 శాతానికి మించి వాటాకు నిబంధనలు అంగీకరించవంటూ ఇటీవల వెలువడుతున్న వార్తల నేపథ్యంలో విలీనానికి ప్రాధాన్యత ఏర్పడింది. రూ. 18,000 కోట్ల విలువైన నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగి ఉన్న ఎల్‌ఐసీ ఎంఎఫ్ విలీనానికి అత్యంత ప్రాధా న్యతను ఇస్తున్నట్లు రామకృష్ణన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment