LIC Mutual Fund
-
ఎల్ఐసీ నుంచి కొత్త ఫండ్..
ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ (LIC Mutual Fund) ‘మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్’ను (multi asset allocation fund) ప్రారంభించింది. ఈక్విటీ, డెట్, బంగారం సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల విలువను వృద్ధి చేసే విధంగా పథకం పనిచేస్తుంది. ఫిబ్రవరి 7 వరకు ఈ ఓపెన్ ఎండెడ్ పథకం చందాలకు అందుబాటులో ఉంటుంది.అంతేకాదు ఫిబ్రవరి 18 నుంచి అమ్మకాలు, కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఈ పథకంలో 65 శాతం పెట్టుబడులకు నిఫ్టీ 500 టీఆర్ఐ, 25 శాతం పెట్టుబడులకు నిఫ్టీ కాంపోజిట్ డెట్ ఇండెక్స్, 10 శాతం పెట్టుబడులకు బంగారం మర్కెట్ ధరలు ప్రామాణికంగా ఉంటాయి. ఒకే పథకం ద్వారా ఒకటికి మించిన సాధనాల్లో పెట్టుబడికి ఈ పథకం వీలు కల్పిస్తుంది.యాక్సిస్ నిఫ్టీ500 మొమెంటం ఫండ్ యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ500 మొమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 7 వరకు అందుబాటులో ఉంటుంది. మరింతగా పెరిగే ధోరణులు కనపరుస్తున్న స్టాక్స్‌ను గుర్తించి, వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్‌లోని స్టాక్స్‌లో, వివిధ మార్కెట్ క్యాప్‌లవ్యాప్తంగా ఇది ఇన్వెస్ట్ చేస్తుంది.తక్కువ వ్యయాలతో విస్తృతంగా పెట్టుబడుల డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువుగా ఉంటుందని యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ ఎండీ బి. గోపకుమార్ తెలిపారు. ఈ ఇండెక్స్ పలు సందర్భాల్లో ప్రధాన సూచీలను కూడా మించి రాబడులు అందించినట్లు సంస్థ సీఐవో ఆశీష్ గుప్తా పేర్కొన్నారు. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. బరోడా బీఎన్పీ పారిబా ఎనర్జీ ఆపర్చూనిటీస్ ఫండ్ వృద్ధికి అవకాశమున్న ఇంధన రంగ స్టాక్స్‌లో పెట్టుబడుల ప్రయోజనాలను అందించే బీఎన్పీ పారిబా ఎనర్జీ ఆపర్చూనిటీస్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది బరోడా బీఎన్పీ పారిబా అసెట్ మేనేజ్మెంట్ ఇండియా సంస్థ. ఈ స్కీము ఫిబ్రవరి 4 వరకు అందుబాటులో ఉంటుంది. ఏ దేశమైనా సంపన్న దేశంగా ఎదగడంలో ఇంధన వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ సీఈవో సురేశ్ సోని తెలిపారు.భారత్ కూడా సంపన్న దేశంగా ఎదుగుతున్న క్రమంలో దేశీయంగా ఇంధనానికి కూడా డిమాండ్ పెరుగుతుందని, దానికి సంబంధించిన స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిఫ్టీ 500 సూచీలో దాదాపు మూడో వంతు స్టాక్స్ ఎనర్జీకి సంబంధించినవి ఉన్నాయని వివరించారు. ఇంధన అన్వేషణ, ఉత్పత్తి, రవాణా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల స్టాక్స్‌లో కనీసం 80 శాతం మొత్తాన్ని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుందని సురేశ్ పేర్కొన్నారు. దీని పనితీరుకు నిఫ్టీ ఎనర్జీ టీఆర్ఐ ప్రామాణిక సూచీగా ఉంటుంది. -
ఎల్ఐసీ నుంచి మాన్యుఫాక్చరింగ్ ఫండ్
ముంబై: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలతో ‘మాన్యూఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. అక్టోబర్ 4 వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ ఈ పథకానికి ప్రామాణికంగా ఉంటుందని పేర్కొంది. తయారీ రంగంలో వైవిధ్యమైన కంపెనీలతో కూడిన పోర్ట్‌ఫోలియోని ఈ పథకం అందిస్తుందని, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, హెవీ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, మెటల్స్, షిప్ బిల్డింగ్, పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలకు ఇందులో చోటు ఉంటుందని వివరించింది.ఈ సందర్భంగా కొత్త పథకం (ఎన్ఎఫ్వో) వివరాలను ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆర్కే ఝా వెల్లడించారు. తయారీ థీమ్ లోని కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పె డుతుందని, ఇన్వెస్టర్లకు మంచి సంపద సమకూర్చడమే మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఆవిష్కరణ ఉద్దేశ్యమని చెప్పా రు. ఇన్వెస్టర్లు రోజువారీగా రూ. 300 లేదా నెలవారీగా రూ.1,000 నుంచి, త్రైమాసికం వారీగా అయితే రూ.3,000 చొప్పున ఈ పథకంలో సిప్ చేసుకోవచ్చని తెలిపారు.‘‘ఈ పథకం అక్టోబర్ 16 నుంచి తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు రోజువారీ సిప్ రూ.100కు, నెలవారీ సిప్ రూ.200కు తగ్గుతుంది. తక్కువ ఆదాయంలో ఉన్న వారు సైతం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని ఝా వివరించారు. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రూ.5,000 నుంచి చేసుకోవచ్చని చెప్పారు. పరిశ్రమ వ్యాప్తంగా 11 మాన్యుఫాక్చరింగ్ ఫండ్స్ ఉన్నాయని, వీటి నిర్వహణలో రూ.34,700 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. -
చివరి దశకు ఐడీబీఐ ఎంఎఫ్ విలీనం
ముంబై: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్), ఐడీబీఐ ఎంఎఫ్ విలీనం చివరి దశకు చేరుకుంది. విలీన ప్రాసెస్ జరుగుతున్నట్లు ఎల్ఐసీ ఎంఎఫ్ ఎండీ, సీఈవో టీఎస్ రామకృష్ణన్ పేర్కొన్నారు. కీలకమైన చివరి దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. విలీనానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఐడీబీఐ ఎంఎఫ్ మాతృ సంస్థ ఐడీబీఐ బ్యాంకులో పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ మెజారిటీ వాటా కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రెండు ఎంఎఫ్‌లలో ఒకే ప్రమోటర్‌కు 10 శాతానికి మించి వాటాకు నిబంధనలు అంగీకరించవంటూ ఇటీవల వెలువడుతున్న వార్తల నేపథ్యంలో విలీనానికి ప్రాధాన్యత ఏర్పడింది. రూ. 18,000 కోట్ల విలువైన నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగి ఉన్న ఎల్ఐసీ ఎంఎఫ్ విలీనానికి అత్యంత ప్రాధా న్యతను ఇస్తున్నట్లు రామకృష్ణన్ వెల్లడించారు. -
స్టాన్చార్ట్తో ఎల్ఐసీ ఎంఎఫ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో యూనీఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విధానం ద్వారా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వీలుంటుంది. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా నగదు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశముంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
పీఎఫ్ బ్రీఫ్స్
ఇక ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎల్ఐసీ నొమూరా మ్యూచువల్ ఫండ్ సంస్థ పేరు మారింది. ఇక నుంచి దీన్ని ఎల్‌ఐఈసీ మ్యూచువల్ ఫండ్‌గా పిలుస్తారు. భాగస్వామ్య కంపెనీ నొమూరా స్థానంలో కార్పొరేషన్ బ్యాంక్, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు వాటాదారులుగా చేరినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్త లోగోను ఆవిష్కరించారు. మేక్‌మై ట్రిప్‌తో బుక్‌మై ఫారెక్స్ జట్టు ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్‌తో విదేశీ మారకద్రవ్య సంస్థ బుక్ మై ఫారెక్స్ చేతులు కలిపింది. ఈ ఒప్పందం ద్వారా మేక్ మై ట్రిప్ ఆన్లైన్ ద్వారా బుక్ మై ఫారెక్స్ సేవలను పొందవచ్చు. దీనివల్ల 200 దేశాలకు మేక్ మై ట్రిప్ ఖాతాదారులు సులభంగా నగదును పంపించుకునే వెసులుబాటు లభించనుంది.