ముంబై: ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలతో ‘మాన్యూఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. అక్టోబర్ 4 వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ ఈ పథకానికి ప్రామాణికంగా ఉంటుందని పేర్కొంది. తయారీ రంగంలో వైవిధ్యమైన కంపెనీలతో కూడిన పోర్ట్‌ఫోలియోని ఈ పథకం అందిస్తుందని, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, హెవీ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, మెటల్స్, షిప్ బిల్డింగ్, పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలకు ఇందులో చోటు ఉంటుందని వివరించింది.
ఈ సందర్భంగా కొత్త పథకం (ఎన్‌ఎఫ్‌వో) వివరాలను ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆర్కే ఝా వెల్లడించారు. తయారీ థీమ్ లోని కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పె డుతుందని, ఇన్వెస్టర్లకు మంచి సంపద సమకూర్చడమే మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఆవిష్కరణ ఉద్దేశ్యమని చెప్పా రు. ఇన్వెస్టర్లు రోజువారీగా రూ. 300 లేదా నెలవారీగా రూ.1,000 నుంచి, త్రైమాసికం వారీగా అయితే రూ.3,000 చొప్పున ఈ పథకంలో సిప్ చేసుకోవచ్చని తెలిపారు.
‘‘ఈ పథకం అక్టోబర్ 16 నుంచి తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు రోజువారీ సిప్ రూ.100కు, నెలవారీ సిప్ రూ.200కు తగ్గుతుంది. తక్కువ ఆదాయంలో ఉన్న వారు సైతం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని ఝా వివరించారు. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రూ.5,000 నుంచి చేసుకోవచ్చని చెప్పారు. పరిశ్రమ వ్యాప్తంగా 11 మాన్యుఫాక్చరింగ్ ఫండ్స్ ఉన్నాయని, వీటి నిర్వహణలో రూ.34,700 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment